Telugu News

ఈ నెల 11 నుంచి జిల్లాల్లో పర్యటించనున్న ముఖ్యమంత్రి కేసీఆర్

ఈ నెల 11 నుంచి జిల్లాల్లో పర్యటించనున్న ముఖ్యమంత్రి కేసీఆర్

0

ఈ నెల 11 నుంచి జిల్లాల్లో పర్యటించనున్న ముఖ్యమంత్రి కేసీఆర్

తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ ఈ నెల 11 నుంచి జిల్లాల పర్యటన చేయనున్నారు. జనగామ జిల్లా పర్యటనతో మొదలుపెట్టి నిజామాబాద్, హనుమకొండ, జగిత్యాల, యాదాద్రి భువనగిరి, వికారాబాద్ జిల్లాల్లో సీఎం పర్యటిస్తారు. గతంలో వాయిదా పడిన పలు జిల్లాల్లో కూడా పర్యటించాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారట.

జిల్లాల పర్యటనలో ఆయన జిల్లా కలెక్టరేట్‌ కార్యాలయాల భవన సముదాయాన్ని, తెరాస జిల్లా కార్యాలయాలను ప్రారంభిస్తారు. రాష్ట్రంలో వరంగల్‌, హైదరాబాద్‌ మినహా అన్ని ఇప్పటికే జిల్లాల్లో తెరాస కార్యాలయాలను నిర్మించారు. అన్నీ కూడా ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నరే గడువు ఉండగా.. 33 జిల్లాలకు పార్టీ జిల్లా అధ్యక్షుల నియామకం పూర్తి చేసేశారు. ఈ క్రమంలోనే జిల్లా కార్యాలయాలను ప్రారంభించి జిల్లా అధ్యక్షులకు వాటి బాధ్యత అప్పగించనున్నారు. జిల్లాల పర్యటన అనంతరం భారీ బహిరంగ సభ కూడా నిర్వహిస్తారట.