Telugu News

తెలంగాణలో మహిళలకు రక్షణ లేదు:రవీంద్రనాయక్

0

తెలంగాణలో మహిళలకు రక్షణ లేదు

== ఇటీవలే 10మంది మహిళలపై దుర్గటనలు జరిగాయి

== ప్రభుత్వం మొద్దునిద్రబోతుంది

== విలేకర్ల సమావేశంలో బీఆర్ఎస్ ప్రభుత్వంపై మండిపడిన బీజేపీ నేత రవీంద్రనాయక్

(రఘునాథపాలెం/ఖమ్మం-విజయంన్యూస్)

తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని, ఇటీవలే రాష్ట్రంలో 10మంది మహిళలపై అత్యాచారాలు జరిగాయని, ఆఘాత్యాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని మాజీ మంత్రి, మాజీ ఎంపీ, బీజేపీ రాష్ట్ర నాయకుడు రవీంద్రనాయక్ ఆరోపించారు.  బీజేపీ జిల్లా కార్యాలయంలోజిల్లా బీజేపీ అధ్యక్షుడు గల్లా. సత్యనారాయణ అధ్యక్షతన  జరిగిన అత్యవసర సమావేశంలో మాజీ మంత్రి, మాజీ ఎంపీ రవీంద్ర నాయక్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని,ఈ మధ్యనే 10 మంది మహిళలు విద్యార్థులు విద్యార్థినులు మరియు చైత్రా అనే 6 సంవత్సరాల చిన్నారి పై అత్యాచారం వరంగల్ లో పీజీ వైద్య విద్యార్థిని డాక్టర్ ప్రీతిని మైనారిటీ వర్గానికి చెందిన సీనియర్ వైద్య విద్యార్థి వేదించాడని అతనే ప్రీతికి మత్తు మందు ఇచ్చినాడు అని ఆమె 95 శాతం జీవించడం నమ్మకం లేదు అని డాక్టర్లు చెపుతున్నారని ఇది లవ్ జిహాద్ అని మా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చెప్పారని

allso read- లిక్కర్ స్కాంలో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి అరెస్ట్

,పెరుగు అన్నం తిని అరుగు మీద పడుకొనే తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నామని బూట్ల చప్పుడు కాదని,విపరీతమైన అవినీతి రైతుల గోస పొడుభూముల పట్టాల సమస్య, మరి ఇటువంటి సమస్యలను పరిష్కరించ కుండ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు డేకాయిట్ పరిపాలన చేస్తున్నాడని దీనిని  అంతం చేయాలని కోరారు.   జిల్లా బీజేపీ అధ్యక్షుడు జీ. సత్యనారాయణ మాట్లాడుతూ ఖమ్మం జిల్లాలో పార్టీ స్ట్రీట్ కార్నర్ మీటింగులతోటి ప్రజలకు మరింత   చేరువయ్యే  విదంగా రోజు,రోజుకి స్థానికంగా బలపడటం చూసి భయపడి రాష్ట్ర మంత్రి పువ్వాడ.అజయ్ కుమార్ వాడ వాడకు పువ్వాడ పేరుతో ప్రదక్షిణలు చేస్తున్నారు అని మీకంటే ముందు ఈ దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు ఇంటి,ఇంటికి కూడా నరేంద్రమోదీ గారు వెళ్లిపోయారని,కోవిడ్ సమయంలో ఈ దేశము ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉన్నప్పటికీ దేశ ప్రజల అందరికి ఉచ్చిత వ్యాక్షినేషన్ పంపిణీ చేసి ప్రజల ప్రాణాలు కాపాడిన గొప్ప నాయకుడని,ఆయన నాయకత్వం వహించే బీజేపీ పార్టీని మీరు ఎమీ చేయలేరని, దేశంలోమరియు తెలంగాణ లో అధికారంలోకి వచ్చేది

మేమే అని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో  బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి శ్యామ్ రాథోడ్, ఉపాధ్యక్షురాలు మందా. సరస్వతి,1టౌన్ కార్యదర్శి ఢీకొండ. శ్యాం,ఓబీసీ మోర్చా అధ్యక్షుడు డాక్టర్ అజయ్,మొగిలి శ్రీనివాస్, చింతపల్లి వీరస్వామి పాల్గొన్నారు.

allso read- “కందాళ”కు పరీక్షే నా..?