Telugu News

‘పాలేరు’ నుంచి తుమ్మల పోటీ చేయాలి

ఖమ్మం రూరల్ లో  ఈ రోజు 3గంటలకు  సమావేశం కానున్న నేతలు, కార్యకర్తలు

0

‘పాలేరు’ నుంచి తుమ్మల పోటీ చేయాలి

==  తుమ్మలకు మద్దతుగా ఆయన వర్గీయుల ముకుమ్మడి రాజీనామాలు

== ఖమ్మం రూరల్ లో  ఈ రోజు 3గంటలకు  సమావేశం కానున్న నేతలు, కార్యకర్తలు

== త్వరలో కాంగ్రెస్ లో చేరికలు

(కూసుమంచి-విజయంన్యూస్)

మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరావు కచ్చితంగా పాలేరు నుంచి పోటీ చేయాలని ఆయన  ముఖ్య అనుచరులు, అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. ఆయనకు మద్దతుగా  బీఆర్ఎస్ పార్టీకి ముకుమ్ముడి రాజీనామాలకు సిద్దమైయ్యారు.. పాలేరు నియోజకవర్గ వ్యాప్తంగా కార్యకర్తలు, నాయకులు అత్యవసరంగా సమావేశమై అందరు కలిసి ముకుమ్మడి రాజీనామాలు ప్రకటించే అవకాశం ఉంది..

ఇది కూడా చదవండి: తుమ్మల “ఖమ్మం” లో పోటీ..?

బీఆర్ఎస్ పార్టీ టిక్కెట్లు ప్రకటించిన అనంతరం పాలేరు టిక్కెట్ ను ఆశించిన తుమ్మల నాగేశ్వరరావుకు సీఎం కేసీఆర్ టిక్కెట్ ఇవ్వకపోవడంతో అసంత్రుప్తిని వ్యక్తం చేసిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఆ తరువాత ఆ పార్టీకి రాజీనామా చేసింది  ఏఐసీసీ అగ్రనేత రాహుల్, సోనియాగాంధీ, ఖర్గే ల సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. దీంతో ఆయన అనుచరులు, అభిమానులు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయకపోగా ఇతర పార్టీలో చేరలేదు.. కాగా అతి త్వరలో తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం జిల్లాకు వస్తున్న సందర్భంలో ఆయన అనుచరులందరు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసే, కాంగ్రెస్ పార్టీలో చేరాల్సి ఉంది.. అందుకే శుక్రవారం పాలేరు నియోజకవర్గంలోని ముఖ్యనాయకులు, కార్యకర్తలు, అభిమానులదంరు ఖమ్మం రూరల్ మండలంలోని శ్రీ సిటి లో తుమ్మల నివాసంలో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో తుమ్మల నాగేశ్వరరావు పాలేరులో పోటీ చేయాలని తీర్మానం చేయనున్నారు. అనంతరం విలేకర్ల సమావేశం నిర్వహించి, బీఆర్ఎస్ పార్టీకి రాజీనామాలు చేసినట్లుగా ప్రకటించనున్నారు.

ఇది కూడా చదవండి: పాలేరు కు పొంగులేటి