Telugu News

*విద్యార్థుల ఆందోళన పై స్పందించిన ఎమ్మెల్యే కందాళ*

మాదిరిపురం గిరిజన గురుకుల బాలుర పాఠశాల సమస్యల పై ఉన్నతాధికారులతో పోన్లో మాట్లాడిన ఎమ్మెల్యే

0

*విద్యార్థుల ఆందోళన పై స్పందించిన ఎమ్మెల్యే కందాళ*

★★ మాదిరిపురం గిరిజన గురుకుల బాలుర పాఠశాల సమస్యల పై ఉన్నతాధికారులతో పోన్లో మాట్లాడిన ఎమ్మెల్యే

(రిపోర్టర్ -వీరయ్య)

(తిరుమలాయపాలెం-విజయంన్యూస్)

తిరుమలాయపాలెం మండలం మాదిరిపురం గ్రామంలోని గురుకుల పాఠశాల లో పురుగుల అన్నం పెడుతున్నారని విద్యార్థులు ఆందోళన చేయగా, ఈ విషయం తెలుసుకున్నపాలేరు శాసనసభ్యులు శ కందాళ ఉపేందర్ రెడ్డి తిరుమలాయపాలేం మండలం మాదిరిపురం క్రాస్ రోడ్డు పరిధిలోని గిరిజన గురుకుల బాలుర పాఠశాలలో అన్నం బాలేక విద్యార్థులు బుధవారం ధర్నా చేయగా, ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి వెంటనే స్పందించారు.

Allso read:- ‘గాడ్‌ఫాదర్‌’మ్యూజిక్‌ పై నెటిజన్ల ఫైర్

ఐటీడీఏ పీవో‌తో పోన్లో మాట్లాడి,డీడీ ట్రైబల్ వెల్పేర్,మండల విద్యాశాఖ అధికారి,తాసీల్ధార్,యండిఓకి పోన్ ద్వార సమాచారాన్ని తెలియజేశారు.వెంటనే గురుకుల పాఠశాల వద్దకి వెళ్లి సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు. మండల విద్యాశాఖ అధికారిని త్వరలో దానికి సంబంధించిన నివేదికను అందజేయాలని ఆదేశించారు.గత నెల రోజుల క్రితం గురుకుల పాఠశాలను తనిఖీ చేసిన సంధర్భంలో ఇలాంటి లోటుపాట్లు తన దృష్టికి రాలేదని,భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు లేకుండా చర్యలు తీసుకుంటానన్ని హామీ ఇచ్చారు. తను అందుబాటులో లేనందున ఉన్నతాధికారులు ఆదేశించారు.నియోజకవర్గానికి రాగానే విద్యార్థుల సమస్యలపై పూర్తిగా కేటాయిస్తానని హామీయిచ్చారు.

Allso read:- మాకోద్దు ఈ అన్నం అంటూ విద్యార్థుల ఆందోళన