Telugu News

ఇది ఎలక్షన్ ఇయర్.. ఇక ప్రచారం షూరు

ఈ ఏడాదిలోనే అసెంబ్లీ ఎన్నికలు..?

0

ఇది ఎలక్షన్ ఇయర్..ఇక ప్రచారం షూరు

== ఈ ఏడాదిలోనే అసెంబ్లీ ఎన్నికలు..?

== ఎన్నికలకు సిద్దమవుతున్న నేతలు

== వర్గపోరుతో గులాబీ వనంకు గుబులు

== క్యాడర్ ఉండి నేతలు లేక కాంగ్రెస్.. క్యాడర్ లేక బీజేపీ సతమతం

== కొత్త పుంతలు తొక్కుతున్న వైఎస్ఆర్ టీపీ, టీడీపీ, బీఎస్పీ

== దూసుకవస్తున్న ఆమ్ అద్మీ పార్టీ

== ప్రచార అస్త్రాలకు పదునుపెడుతున్న నేతలు

== స్థానికంగా నివాసం ఉండేందుకు కసరత్తు

(ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్)

ఎన్నికల సంవత్సరం రానే వచ్చింది.. 2022 సంవత్సరానికి గుడ్ బై చెప్పిన ప్రజలు ఎన్నికల సంవత్సరానికి స్వాగతం పలికారు. కచ్చితంగా ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు ఉంటాయని ప్రజలు, రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. 2018లో డిసెంబర్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగ్గా, ఈ ఏడాది ఆరు నెలల ముందుగా

నే ఎన్నికలకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒక వైపు అతి త్వరలో కర్నాటకలో ఎన్నికలు జరుగుతుండగా, ఆ ఎన్నికలతో పాటు తెలంగాణ రాష్ట్ర ఎన్నికలను జరిపించే అవకాశాలు కనిపిస్తున్నాయి.. అందుకే ఈ ఏడాదిని ఎన్నికల సంవత్సరంగా పిలుస్తున్నారు రాజకీయ విశ్లేషకులు..

ఇది కూడా చదవండి: 2023 కు స్వాగతం..సుస్వాగతం

== ప్రచారంలో నిమగ్నమవుతున్న నేతలు, ఆశావాహులు

అతి త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాజకీయ నాయకులు ఎన్నికల ప్రచారానికి జనవరి మాసాన్ని ముహుర్తంగా ఎంపిక చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తి జనవరి 26 నుంచి పాదయాత్ర చేపట్టనున్నట్లు ప్రకటించారు. అలాగే ఖమ్మం జిల్లాలో ముఖ్యమైన నాయకులు కూడా జనవరి మాసంలో మంచి ముహుర్తాన్ని చూసుకుని పాదయాత్రలు, ప్రచార కార్యక్రమాలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు జనవరి 1 నుంచి పాలేరు నియోజకవర్గంలో నివాసం ఉండేందుకు సిద్దమైయ్యారు. అందుకు గాను ఖమ్మం రూరల్ మండలంలోని శ్రీసిటి లో స్వంతంగా ఇళ్లు నిర్మాణం చేసి, అక్కడే ఉంటూ ప్రజలకు అందుబాటులో ఉండాలని నిర్ణయించారు. ఈ మేరకు జనవరి 1న ప్రజలందర్ని ఆయన కలిసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అందుకు గట్టిగానే ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే మరో వైపు పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి కూడా జనవరి మాసం నుంచి ప్రచారంలోకి వెళ్లే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఇప్పటికే అయిన నియోజకవర్గ వ్యాప్తంగా పర్యటిస్తూ గ్రామాల్లో అభివద్ది, సంక్షేమ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అలాగే ఆయన స్వంత ఖర్చులతో గుడి,బడి, నిరుపేదలకు సహాయం చేస్తున్నారు. చనిపోయిన వారి కుటుంబాలకు నియోజకవర్గ వ్యాప్తంగా 10వేలను అందిస్తుండగా, మరింత వేగవంతం చేసే అవకాశం కనిపిస్తోంది. అలాగే వైఎస్ షర్మిళ కూడా సంక్రాంతి పండుగ నుంచి ప్రచారం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ఖమ్మం రూరల్ మండలంలోని కరుణగిరి సమీపంలో ఆమె స్వంతంగా ఇంటి నిర్మాణం కోసం ఇటీవలే భూమి పూజ కూడా చేశారు. అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి ఆశావాహులుగా ఉన్న రాయల నాగేశ్వరరావు, రామసహాయం మాదవిరెడ్డి, మద్దిశ్రీనివాస్ రెడ్డి, జడ్పీటీసీ బెల్లం శ్రీనివాస్ లు సంక్రాంతి తరువాత ప్రచార కార్యక్రమాలను ప్రారంభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. టీడీపీ పార్టీ నుంచి నియోజకవర్గ ఇంచార్జ్ ను నియమించే అవకాశం కనిపిస్తోంది. జనవరి 15లోగా ఇంచార్జ్ లను నియమించి, జనవరి 26 నుంచి ప్రచారం ప్రారంభించాలని కోరుతున్నారు.            ఇది కూడా చదవండి: రాష్ట్ర ప్రజలందరు సంతోషంగా ఉండాలి: మంత్రి పువ్వాడ

