Telugu News

తిరుమలాయపాలెం పోలీసులకు సవాలు విసురుతున్న దొంగలు

డీసీసీబీ బ్యాంక్ లో మరోసారి చోరికి యత్నం

0
తిరుమలాయపాలెం పోలీసులకు సవాలు విసురుతున్న దొంగలు
== డీసీసీబీ బ్యాంక్ లో మరోసారి చోరికి యత్నం
== ఫలించని దొంగల ప్రయత్నం
 తిరుమలాయపాలెం, నవంబర్ 2 (విజయం న్యూస్)
పోలీసులకు దొంగలు సవాల్ విసురుతున్నారు.. వారం రోజుల వ్యవధిలోనే రెండు సార్లు ఒకే చోట చోరికి పాల్పడేందుకు ప్రయత్నం చేసి ’నన్నేమి చేయలేవురా..? అన్నట్లుగా సవాీల్ విసురుతూ చోరిలకు ప్రయత్నం చేస్తున్న సంఘటన తిరుమలాయపాలెం మండల కేంద్రంలో చోటు చేసుకుంది.. పూర్తి వివరాల్లోకి వెళ్తే
 తిరుమలాయపాలెం మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ కు కూతవేటు దూరంలో ఉన్న డిసిసిబి బ్యాంకులో పలుమార్లు దొంగలు చోరీకి పాల్పడ్డారు గతంలో పోలీస్ స్టేషన్ కు అతి సమీపంలో ఉన్న వెంకటేశ్వర్లు షాపులో దొంగతనాలకు పాల్పడి 18 వేల రూపాయలను సిగరెట్ ప్యాకెట్లను ఎత్తుకెళ్లిన విషయమై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
మండల కేంద్రాల్లోని పలువురు నివాసాలలో చోరీకి ప్రయత్నించినట్టు అంతేకాకుండా మండలంలోని శ్రీ ఆంజనేయస్వామి దేవాలయంలో చోరీకి ప్రయత్నాలు చేశారని  గ్రామస్తులు తెలిపారు ఇటీవల వారం రోజుల వ్యవధిలో రెండుసార్లు డిసిసిబి బ్యాంకులో దొంగల ముఠా దొంగతనాలకు పాల్పడ్డారు మొదట సారి చోరీ ప్రయత్నం కిటికీ ఇనుప రాడ్లను విరగగొట్టి లోపలికి చొరబడి  ఏటీఎం మిషన్ తెరచి చోరీకి ప్రయత్నించిన విషయం విధితమే ఇలా ఉండగా గురువారం రాత్రి ప్రధాన గేటు నుండి వెళ్లి తూర్పు దిక్కున ఉన్నటువంటి తలుపులు బేడాలను ధ్వంసం చేసి నగదు దొంగలించే ప్రయత్నం చేసి విఫలమయ్యారు చోరీకి ప్రయత్నించిన దొంగలు ముఖానికి మాస్కులు ధరించి బ్యాంకు లోపలికి చొరబడినట్లు బ్యాంకు లోపల స్ట్రాంగ్ రూమ్ తెరిచే ప్రయత్నం చేసి విఫలమయ్యారని  గుర్తించారు మండల కేంద్రంలో పోలీస్ స్టేషన్ పరిధిలోని పలుమార్లు దొంగలు దొంగతనాలకు పాల్పడటం పోలీసులకు సవాలు గా మారిందని మండలంలోని ప్రజలు ఆందోళన చెందుతున్నారు ఒకే బ్యాంకులో రెండుసార్లు చోరీకి గురి కావడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి బ్యాంకుల్లో నగదు బంగారం నిలువ చేసుకున్న ఖాతాదారులు మా సొమ్ముకు భద్రత ఉంటుందా లేదా అని ఆందోళన చెందుతున్నారు ఈ విషయమై పోలీస్ అధికారులు సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షించి దొంగల ముఠాలకు చెక్ పెట్టాలని ఖాతాదారులు, ప్రజలు,  సిబ్బంది అన్నారు సర్కిల్ ఇన్స్పెక్టర్ సతీష్ కుమార్, పిఎసిఎస్ చైర్మన్ చావా వేణుగోపాలకృష్ణ, కూసుమంచి సబ్ ఇన్స్పెక్టర్ రమేష్, సీఈఓ శ్రీనివాసరెడ్డి పరిశీలించారు తిరుమలయపాలెం ఏఎస్ఐ రాఘవయ్య, కానిస్టేబుల్ రామకృష్ణ, హరికృష్ణ పరిశీలన సమయములో ఉన్నారు