Telugu News

దాహం..దాహం..?

*చిన్న గుడూరు మండల కేంద్రంలో మంచి నీటి కష్టాలు

0

దాహం..దాహం..?

*చిన్న గుడూరు మండల కేంద్రంలో మంచి నీటి కష్టాలు

*గ్రామంలోని కొన్ని వార్డులలో వారం రోజులుగా నీళ్లు లేక ఇబ్బందులు పడుతున్నా స్పందించని యంత్రాంగం..?

*పల్లె ప్రగతి పేరుతో గ్రామాల రూపు రేఖలు మార్చి స్వచ్ఛమైన నీటిని అందించాలనే ప్రభుత్వ సంకల్పం ఏమైపోయే…!

*అధికారులు స్పందించి వెంటనే నీళ్ళు అందించే విధంగా చర్యలు చేపట్టాలి..

(మహబూబాబాద్- విజయం న్యూస్);-

మహబూబాబాద్ చిన్న గుడూరు మండల కేంద్రంలోని 1 వ మరియూ 7 వ వార్డులో గత వారం రోజులుగా కుళాయి నీళ్లు రాకపోవటంతో స్థానిక కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో స్థానిక మహిళలు ఖాళీ బిందెలతో రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వారం రోజులుగా నీళ్లు రావటం లేదని పంచాయితీ కార్యదర్శి కి ఎన్నిసార్లు విన్న వించినా సమస్యను పరిష్కరించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.ప్రభుత్వం పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా లక్షలాది రూపాయలు ఖర్చు చేస్తున్నప్పటికీ మండల కేంద్రంలో కనీసం మంచినీళ్లు అందించటం లేదని ఆరోపించారు.ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి వెంటనే నీళ్లు ఇప్పించాలని ప్రజలు కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో చిన్న గుడూరు 7 వార్డు మెంబర్ కోణం రవి, కాలనీ మహిళలు పాల్గొన్నారు.