Telugu News

క్రీడాలను ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైన ఉంది

క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన సీఎల్పీనేత భట్టి

0

బ్యాట్ పట్టిన  భట్టి.. సంబురంగా చూసిన నేతలు

==క్రీడాలను ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైన ఉంది

== క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన సీఎల్పీనేత భట్టి

(ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్)

సీఎల్పీ నేత భట్టి విక్రమార్క  చాలా రోజుల తరువాత బ్యాట్ పట్టుకున్నారు.. క్రికెట్ అడుతూ సందడి చేశారు..  క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు… గ్రామీణ స్థాయిలో క్రీడాపోటీలను ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైన ఉందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం ఎన్ఎస్ యూఐ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి జూనియర్ కాలేజ్ క్రికెట్ టోర్నమెంట్ స్థానిక ఎస్ఆర్అండ్ బీజీఎన్ఆర్ గ్రౌండ్ లో ఏర్పాటు చేయగా, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రారంభించారు.  ఆయన స్వయంగా క్రికెట్ ఆడారు.బ్యాట్ పట్టుకుని బాల్స్ పై దాడి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  సోనియాగాంధీ జన్మదినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రజల చిరకాల వాంఛ తెలంగాణ రాష్ట్ర బిల్లు ఆమోదం పొందిన డిసెంబర్ – 9 తేదిని పురస్కారానికి చేసుకొని జూనియర్ కాలేజ్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం సంతోషకరమన్నారు. మట్టిలో మాణిక్యాలు చాలా మంది ఉన్నారని, వారందని ఆటను గుర్తించి జాతీయ స్థాయిలోకి తీసుకెళ్లాలని కోరారు. నేటి విద్యార్థులే రేపటి ఈ దేశ పౌరులని చదువులో తో పాటు క్రీడల్లో కూడా విద్యార్థులు ముందుండాలని కోరారు. ఎన్ ఎస్ యూ ఐ విద్యార్థుల పక్షులు అనేక పోరాటాలు చేస్తుందని రానున్న రోజుల్లో విద్యార్థుల హక్కులకై ఎన్ ఎస్ యు ఐ బలమైన పోరాటాలు చేయాలని కోరారు. అలాగే పోరాటంతో పాటు విద్యార్థుల శారీరిక దృఢత్వం కోసం మరియు మానసిక ఉల్లాసం కోసం ఇటువంటి క్రీడా వారోత్సవాలు నిర్వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ యూఐ జిల్లా అధ్యక్షులు వెగినాటి ఉదయ్ కుమార్, జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు యడ్లపల్లి సంతోష్జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పువ్వాళ్ల దుర్గాప్రసాద్రాయల నాగేశ్వరరావు, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు దొబ్బల సౌజన్యజిల్లా కాంగ్రెస్ నాయకులు, ఎస్టిఎఫ్ జిల్లా అధ్యక్షులు సైదులు  తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడ చదవండి: రైతులకు శాపంగా ‘ధరణి’ : భట్టి విక్రమార్క