Telugu News

ఇల్లందు బిఆర్ఎస్ కు కొనసాగుతున్నఅసమ్మతి

ఎమ్మెల్యే హరిప్రియకు టికెట్ ఇస్తే మూకుమ్మడి రాజీనామాలంటూ డిమాండ్

0

ఇల్లందు బిఆర్ఎస్ కు కొనసాగుతున్నఅసమ్మతి

== మండలాల వారిగా ఏకమవుతున్న ప్రజాప్రతినిధులు

== ఎమ్మెల్యే హరిప్రియకు టికెట్ ఇస్తే మూకుమ్మడి రాజీనామాలంటూ డిమాండ్

== ఇప్పటికే స్పష్టం చేసిన తిరుగుబాటుదారులు

== ఎట్టి పరిస్థితిలో బీఫామ్ అడ్డుకుంటామంటున్న కీలక నాయకులు

(ఇల్లందు-విజయం న్యూస్):

దేవుడు వరమిచ్చిన..పూజారి వరమివ్వనట్లుగా మారింది ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియ పరిస్థితి.. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసేందుకు సీఎం కేసీఆర్ టిక్కెట్ కేటాయించగా, ఇల్లందు నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకుల్లో కొందరు ఆమెకు టిక్కెట్ ఇవ్వటాన్ని బహిరంగంగానే వ్యతిరేకిస్తున్నారు.

ఇది కూడా చదవండి:-;సీఎం కేసీఆర్ కు విక్రమార్కుడే టార్గెటా..?

ఇప్పటికే మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ మధ్య హోరాహోరీ పోరు నడుస్తుండగా, మరో కొంత మంది ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో అసమ్మతి గళం వినిపిస్తున్నారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలై ప్రచారం చేసుకునే సమయంలో టిక్కెట్ ను వెనక్కి తీసుకోవాలని, మరోకరికి అవకాశం కల్పించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ నాయకులు అసమ్మతిని రగిలిస్తున్నారు. ఒక వైపు ఎన్నికల వాడివేడి పెరుగుతుండగా, మరో వైపు ఇల్లందు బీఆర్ఎస్ పార్టీలో అసమ్మతి గళం రగులుతుండటం గమనర్హం.

ఇల్లందు నియోజకవర్గంలో  రోజురోజుకు అసమతి సెగ రగులుతోంది. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, పదుల సంఖ్యలో ప్రజాప్రతినిధులు హరిప్రియ కు బీఫాం ఇవ్వోద్దంటూ తిరుగుబాటు జెండాను ఎగరేస్తున్నారు.  బీఫామ్ ఇస్తే మూకుమ్మడి రాజీనామాలకు సిద్ధమని సాంకేతాలు ఇస్తున్నారు.  ఇప్పటికైనా అధిష్టానం ఆలోచించి టికెట్ మార్చాలని డిమాండ్ చేస్తున్నారు.

ఇది కూడా చదవండి:- ఇల్లందులో పలు కుటుంబాలు కాంగ్రెస్ లో చేరిక

అభ్యర్థి మార్పు జరిగితే భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని స్పష్టం చేస్తున్నారు .ఇటీవల గార్ల,బయ్యారం మండలాల్లో పెద్ద ఎత్తున సమావేశమైన నాయకులు, ప్రజాప్రతినిధులు తమ వ్యతిరేక గళాన్ని బహిరంగానే వినిపించారు.

== అధిష్టానం దృష్టి:

ఇల్లందు నియోజకవర్గంలో చోటు చేసుకుంటున్న పరిణామాల పట్ల అధిష్టానం దృష్టి సారించింది. ఎన్నికల పరిశీలకుడి తోపాటు మంత్రులతో చర్చిస్తోంది .రెండు ,మూడు రోజులలో అసమతి వర్గం దారిలోకి రాకపోతే మార్పు పై తీవ్రంగా చర్చించే అవకాశం ఉంది .ఇదే విషయాన్ని అసమ్మతి వాదులు బహిరంగంగానే చెబుతున్నారు. పార్టీ నుంచి మాట్లాడదామని అసమతి వాదులను ఆహ్వానించిన వ్యతిరేకవర్గం మెట్టు దిగడం లేదు.

