Telugu News

సాంబార్ లో పడి  మూడు సంవత్సరాల బాలుడు మృతి

తిరుమలాయపాలెం మండలంల సంఘటన

0

సాంబార్ లో పడి  మూడు సంవత్సరాల బాలుడు మృతి

* తిరుమలాయపాలెం మండలం కాకరకాయిలో సంఘటన
(తిరుమలాయపాలెం-విజయం న్యూస్)
సాంబార్ లో పడి మూడు సంవత్సరాల బాలుడు మృతి చెందిన హృదయ విచారక సంఘటన తిరుమలాయపాలెం మండలంలో చోటుచేసుకుంది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మహబూబాద్ జిల్లా నరసింహులపేట మండలం కౌసల్యపల్లి గ్రామానికి చెందిన గాంధారి దయాకర్ లక్ష్మీ ల కుమారుడైన గాంధారి ప్రణదీప్ (3)తల్లిదండ్రులతో కలిసి గత నెల 23 వ తారీఖున మండలంలోని కాకరవాయి గ్రామానికి తన మేనమామ అయిన సలిగంటి మల్సూర్ ఇంటికి అయ్యప్ప స్వాముల ఇరుముడి కార్యక్రమానికి హాజరయ్యారు.ఈ నేపథ్యంలో స్వామిల కోసం ప్రత్యేకంగా తయారు చేస్తున్న వేడి సాంబార్లో ప్రణదీప్ ప్రమాదవశాత్తు పడి తీవ్ర గాయాలపాలు కాగా,చికిత్స నిమిత్తం హుటాహుటిన ఖమ్మంలోని ఓ ప్రయివేటు ఆసుపత్రి లో చేర్పించగా చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు.అయ్యప్ప స్వాముల శుభకార్యానికి వచ్చి తన చిన్నారి కొడుకు అనంత లోకాలకు వెళ్లాడని తల్లిదండ్రులు విలపిస్తున్న తీరు పలువురిని కంటతడి పెట్టించింది.మృతుడు ప్రణదీప్ తండ్రి దయాకర్ ఫిర్యాదు మేరకు స్టేషన్ హౌస్ ఆఫీసర్ నరసింహారెడ్డి  కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు