Telugu News

మీరుండగా వాళ్లు నన్నేం పీకలేరు..: మంత్రి పువ్వాడ

చక్రం తిప్పుడు కాదు.. కారు చక్రాలకు కొట్టుకపోతరు

0

మీరుండగా వాళ్లు నన్నేం పీకలేరు..: మంత్రి పువ్వాడ

== చక్రం తిప్పుడు కాదు.. కారు చక్రాలకు కొట్టుకపోతరు

== ఐదేళ్లు పనిచేసి తట్టెడు మట్టిపోసిండ్రా

== మంత్రి పువ్వాడ ‘నాటు’ వ్యాఖ్యలు

== నేను మంత్రి అయితే మీరు మంత్రే

== గ్రామాల్లో మీరే కథానాయకులు

== తహసీల్దార్, పోలీసులు మిమ్మల్ని చూస్తే భయపడతరు

== ఐదు నెలలు అప్రమత్తంగా ఉండండి

== కార్యకర్తలకు పిలుపునిచ్చిన మంత్రి పువ్వాడ

(ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్)

రాజకీయాల్లో కొత్తపిచ్చోళ్లు, సీఎం కేసీఆర్ ను అడ్డంపెట్టుకుని బాగా సంపాధించినోళ్లు నన్ను గేటు దాటనీయనంటున్నడు.. గిరిజన బిడ్డలున్నంతకాలం నువ్వేమి పీకేదేమి లేదని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రఘునాథపాలెం మండలంలోని ఈర్లపూడి గ్రామంలో జరిగిన రైతు విజయోత్సవ వేడుకల్లో ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై మండిపడ్డారు. నేనంటే ఏంటో గిరిజన బిడ్డలందరికి తెలుసని, నేను చేసే అభివద్ది గిరిజన బిడ్డలు, ప్రజలు రెండు కండ్ల తో  చూస్తున్నారని అన్నారు.

ఇది కూడా చదవండి: రైతులకు శుభవార్త చెప్పిన మంత్రి పువ్వాడ

కొత్త బిచ్చగాళ్లు రాజకీయాలంటే ఏదో ఊహించుకుని పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారని ఆరోపించారు. నన్ను అసెంబ్లీ గేటు దాటనీవ్వని అంటున్నారని, కానీ ప్రజలు, గిరిజనుల అండ ఉన్నంత కాలం నన్నేమి పీకలేరని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ ను గద్దే దించడం మీ వల్ల అవుతుందా..? అని ప్రశ్నించారు. గ్రామాల్లో ఉన్న వద్ద చక్రం తిప్పతామని అంటున్నరని, గిరిజన బిడ్డలు అమ్ముడు పోవడానికి సిద్దంగా లేరని, డబ్బుల మూటతో వచ్చినంత మాత్రానా అయిపోతుందని అనుకుంటున్నారా..? అజయ్ అన్నా ఇలాంటివి చాలా చూశానని అన్నారు.  కచ్చితంగా గిరిజన బిడ్డలు నడిపే కారు చక్రాల కింద నలిమేస్తారని అన్నారు. గతంలో ఐదేళ్లు పనిచేసిన ఎంపీలు, ఎమ్మెల్యేలు తట్టేడు మట్టి పోసిండ్రా అని ప్రశ్నించారు. గ్రామాల్లో కార్యకర్తలందరు సైనికుళ్లా, కథానాయకులుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. రాబోయే రోజుల్లో అజయ్ అన్నకు అండదండలుగా ఉండలన్నారు. అజయ్ అన్న మంత్రిగా ఉంటే మీరు కూడా ప్రతి ఒక్కరు మంత్రేనని, గ్రామాల్లో మీకు మీరే మంత్రులని అన్నారు. మంత్రి అజయ్ గ్రామాల్లో ప్రజలందర్ని పేరు పెట్టి పిలుస్తాడని, తద్వారా మిమ్మల్ని చూస్తే పోలీసులకు, తహసీల్దార్, ఎంపీడీవోలకు భయమేస్తుందన్నారు. అజయ్ అన్న మనుషులంటూ తహసీల్దార్, పోలీసులు భయపడి మీకు పనులు చేస్తారని అన్నారు.

ఇది కూడా చదవండి: రైతు పక్షపాతి సీఎం కేసీఆర్: మంత్రి పువ్వాడ

మిమ్మల్ని చూస్తే, మీ జోలికి రావాలంటే  పోలీసులు, తహసీల్దార్ లు ఉ… పోసుకుంటారని సంచలన వ్యాఖ్యలు చేశారు. మీకున్న ఈ గౌరవాన్ని నిలబెట్టుకోవాలంటే ప్రతి ఒక్క నాయకుడు, కార్యకర్తలు మీరందరు కథానాయకులు కావాలని పిలుపునిచ్చారు. మీరంత ఈ ఐదునేలల కాలం వరకు సైనికుళ్లా ఉండాలని, కథనాయకులుగా మారి అప్రమత్తంగా ఉండాలని, శత్రువులేవరైనా సరే తుత్తునీయులను చేసి గులాబీ జెండాను రేపరేపలాడేలా చేసుకోవాలని పిలుపునిచ్చారు. గ్రామాలను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. మీకు అజయ్ అన్న ఉన్నాడని, అర్థరాత్రైనా, ఏ పూట వచ్చిన మీకు కావాల్సిన పనులు చేసేందుకు నేను సిద్దంగా ఉన్నానని అన్నారు. 9ఏళ్లు ఎలా పనిచేశానో..? రాబోయే రోజుల్లో కూడా అదే తరహాలో పనిచేస్తానని హామినిచ్చారు. సేవలాల్ మహారాజ్ గుడి కావాలని అడుగుతున్నారని, గుడి కట్టిస్తానని హామినిచ్చారు. కమ్యూనిస్టు కుటుంబంలో పుట్టానని, అజయ్ అన్న మాటమార్చుడు ఉండదన్నారు. అజయ్ అన్న మీకు అందుబాటులో ఉంటాడని, ఈ ఐదు నెలల పాటు రాజకీయాలు చేయాల్సిన అవసరం ఎంతైన ఉందన్నారు. ఎవరైతే పరిపాలన పట్ల అబద్దాలు మాట్లాడితే వారి నాలుక కోచే విధంగా నాయకులు, కార్యకర్తలు సైనికుళ్లా పనిచేయాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ పార్టీ ఏం చేయలేదో ప్రజలు ఆలోచించుకోవాలని కోరారు. అన్ని రకాలుగా డెవలఫ్ మెంట్ చేశానని, రఘునాథపాలెం మండలాన్ని రోల్ మోడల్ గా చూపిస్తానని హామినిచ్చారు. సీఎం కేసీఆర్ హ్యట్రిక్ ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఉందని, పువ్వాడ ముచ్చటగా మూడోవ సారి గెలవాలని, అందుకు మీరు కథానాయకులుగా మారి పనిచేయాలని పిలుపునిచ్చారు.

ఇది కూడా చదవండి: దేశానికే తెలంగాణ ఆదర్శం:- మంత్రి పువ్వాడ