తిరుమలాయపాలంలో ఇంటింట జ్వరసర్వే
ఖమ్మం జిల్లాలోని ఇంటింట సర్వే కార్యక్రమం శుక్రవారం ప్రారంభమైంది.
కరోనా నేపథ్యంలో కె. సి.అర్. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఫీవర్ సర్వే అను కార్యక్రమానికి దమ్మాయిగుడెం నందుశుక్రవారం మండల పరిషత్ అధ్యక్షులు బోడ మంగీలాల్ ప్రారంభించారు. ఈ సదర్భంగా వారు మాట్లాడుతూ కోవిడ్ లక్షణాలు ఉన్నవారికి కోవిద్ కిట్స్ అందుబాటులో ఉన్నందున ప్రజలు ఎవరూ అధైర్య పడవద్దు అని, సర్వే టీమ్ వారికి ప్రతి ఒక్కరూ సహకరించి ఆరోగ్యాలను కాపాడుకోవాలని పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి సూచనల మేరకు తిరుమలాయపాలెం సుబ్లేడు ఆరోగ్య కేంద్రాల సిబ్బంది,ఎంపిడిఓ, ఎంపీవో, పారిశుధ్య సిబ్బంది సహకారాన్ని అందిస్తారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ జయరాం, ఎంపీవో రాజేశ్వరి, సర్పంచ్ ఆలస్యం నాగేశ్వర రావు , పంచాయతీ కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు.
also read :-దిగుడా..? దూకుడా..?
== 24వ డివిజన్‌లో ఇంటింటికి ఫీవర్ సర్వే .
ఖమ్మం : నగరంలో శుక్రవారం ముస్తాఫా నగర్ 24వ డివిజన్ లో ఇంటింటికి ఫీవర్ సర్వే కార్యక్రమాన్ని స్థానిక కార్పోరేటర్ కమర్తపు మురళి ప్రారంభించారు . అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కరోనా మహమ్మారి పై మరోసారి యుద్ధం ప్రకటించిందని . దీనిలో భాగంగా వైరస్ వ్యాప్తి నివారణకు నడుం బిగించిందని . ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా శుక్రవారం నుంచి జ్వర సర్వేకు శ్రీకారం చుట్టిందని . మన ప్రియతమ నాయకుడు రాష్ట్ర రవాణాశాఖమంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆదేశానుసారం డివిజన్‌లో నివసించే ప్రజలు ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశ్యంతో మొదలు పెట్టిన కార్యక్రమాన్ని , అలాగే దేశ రాష్ట్ర ప్రజలు ఆయురారోగ్యాలతో ఉండాలని తలపెట్టిన కార్యక్రమాన్నికి అందరూ సహకరించి విజయవంతం చేయాలని కోరారు . ఈ కార్యక్రమంలో డివిజన్ ఆఫీసర్ పుష్పలత మేడమ్ అంగన వాడి టీచర్ విజయకుమారి , జానకి , సుజనా , సునిత , కృష్ణకుమారి ఆశ , శశిరేఖ తదితరులు పాల్గొన్నారు .