Telugu News

తుల ఉమాను అడ్డుకున్న టీఆర్ఎస్ నేతలు

స్థానికేతురలకేం పని హుజురాబాద్ లో అంటూ తిట్లదండకం

0

*🔹తుల ఉమను అడ్డుకున్న తెరాస శ్రేణులు*

(హుజురాబాద్-విజయం న్యూస్)

*హుజూరాబాద్‌లోని హిమ్మత్‌నగర్‌ ఉన్నత పాఠశాల పోలింగ్‌ కేంద్రానికి జడ్పీ మాజీ ఛైర్మన్‌, భాజపా నేత తుల ఉమ రావడంపై తెరాస కార్యకర్తలు అభ్యంతరం తెలిపారు. స్థానికేతరురాలైన తుల ఉమ రావడంతో వారు ఆందోళనకు దిగారు. కారు దిగి వెళ్తున్న ఉమను అడ్డుకుని వెనుదిరగాలని డిమాండ్‌ చేశారు. ఈ క్రమంలో తెరాస- భాజపా వర్గీయుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పోలీసులు అక్కడికి చేరుకుని వారిని చెదరగొట్టారు.*