Telugu News

ఇది దున్న‌పోతు ప్ర‌భుత్వం : భట్టి విక్రమార్క

దేవాదుల నీళ్లు అంద‌కుండా చేసిన బీఆర్ఎస్ ప్ర‌భుత్వం

0

ఇది దున్న‌పోతు ప్ర‌భుత్వం : భట్టి విక్రమార్క

== దేవాదుల నీళ్లు అంద‌కుండా చేసిన బీఆర్ఎస్ ప్ర‌భుత్వం

== ఇది ప్ర‌భుత్వ నేరంగా ప‌రిగ‌ణించాలి

== ప్రభుత్వంపై మండిపడిన సీఎల్పీ నేత భట్టి విక్రమార్క

==  పాద‌యాత్ర పూర్త‌య్యాక బ‌స్సు యాత్ర‌

== కాంగ్రెస్ క‌ట్టిన ప్రాజెక్టుల‌ను ప‌రిశీల‌న చేస్తాం

== విలేకర్ల సమావేశంలో స్పష్టం చేసిన భట్టి

== 500 కిలోమీటర్లు పూర్తి చేసుకున్న పాదయాత్ర

(జనగామ,ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్)

తెలంగాణ తెచ్చుకున్నదే నీళ్లు, నిధులు, నియామకాల, ఆత్మగౌరవం కోసం. ఈ నాలుగింటిలో అత్యంత ప్రధానమైంది నీళ్లు.  ఆ నీళ్లకు సంబంధించి పెద్ద ఎత్తున వాడుకోవడానికి అవకాశం ఉన్న నది గోదావరి. ఈ గోదావరి నది నుంచి వ్రుధాగా సముద్రంలో కలుస్తున్న నీటిని దశాబ్దాలుగా కరువు ప్రాంతాలుగా ఉన్న జనగామ ఈ పరిసర ప్రాంతాలకు నీళ్లు తీసుకువని వచ్చి.. ఇక్కడ కరువుకాటకాలు లేకుండా చేయాలని ఒక సంకల్పంతో ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పొన్నాల లక్ష్మయ్య నీటిపారుదల శాఖామంత్రిగా తలపెట్టిన జలయగ్నంలో అతిముఖ్యమైన ప్రాజెక్టు దేవాదుల ఎత్తిపోతల పథకం. దేవాదుల ప్రాజెక్టుతో ఈ ప్రాంతానికి నీళ్లు తీసుకుని రావాలని దశాబ్దా కాలం పాటు అనేకమంది నాయకులు పోరాటం చేశారు.

ఇది కూడా చదవండి: పోడు రైతులకు హక్కు పత్రాలివ్వండి: భట్టి

ఈ ప్రాజెక్టు కోసం ఆనాటి ముఖ్యమంత్రులను కలిశారు. పెద్ద ఎత్తున దరఖాస్తులు ఇచ్చారు. అందులో నాటి ముఖ్యమంత్రి ఎన్.టీ. రామారావు కూడా1984-85లో దరఖాస్తులు ఇచ్చారు. ఈ ప్రాజెక్టు కోసం పోరాటం చేసి దరఖాస్తులు ఇచ్చిన వ్యక్తే తరువాత కాలంలో నీటిపారుద శాఖామంత్రిగా పనిచేసి ఈ ప్రాజెక్టును తీసుకురావడం పొన్నాల గారి అద్రుష్టమే. ఇక్కడ ప్రాతినిథ్యం వహిస్తున్న ప్రజాప్రతినిధికి జనగామ ప్రజలమీదకంటే.. ఇక్కడ భూముల మీదే ప్రేమ ఉందని ఉదయం నుంచి నన్ను కలిసిన ప్రతిఒక్కరూ చెబుతున్నారు. ఎక్కడ భూమి కనిపిస్తే అక్కడ కబ్జా చేయడం, బలవంతంగా రాపిచ్చుకోవడం, ఫామ్ హౌస్ లు కట్టుకోవడం చేస్తున్నారు. ఇది దురద్రుష్టం. చొక్కారావు దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ద్వారా దాదాపు 6 లక్షల ఎకరాలకు సాగుకు నీళ్లు అందించే ప్రాజెక్టు. వరంగల్, నల్గొండ, కరీంనగర్ జిల్లాల్లో కరువుకాటకాలతో అల్లాడిపోయే ప్రజానీకానికి నీళ్లు ఇచ్చే గొప్ప ప్రాజెక్ట్ ఇది. దీనిని కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టి కట్టడం కూడా పూర్తిచేసింది. అందులో భాగంగా 5 లిఫ్ట్ పాయింట్లు పెట్టడంతో పాటు అదనంగా 6 రిజర్వాయర్లను కూడా నిర్మించడం పూర్తి చేసి అందులో నీళ్లను కూడా నింపాము. అందులో భాగంగానే పది చిన్నచిన్న చెరువుల సామర్థ్యాన్ని పెంచి వాటిని నీళ్లతో నింపాము.

