ఆయనవి అన్ని పచ్చి అబద్ధాలే: కొండూరు సుధాకర్
*ఎన్నికల కోసం పెట్టిన పథకమే దళిత బంధు*
*దళితులను అన్ని విధాల మోసం చేసిన ఘనత కేసిఆర్ దే..*
*కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీలు అమలు*
*సత్తుపల్లి విలేకరుల సమావేశంలో కొండూరు సుధాకర్ హామీ.
(సత్తుపల్లి-విజయం న్యూస్)
PENDRA ANJAIAH
కల్లూరు సభకు వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ పచ్చి అబద్ధాలు మాట్లాడి వెళ్లిపోయారని కాంగ్రెస్ పార్టీ సత్తుపల్లి నియోజకవర్గ నాయకులు కొండూరు సుధాకర్ విమర్శించారు. గురువారం సత్తుపల్లి క్యాంపు కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 35 నిమిషాలు మాట్లాడిన కేసీఆర్ దళిత బంధు కోసం అధిక సమయం కేటాయించి దళితులను అన్ని రకాలుగా మోసం చేశారని ఆరోపించారు.
All so read- ఇల్లందులో ఆ పార్టీ విజయం తథ్యం: జోస్యం చెప్పిన ఎంపీ
దళితులకు ముఖ్యమంత్రి, డబల్ బెడ్ రూమ్ ఇల్లు, నిరుద్యోగ భృతి తదితర సంక్షేమ పథకాలను ప్రవేశపెడతానని చెప్పి ఒక్కటి కూడా నెరవేర్చలేదని దుయ్యబట్టారు. హుజురాబాద్ ఉప ఎన్నికల కోసమే దళిత బంధు తీసుకొచ్చారని, సత్తుపల్లి నియోజకవర్గంలో 1100 మంది ఇవ్వాల్సి ఉంటే కేవలం వంద మాత్రమే ఇచ్చాడని, 1000 ఇప్పటివరకు ఇవ్వలేదన్నారు. 1100 ఇవ్వలేనోడు నియోజకవర్గంలో మొత్తం దళిత బంధు ఇస్తానంటే దళితులు ఎలా నమ్ముతారని ప్రశ్నించారు. ఎన్నికల కోడ్ వస్తుందని తెలిసి దళితులను మరో మారు మోసం చేసేందుకు కేసిఆర్ కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. కెసిఆర్ చెప్పింది ఏది అమలు చేయలేదని, ఇప్పటివరకు రాష్ట్రంలో మాదిగ సామజిక వర్గానికి మంత్రి లేడని అన్నారు.
Allso read-కొత్తగూడెం సీపీఐ కౌన్సిలర్లలో అసక్తికర మార్పు
దళితులను కేవలం ఓటు బ్యాంకు కోసం మాత్రమే ఉపయోగించుకుంటున్నాడని, మంద కృష్ణ మాదిగను జైల్లో పెట్టారని గుర్తు చేశారు. కల్లూరు సభలో సింగరేణి పై ఊసే లేదని అన్నారు. వీటన్నిటిపై ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతోనే ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని తెలిపారు. బీఆర్ఎస్ నాయకుల బూటకపు ప్రచారాన్ని ప్రజలు నమ్మవద్దని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అన్ని వర్గాల పేదలకు మేలు జరుగుతుందని ఈ సందర్భంగా ఆయన అన్నారు.
Allso read:- ఇందిరమ్మ రాజ్యం కోసం…! ఒక్కొక్కరూ ఒక్కో శీనన్న కావాలి…!!
ఈ సమావేశంలో, కొత్తూరు కోటేశ్వరరావు, మందపాటి ముత్తా రెడ్డి, ఉడతనేని అప్పారావు, మందపాటి రవీంద్రారెడ్డి, నాయుడు రాఘవరావు, మల్ రెడ్డి పూర్ణచంద్రారెడ్డి, కంభంపాటి కాంతారావు, గాదిరెడ్డి సుబ్బారెడ్డి, గుగులోతు భాషా నాయక్, ధరావత్ నాగరాజు,యంగల సురేష్, ఇనపనూరి ఉదయ్ కుమార్, ప్రసాద్ యాదవ్, హనుమంతరావు, సత్యనారాయణ, గుడ్ల సుధాకర్, తదితరులు పాల్గొన్నారు.*