== ఖమ్మంలో

ఖమ్మం నియోజకవర్గంలో ఇప్పటికే ప్రధాన లీడర్ గా రవాణాశాఖ మంత్రి ఉండగా, ఆయన ఇప్పటికే నియోజకవర్గంలోని అన్ని గ్రామాలు, డివిజన్లలో ప

ర్యటిస్తున్నారు. మోటర్ సైకిళ్లతో ర్యాలీ నిర్వహించుకుంటూ ప్రజల ఇండ్లకు వెళ్లి సంక్షేమ పథకాలను అందిస్తున్నారు. అలాగే అభివద్ది కార్యక్రమాలను వేగవంతం చేశారు. ఇక ప్రధాన ఎన్నికల ప్రచారం మాత్రం జనవరి 1 నుంచి ప్రారంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొదటి తారీఖున ఖమ్మం క్యాంఫ్ కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. అలా

గే కాంగ్రెస్ పార్టీ నుంచి ఆశావాహులుగా ఉన్న ఎం.డీ.జావిద్ ఇప్పటికే పాదయాత్రను చేపట్టగా, జనవరి మాసంలోనే మరింత ప్రచారం కార్యక్రమాలను ప్రారంభించే అవకాశం కనిపిస్తోంది. వైఎస్ఆర్ టీపీ నుంచి ఆశావాహుడిగా ఉన్న క్రిష్ణమోహన్ సంక్రాంతి నుంచి ప్రచార కార్యక్రమాలకు శ్రీకారం చుట్టేస్తున్నారు.

 

== వైరాలో

ఖమ్మంకు అతిదగ్గరగా ఉండి గిరిజన రిజర్వేషన్ కల్గిన వైరా నియోజకవర్గంలో ముఖ్య నాయకులకు మధ్య హోరాహోరీ పోరు జరిగే అవకాశం ఉంది. ప్రస్తుత ఎమ్మెల్యే రాములు నాయక్, ఆయన కుమారుడు మధ్య సీటు చిచ్చు రగిలే అవకాశం లేకపోలేదు. అలాగే మాజీ ఎమ్మెల్యే మదన్ లాల్, బానోతు చంద్రావతి రే

సులో ఉన్నట్లు ప్రకటిస్తున్నారు. దీంతో బీఆర్ఎస్ లో వర్గపోరు ఉన్నప్పటికి రాములు నాయక్ ఒక్కడే ప్రచారం చేస్తున్నారు. కాగా మదన్ లాల్ కూడా సంక్రాంతి నుంచి ప్రచారం ముమ్మరం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే మాజీ ఎమ్మెల్యే బానోతు చంద్రావతి కూడా రేసులో ఉన్నారు. ఆమె ప్రధాన నాయకత్వాన్ని కాకాపట్టే పనిలో నిమగ్నమైయ్యారు. వారి చుట్టే ప్రదక్షణలు చేస్తున్నారు. అయితే పూర్తి స్థాయి ఎన్నికల ప్రచార వ్యూహ కార్యక్రమాలు సంక్రాంతి నుంచి ఉండే అవకాశం ఉంది.   ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి ముగ్గురు ప్రధాన నాయకులు ఆశావాహులుగా ఉండటంతో అక్కడ సమన్వయం లోపం కనిపిస్తున్నట్లే కనిపిస్తోంది. వైరా నుంచి పీసీసీ సభ్యుడిగా ఉన్న మాలోతు రాందాస్ నాయక్, ఇటీవలే పార్టీలో చేరిన రామూర్తి నాయక్, బాలాజీ నాయక్ లు ముగ్గురు వైరా టిక్కెట్ ను ఆశీస్తున్నారు. దీంతో ముగ్గురు నాయకులు జనవరి నుంచే ప్రచారం ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి.