== ఎందుకింత రచ్చ

టిఆర్ఎస్ లో ఎందుకు ఇత రచ్చ జరుగుతుందంటే కారణాలు లేకపోలేదు . అమ్మతి వర్గం ద్వారా తెలిసింది. ఏమిటంటే షాడో ఎమ్మెల్యేగా హరి సింగ్ ముద్రపడ్డాడు. ఇది వారు బహిరంగ చెప్తున్న విషయాలు .అంతేకాదు ఎదురు తిరిగిన వారిని

ఇది కూడా చదవండి:- అందరికీ సొంత ఇల్లు ఉండాలనేదే కేసీఆర్ ధ్యేయం: రవిచంద్ర

భయపెట్టడం ,భయపెట్టించడంఆనవాయితీగా నాలుగు సంవత్సరాలుగా వస్తుంది. కీలకమైన నేతలపై కేసులు పెట్టించి నానా రకాలుగా ఇబ్బందులు పెట్టడం తెలిసిందేనంటున్నారు .అంతేగాక ఉద్యమకారులపై కేసులు పెట్టించి నరకయాతన చూపించిన దాఖలాలు ఉన్నాయంటూ ప్రత్యేకించి చెప్తున్నారు. భూకబ్జాలు దందాలు తోపాటు ప్రతి పనిలో పర్సంటేజ్ తీసుకొని పార్టీకి ద్రోహం చేశారన్నది వీరి వాదన .ఇంకా చెప్పాలంటే ఓసి లో ట్రాన్స్పోర్ట్ ను అడ్డుపెట్టుకొని అడ్డంగా దోచుకుంటున్నాడని ప్రధాన ఆరోపణ .ఆ సొమ్ముతోటే హరిప్రియ ఫౌండేషన్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేశాడని ముక్కు సూటిగా చెప్తున్నారు. ఇంకా తెలియని రహస్యాలు చాలా ఉన్నాయని పార్టీ అనుమతిస్తే బహిరంగగా చర్చిస్తామని అంటున్నారు.

== పొంచిఉన్న బీఫామ్ గండం:

ప్రస్తుత పరిస్థితులను పరిశీలిస్తే బీఆర్ఎస్ కు పెద్ద షాకే తగలనందంటే నిజమేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఎందుకంటే మండలాల వారిగా ప్రజాప్రతినిధులను కీలక నాయకులను అసమతి వర్గం ఏకం చేస్తూ ముందుకు నడుస్తుంది. మంత్రుల దృష్టికి ఎప్పటికప్పుడు జరుగుతున్న పరిణామాలను వివరిస్తున్నారు.

ఇది కూడా చదవండి:- తెలంగాణలో నవంబర్ 30న పోలింగ్

ఇప్పటివరకు పేరు మాత్రమే ప్రకటించారు ఇంకా బీఫామ్ చేతికి రాలేదు. ఈ పరిణామం బట్టి చూస్తే ప్రస్తుత ఎమ్మెల్యేకు బీఫామ్ గండం ఉందని అసమతి వర్గాల ద్వారా తెలుస్తుంది. అభ్యర్థి మార్పు జరిగితే ఆశ్చర్యం లేదంటున్నారు. అభ్యర్థి మార్పు జరిగే విషయంలో ఆశ్చర్యం లేదంటున్నారు .ఇది ఇలా ఉంటే పార్టీ పరిస్థితి రోజురోజుకు దిగజారుతుంది నియోజకవర్గంలోని కార్యకర్తలు అయోమయంకు గురవుతున్నారు. పార్టీలో వర్గాలు ఏంటి అసమతి  అసంతృప్తులు రోజురోజుకు పెరుగుతున్న పై బిఆర్ఎస్ విజయం పట్ల కార్యకర్తలు నిరాశతో ఉన్నారు . అసమ్మతి పెరుగుతుందా లేక అధిష్టానం పరిష్కరిస్తుందా వేచి చూడాలి.