ఇది కూడా చదవండి: దళిత,గిరిజనులకు అండగా కాంగ్రెస్ జెండా: భట్టి

పాత చెరువులైన భీమ్ లింగాపూర్, రామప్ప, సాలివాగు, నగరం, పులిగుర్తి, ధర్మసాగర్ చెరువులు పెంచడంతో పాటు.. పైన గండి రామారం, బొమ్మకూర్, తపాస్ పల్లి, జల్లగూడెం, చెట్టకోడూర్, అశ్వరావు పల్లి, ఘన్ పూర్ వంటి కొత్త ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి చేశాము. గోదావరి, క్రిష్ణా బేసిన్ లను వేరు చేసేలా అత్యంత ఎత్తయిన ప్రదేశంలో తపాస్ పల్లివద్ద రిజర్వాయర్ కట్టాము. అక్కడనుంచి అన్ని ప్రాంతాలను నీటిని డిస్ట్రిబ్యూట్ చేసేలా డిజైన్ చేశాము. వీటన్నింటిని పూర్తి నీళ్లు ఇచ్చే సమయానికి ప్రత్యేక పోరాటం రావడం, విభజన జరగడం, ప్రత్యేక తెలంగాణ ఏర్పడ్డం జరిగింది. తరువాత ఏర్పడ్డ ప్రభుత్వం ఈ తొమ్మిదిన్నరేళ్లలో ఈ కట్టిన ప్రాజెక్టులకు డిస్ట్రిబ్యూటరీ కాలువులు కూడా తవ్వలేదు. ఈ ప్రభుత్వం ఒక దున్నపపోతులా నిద్రపోతోంది. కట్టిన ప్రాజెక్టులకు కాలువలు తవ్వింటే ఈ రోజు లక్షల ఎకరాల ఆయకట్టు అదనంగా సాగులోకి వచ్చేది.

పెంచిన చెరువులకు ఉన్న కాలువులను పెంచినా అదనపు భూమి సాగులోకి వచ్చేది. వీటిని పట్టించుకోక ఈ ప్రజలకు ప్రభుత్వం ద్రోహం చేసింది. ఇది అత్యంత తీవ్రమైన ప్రభుత్వ నేరంగా పరిగణించాలి. దాదాపు రూ. 9వేల కోట్లతో 6 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే ప్రాజెక్టును పూర్తి చేశాము. దశాబ్దాలుగా కరువులో అల్లాడుతున్న ప్రజలకు నిండుకుండలా ప్రాజెక్టులను తెచ్చి పెడితే.. ఆ నీటిని పంచకుండా అడ్డుపడి ఈ ప్రభుత్వం అతిపెద్ద నేరం చేసింది. ఆదిలాబాద్ నుంచి చూస్తే ఇక్కడి వరకూ అనేక నేరాలను ఈ ప్రభుత్వం చేసింది.తెలంగాణ తెచ్చుకున్న ఉద్దేశాలను నెరవేరనీయకుండా,  కరవు కాటకాలతో అదేవిధంగా అల్లాడేలా, ప్రజలు ఆకలితో అలమటించేలా చేస్తున్న భూస్వామ్య ఫ్యూడల్ మనస్తత్వంతో ఈ నాటి పాలన సాగుతోంది.

