Telugu News

ఉద్యమ ఖిల్లాలో కూటమికి ఎదురు లేదు : కూనంనేని

రఘురాం రెడ్డి అద్భుత విజయం సాధించడం ఖాయం

0
ఉద్యమ ఖిల్లాలో కూటమికి ఎదురు లేదు : కూనంనేని
== రఘురాం రెడ్డి అద్భుత విజయం సాధించడం ఖాయం
== సమావేశంలో ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు

 

(ఖమ్మం ప్రతినిధి -విజయం న్యూస్)

ఉమ్యమ ఖిల్లాలో ఇండియా కూటమికి ఎదురు లేదని అపూర్వ విజయాన్ని సొంతం చేసుకుంటుందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం శాసన సభ్యులు కూనంనేని సాంబశివరావు తెలిపారు. ఖమ్మం జిల్లా అంటే కమ్యూనిస్టుల కంచుకోట అని ఆయన తెలిపారు. జాతీయ రాజకీయాల దృష్ట్యా కాంగ్రెస్ను బలపరుస్తున్నామని దేశం కోసం కమ్యూనిస్టులు అనేక త్యాగాలు చేశారని, ఈ పొత్తు కూడా త్యాగం లాంటిదేనన్నారు. దేశ ప్రయోజనాల దృష్ట్యా బిజెపిని ఓడించేందుకు కూటమి అభ్యర్థులను గెలిపించాలన్నారు. కమ్యూనిస్టులకు మోసం, దగా తెలియదని కూనంనేని తెలిపారు. మోడీ ఏ ప్రధాన మంత్రి మాట్లాడని
విధంగా నికృష్టంగా మాట్లాడుతున్నారని ఆయనకు రాజ్యాంగంపై గౌరవం లేదన్నారు. హిందువుల మధ్య కూడా ఘర్షణలు జరిగిన చర్రితలు ఉన్నాయి కానీ స్వాతంత్య్ర అనంతరం హిందు, ముస్లింల మధ్య ఘర్షణ జరగలేదని ఆయన తెలిపారు. బిజెపిలో భయం మొదలైందని అందుకే ముస్లింలపై, క్రిస్టియన్లపై దాడులకు తెగబడుతుందన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి రామసహయం రఘురాంరెడ్డి మాట్లాడుతూ నేను పక్కా లోకల్ అని మా నాన్నది చేగొమ్మ గ్రామమని నేను ఖమ్మంలో నామ నాగేశ్వరరావు ఇంటి పక్కనే ఉంటానని మా అత్తగారిది పిండిప్రోలు అని ఆయన తెలిపారు. బిజెపికి ఓటు వేస్తే రూ. 65 పెట్రోలు
రూ.110, రూ.400 గ్యాస్ రూ.1100లకు పెరిగిందన్నారు. రెండు కోట్ల ఉద్యోగాలు ఇవ్వలేని బిజెపి ఇప్పుడు రాముని నినాదాన్ని అందుకుందన్నారు. సెక్యూలర్ శక్తులను బలపర్చి తనకు ఓటువేసి గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ
సమావేశంలో సిపిఐ ఖమ్మంజిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి ఎస్కె సాబీర్ పాషా, రాష్ట్ర
నాయకులు మహ్మద్ మౌలానా, దండి సురేష్, జమ్ముల జితేందర్రెడ్డి, యర్రా బాబు. ఏపూరి లతాదేవి, కొండపర్తి గోవిందరావు, సిద్ధినేని కర్ణకుమార్, ముత్యాల విశ్వనాథం, నరాటి ప్రసాద్, సలీం తదితరులు పాల్గొన్నారు.