Telugu News

పోలీస్ స్టేషన్ రాళ్ళను అక్రమంగా తరలిస్తున్న ప్రజాప్రతినిధి

మా ఇష్టం వచ్చినట్లు చేసుకుంటామని హెచ్చరిక

0

పోలీస్ స్టేషన్ రాళ్ళను అక్రమంగా తరలిస్తున్న ప్రజాప్రతినిధి

** మా ఇష్టం వచ్చినట్లు చేసుకుంటామని హెచ్చరిక

(తిరుమలాయపాలెం-విజయం న్యూస్)

తిరుమలాయపాలెం మండలం సుబ్లేడు గ్రామంలో ఇదేచ్ఛగా తరలిస్తున్న పోలీస్ స్టేషన్ బేస్ మెట్లు రాళ్లు కొంతకాలంగా గ్రామ కంట్లం అంటూ గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్లు కలిసి పోలీస్ స్టేషన్ సురక్షితంగా ఉన్న ప్రహరీ గోడ కూల్చివేసి దానికి రక్షణ లేకుండా చేశారు. తర్వాత ఫినిషింగ్ ల పేరుతో రాళ్ల తీగతో తూతు మంత్రంగా నిర్వహించారు.

Allso read:- ఇద్దరు ఎంపీలకు, ఎమ్మెల్సీకి అవమానం

కూల్చివేసిన రాళ్లను సంబంధిత సామాన్లను (చెట్ల)ను విక్రయించినట్లు గ్రామస్తుల సమాచారం. ఈ మేరకు గతంలో కూసుమంచి కొండపల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్లు వచ్చి పరిశీలించినట్లు సమాచారం. సంబంధిత పోలీస్ శాఖ అధికారులు గ్రామం కొచ్చి స్టేషన్ లో ఉన్నటువంటి చెట్లను అమ్ముట నేరమని సంబంధిత సర్పంచికి గ్రామస్తులకు తెలియజేసినట్లు తెలియవస్తుంది ఇలాంటి సమయంలో పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి కూల్చివేసిన బేస్ మెట్లు రాళ్ళను గ్రామ ఉపసర్పంచ్ వెంకటనారాయణ అక్రమంగా రాళ్లను రవాణా చేస్తూ తరలిస్తున్నట్టు గ్రామస్తులు పేర్కొన్నారు.

పోలీస్ శాఖ అధికారులు స్పందించి తక్షణమే రాళ్లు ఎక్కడికి వెళ్లాయని విచారణ జరిపించి రాళ్లు తరలించిన వారిపై చట్టరిత్య కేసులు పెట్టి శిక్షించాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు విషయమై ఉప సర్పంచ్ వెంకట్ నారాయణ వివరణ కోరగా అది గ్రామపంచాయతీకి సంబంధించిన విషయమని మీరు ఎవరు మాట్లాడే హక్కు లేదని వివరణ ఇచ్చారు. రాళ్ళను అమ్ముకుంటాం ఏమైనా చేస్తాం, మీరు ఎవరు అడగటానికి అని అన్నారు పోలీస్ స్టేషన్ గోడను కూలగొట్టింది మేము అమ్ముకునే హక్కు మాకుంది నీకు సంబంధం లేదని వివరణ ఇచ్చారు.

Allso read:- ఆర్టీసి ప్రజల అస్థి : మంత్రి పువ్వాడ అజయ్