Telugu News

ఈ దేశం నెహ్రూను ఎన్నటికీ మరువదు: బలరాం నాయక్.

ఈ రోజు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో దేశ మొదటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ గారి జయంతి.

0

ఈ దేశం నెహ్రూను ఎన్నటికీ మరువదు: బలరాం నాయక్.

(మహబూబాబాద్ జిల్లా – విజయం న్యూస్) :-

ఈ రోజు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో దేశ మొదటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ గారి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. నెహ్రూ విగ్రహానికి మాజీ కేంద్రమంత్రి వర్యులు శ్రీ పోరిక బలరాం నాయక్  పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేశారు.

ఈ సందర్భంగా బలరాం నాయక్ మాట్లాడుతూ దేశం నేడు అభివృద్ధి పధంలో నడుస్తుందంటే అది దేశ మొదటి ప్రధాని నెహ్రు దూర దృష్టితో చేసిన ఆలోచనలే అని అన్నారు. ఆయన స్వాతంత్ర సమరయోధులుగా, ప్రథమ ప్రధానిగా దేశం కోసం ఎంతో చేశారని తెలిపారు. ఈ దేశం నెహ్రూను ఎన్నటికి మరిచిపోదని బలరాం నాయక్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షలు జెన్నారెడ్డి భరత్ చంద్ర రెడ్డి, నునవాత్ రాధ, పట్టణ అధ్యక్షులు రాజు, వార్డు కౌన్సిలర్లు సీనియర్ కాంగ్రెస్ నాయకులు, యువజన కాంగ్రెస్ నాయకులు, NSUI నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ALSO READ :-కీచక ప్రిన్సిపాల్.. ఆట పేరుతో బాలికలను అక్కడ పట్టుకొని.