== సత్తుపల్లిలో

సత్తుపల్లి నియోజకర్గంలో బీఆర్ఎస్ పార్టీలో వర్గపోరు భగ్గుమంటోంది. సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యకు, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు పచ్చిగడ్డివేస్తే భగ్గుమంటోంది. అలాగే మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మట్టాదయానంద్ ను ప్రోత్సహించడంతో అక్కడ రాజకీయం రసవత్తరంగా మారింది. కాగా

సండ్ర వెంకటవీరయ్య ఇప్పటికే ఎన్నికల ప్రచారంలో నిమగ్నమైయ్యారు. మట్టాదయానంద్ అడపదడపా తిరుగుతున్నప్పటికి సంక్రాంతి నుంచి మరింతగా ప్రచార కార్యక్రమాలను ముమ్మరం చేసేందుకు కసరత్తు జరుగున్నట్లు తెలుస్తోంది. ఇక ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ వర్గపోరుతో కొట్టుమిట్టాడుతుంది. మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్, పీసీసీ ప్రధానకార్యదర్శి మానవతరాయ్ ల మధ్య పోరు నడుస్తోంది. నాకంటే నాకే సీటు అంటూ ప్రచారం చేసుకుంటున్నారు. అలాగే బీజేపీ అభ్యర్థి కోసం ఆశపడుతున్న నంభూరి  ఆయన ప్రచారం ప్రారంభించబోతున్నారు. వైఎస్ఆర్ టీపీ నుంచి మాజీ జడ్పీచైర్మన్ గడిపల్లి కవిత జనవరి 26 నుంచి ప్రచార కార్యక్రమాలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక సీపీఐ పార్టీ మాత్రం వైరా నియోజకవర్గాన్ని కన్నేసిందనే చెప్పాలి. బీఆర్ఎస్ పార్టీతో పొత్తు ఉంటే వైరా టిక్కెట్ ను అడిగే అవకాశాలు లేకపోలేదు.

== మధిర నుంచి

రాష్ట్రంలోనే ప్రస్తుతం హాట్ టాఫిక్ గా మారిన నియోజకవర్గంలో మధిర. ఇక్కడ సీఎల్పీ లీడర్ గా ఉన్న భట్టి విక్రమార్క వరసగా మూడు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించగా, మరోసారి గెలిచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే సైకిల్ యాత్ర, బస్సుయాత్ర, పాదయాత్రను నిర్వహించిన సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అధికార పార్టీని దెబ్బతీసేందుకు వ్యూహత్మక అడుగులు వేస్తున్నారు. ఆయనకు అక్కడ పోటీ లేదు, వర్గపోరు లేదు. కానీ బీఆర్ఎస్ పార్టీలో మాత్రం వర్గపోరు భగ్గుమంటోంది. జడ్పీచైర్మన్ గా పనిచేస్తున్న లింగాల కమల్ రాజ్, తోట రాంబాబు మధ్య హోరాహోరీ పోరు కొనసాగుతుంది. ఇద్దరు మాకంటే మాకు టిక్కెట్ అంటూ ప్రచారం చేసుకుంటున్నారు. కానీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మాత్రం లింగాల కమల్ రాజు ప్రకటించడంతో, తోట బాబు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో తిరుగుతున్నారు. ఇక వైఎస్ఱ్ఆర్ టీపీ నుంచి కేకేడి ఇప్పటి అక్కడక్కడ ప్రచారం చేస్తుండగా సంక్రాంతి నుంచి విస్త్రతంగా ప్రచారం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇలా ప్రధాన పార్టీల నాయకులు జనవరి మాసాన్ని ముహుర్తంగా భావించి ప్రచార కార్యక్రమాలను విస్త్రత్తం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. చూద్దాం రాబోయే రోజుల్లో ఎలాంటి రాజకీయ సమీకరణాలు మారబోతున్నాయో..?

ఇది కూడా చదవండి: రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలిః భట్టి విక్రమార్క