ఇది కూడ  చదవండి: యుద్ధ ప్రాతిపదికన మార్క్ఫెడ్ లు ప్రారంభించాలి: పువ్వాళ్ల

దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ 365 రోజులు గోదావరి నుంచి నీటిని నింపడం కోసం, గోదావరిలో వాటర్ లెవెల్స్ మెయింటెన్చ చేయడం కోసం కాంతానపల్లి వద్ద బ్యారేజ్ డిజైన్ చేసి అనుమతులు మంజూరు చేశాము. కొత్తగా వచ్చిన ప్రభుత్వం కాంతానపల్లిని ఖతం చేసింది. దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ కు అవసరముండే విద్యుత్ ను కూడా కాంతానపల్లి బ్యారేజ్ హైడల్ విద్యుత్ ఉత్పత్తి చేసేలా డిజైన్ చేశాము. ఈ రోపు తుపాలగూడెం ప్రాజెక్టు లేదు.. ఇక్కడ పవర్ ప్రాజెక్టు లేకుండా అయింది. ఈ పాదయాత్ర పూర్తయిన తరువాత రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వాన్ని తీసుకుని  కాంగ్రెస్ పార్టీ కట్టిన ప్రాజెక్టులను సందర్శించేందకు బస్సు యాత్ర చేస్తామన్నారు. ఈ బస్సు యాత్ర ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం కట్టిన ప్రాజెక్టుల ద్వార రైతులకు ఎంత మేలు జరిగిందో తెలియజేస్తామన్నారు.

== 500 కిలోమీటర్లు పూర్తి చేసుకున్న పాదయాత్ర

సీఎల్పీ నేత భట్టి విక్రమార చేపట్టి గత నెల 16న ప్రారంభించిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర నేటితో జనగామ జిల్లాలో 500 కిలోమీర్లు పూర్తి చేసుకుంది. జనగామ జిల్లా, జనగామ నియోజకవర్గం, కొర్రితండా వద్ద 500 కిలోమీటర్ల పూర్తి చేసుకున్న సందర్భంగా  సీఎల్పీ నేత భట్టి విక్రమార్కకు కాంగ్రెస్ పార్టీ నాయకులు అభినందనలు తెలిపారు. మాజీ పీసీసీ అధ్యక్షుడు, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ ఆధ్వర్యంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తో కేక్ కట్ చేయించారు. అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా పొన్నాల లక్ష్మయ్య మాట్లాడుతూ అనుకున్న లక్ష్యం పూర్తయ్యే వరకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే వరకు పోరాటం విడనాడవద్దని, మీ వెనకాల కాంగ్రెస్ బలం, బలగం ఉందన్నారు.  ఈ సందర్భంగా సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మాట్లాడుతూ ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు, ప్రభుత్వం చేస్తున్న తప్పిదాలను ప్రశ్నించేందుకు,  ప్రభుత్వాన్ని నిలదిసేందుకు, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరువాత ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు ఈ పిపుల్స్ మార్చ్ చేస్తున్నానని అన్నారు. 500 కిలోమీటర్ల పాటు పాదయాత్రలో పాల్గొన్న కార్యకర్తలకు, ప్రజలు, సహాకరించిన పార్టీ నాయకత్వానికి ధన్యవాదాలు తెలిపారు.  కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు ప్రతి ఒక్క కార్యకర్త కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు.

ఇది కూడా చదవండి: జగ్గారెడ్డికి రేవంత్ రెడ్డి షాక్