Telugu News

నిండిన స్కూల్.. నీళ్ళల్లో విద్యార్దులు

0

నిండిన స్కూల్.. నీళ్ళల్లో విద్యార్దులు

— చెరువుని తలపిస్తున్న పైనంపల్లి హై స్కూల్

— స్కూల్ లోకి వెళ్లి ఎందుకు నడం లోతు నీళ్ళు

— బయటకు తీసుకొచ్చిన యువకులు 

(తిరుమలాయపాలెం-విజయం న్యూస్)

వానా కురవలేదు.. బడిలో నీళ్ళు లేవు.. విద్యార్థులందరు స్కూల్ కు వచ్చారు. సరిగ్గా మధ్యాహ్న సమయం. ఒక్కసారిగా వచ్చిన వరద స్కూల్ అవరణం నిండిపోయింది.. విద్యార్థులు బయటకు రావాలంటే చెరువును దాటి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది..దీంతో సమాచారం అందుకున్న విద్యార్థులను స్కూల్ నుంచి బయటకు తీసుకొచ్చారు. ఇదేక్కడో కాదు.. తిరుమలాయపాలెం మండలంలోని పైనంపల్లి గ్రామంలోని  ఉన్నత పాఠశాల పరిస్థితి.. తిరుమలాయపాలెం మండల పరిధిలోని పైనంపల్లి హైస్కూల్లో చెరువుని తలపిస్తోంది. బయట నుంచి వచ్చిన వరద నీరుంతా స్కూల్ అవరణంలోకి రావడంతో చెరువులా మారిపోయింది. మోకాళ్లలోతు నీళ్లు వచ్చి చేరాయి.

పోటో  : పైనంపల్లి స్కూల్ లోకి భారీగా చేరిన వరద నీరు .. నీటిలోనే బయటకు వస్తున్న విద్యార్థులు 

విద్యార్థులు స్కూల్ కి వెళ్లాలంటే చెరువును దాటినట్లుగా స్కూల్ లోకి వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడింది. అధికారులు మాత్రం విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పట్టించుకోకపోవడం శోచనీయం. వర్షం తగ్గి రెండు రోజులు అవుతున్నా స్కూల్ లో నీళ్లు అంతే ఉన్నాయి. కాగా విషయం తెలుసుకున్న కొంత మంది యువకులు ఆ స్కూల్లో ఉన్న విద్యార్థులను బయటకు తీసుకొచ్చారు.  నీళ్లు తాగిన బురద తో దోమలు చేరి పిల్లలు రోగాలకు గురవుతారు. జిల్లా కలెక్టర్ పరిసరాల పరిశుభ్రత ఉండాలని అనునిత్యం ఏదో గ్రామం లో తనిఖీ చేస్తూనే ఉన్నారు. ప్రజా ప్రతినిధులు అయిన సమస్యను ఉన్నత అధికారులకు తెలియజేసే వెంటనే సమస్యలు పరిష్కరించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుకుంటున్నారు.

ఇది కూడా చదవండి :‌- అన్న ఇంటి ముందు చెల్లి మందుడబ్బాతో నిరసన

ఎప్పటికప్పుడు బ్రేకింగ్ న్యూస్ కావాలనుకుంటున్నారా..? లెటెస్ట్ న్యూస్, ట్రెండింగ్ న్యూస్ చూడాలనుకుంటున్నారా..? అయితే మీ స్క్రీన్ పై కనిపిస్తున్న ‘గంట’ సింబల్ ను నొక్కండి.. ఆ తరువాత ఆల్ అని నొక్కండి.. ఎప్పటికప్పటి లెటెస్ట్ న్యూస్.. మా వార్త.. మీ ముంగింట..? ఉంటుంది.