Telugu News

కొనసాగుతున్న ఈ అభివృద్ది అగకుడదు :మంత్రి పువ్వాడ

మంచుకొండ, బుడిదంపాడు గ్రామాల్లో రూ.32.13 కోట్లతో అభివృద్ది పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేసిన మంత్రి పువ్వాడ

0
కొనసాగుతున్న ఈ అభివృద్ది అగకుడదు :మంత్రి పువ్వాడ
== మంచుకొండ, బుడిదంపాడు గ్రామాల్లో రూ.32.13 కోట్లతో అభివృద్ది పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేసిన మంత్రి పువ్వాడ
(ఖమ్మం ప్రతినిధి-విజయం న్యూస్)
ఖమ్మం నియోజకవర్గం రఘునాధపాలెం మండలంలో కొనసాగుతున్న అభివృద్ది అగకుడదు. ఇదే విధంగా కొనసాగాలంటే మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం ను గెలిపించికోవడం ద్వారానే సాధ్యమని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్  అన్నారు. ఆదివారం రఘునాధపాలెం మండలం బుడిదంపాడు, మంచుకొండ గ్రామంలో రూ.32.13 కోట్లతో చేపట్టిన బ్లాక్ టాప్(బీటీ) రోడ్స, సీసీ డ్రెయిన్లు, సీసీ రోడ్స్, డొంక రోడ్లు, హై మాస్ట్ లైట్స్ పనులను రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున స్వాగతం పలిగారు. రోడ్ షో ద్వారా ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు కదిలారు. బూడిదంపాడు గ్రామంలో ఎన్ఆర్ఈజీఎస్ నిధులు రూ.49లక్షలతో నిర్మించిన 18 సీసీ రోడ్స్ ను ప్రారంభించారు.ఎస్డీఎఫ్ నిధులు రూ.10 లక్షలతో నిర్మించిన మూడు రోడ్స్, సీఎస్సీ ట్రాన్స్కో నిధులు రూ.10 లక్షలతో అభివృద్ది చేసిన డొంక రోడ్డు ను ప్రారంభించారు.సుడా నిధులు రూ.3.50 లక్షలతో నిర్మించిన హై-మాస్ట్ లైట్స్ ను స్విచ్ అన్ చేసి ప్రారంభించారు. మంచుకొండ గ్రామంలో గ్రామీణ రహదారుల నిర్మాణం(సీఆర్ఆర్) నిధులు రూ.25.50 కోట్లతో నిర్మించనున్న అన్ని ప్రధాన రహదారులకు లింక్ రోడ్స్(బీటీ రోడ్స్) నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.
ఎన్ఆర్ఈజీఎస్ నిధులు రూ.5.02 కోట్లతో నిర్మించిన 145 పనులు రోడ్స్ & డ్రైన్స్ పనులకు శంకుస్థాపన, సీఎస్ఆర్ నిధులు రూ.9 లక్షలతో అభివృద్ది చేసిన ఒక డొంక రోడ్డు ను ప్రారంభించారు. ఎస్డీఎఫ్ నిధులు రూ. 10 లక్షలతో నిర్మించనున్న 7 పనులకు శంకుస్థాపన చేశారు.సుడా నిధులు రూ.3.50 లక్షలతో నిర్మించిన హై-మాస్ట్ లైట్స్ ను స్విచ్ అన్ చేసి ప్రారంభించారు. ఖమ్మం నియోజకవర్గంకు 3వేల గృహలక్ష్మీ పథకం ఇస్తే ముఖ్యమంత్రి కేసీఅర్ గారికి విజ్ఞప్తి చేసి మారో 1000 మంజూరు చేసినం. అందులో 1,250 గృహలక్ష్మి మండలంకే ఇచ్చినం. మనం ఇప్పటి వరకు చేసిన అభివృద్ది ఎక్కడికి పోదు.. మళ్ళీ మనమే వస్తాం.. ఇక్కడ నేనే ఉంటా.. అక్కడ కేసీఅర్ ఉంటారు. ఎవ్వరు రంది పడాల్సిన పని లేదు. ఇప్పటికే గృహలక్ష్మి, దళిత బందు ఇచ్చినం. మళ్ళీ వస్తాయి ఇస్తాం.. రానున్న రెండు నెలల్లో మళ్ళీ ఇవే పథకాలు అన్ని మీకు పేరు పేరున అర్హులైన ప్రతి ఒక్కరికీ అందిస్తా అని హామీ ఇస్తున్నా.. ఒక్కసారి ఆలోచించండి.. మనకు వచ్చినన్ని నిధులు ఎక్కడ రావు.. రావు కూడా.. వట్టిగానే తీయ్యగా పుల్లగా మాట్లాడితే రావు.. ఎంతో కొట్లడాలి. ముఖ్యమంత్రి కేసీఅర్ వద్ద పోరాడి తెస్తున్నాం.. అర్దం చేసుకోవాలి మీరు. మీకు జరిగినంత అభివృద్ది ఎక్కడ జరిగింది. ఖమ్మం నగరంమే మీ దగ్గరికి వచ్చే సింది..
6వరుసల లైన్ పవర్ గ్రీడ్ వరకు వేసి నా చిత్త శుద్ది ని నిరూపించు కుంటా అని సవినయంగా రుణం తీర్చు కుంటా. ఈ అభివృద్ది ఆగకుడదు.. అక్కడ కేసీఅర్ గారు రావాలి.. ఇక్కడ నేను రావాలి.. హ్యాట్రిక్ కొట్టాలి… గృహలక్ష్మి పథకం ప్రతి ఒక్కరికీ అందిస్తా.. ఎలక్షన్ అయిపోయక అవసరం అయితే మళ్ళీ కేసీఅర్ ని కలిసి విజ్ఞప్తి చేసి మళ్ళీ అదనంగా గృహలక్ష్మీ పథకంను తీసుకొచ్చి ప్రతి ఒక్కరికీ అందిస్తా అని హామీ ఇస్తున్నా. నాకు కేవలం మంత్రి పదవి నాలుగేళ్లు మాత్రమే వచ్చింది.. ఇంకో సారి అవకాశం వేస్తే ఎలా ఉంటది.. రఘు నాధ పాలెం మండలంలో అభివృద్దితో కూడిన మయాబాజార్ ను చేసి చూపిస్తా.. అభివృద్దికి అండగా నిలవాలి. గడచిన పదేళ్లలో ఖమ్మం నియోజకవర్గంలో వందేళ్ల భవిష్యత్ నిర్మించాం. తాగునీటికి, సాగునీటికి లోటు లేకుండా తీర్చిదిద్దాం. వ్యవసాయం అద్భుతం సాగుతుంది.. కొత్తగా వేల ఎకరాలు సాగులోకి వచ్చినయి.బీఆర్ఎస్ ప్రభుత్వం అందిస్తున్న ఉచిత విద్యుత్, సాగు, త్రాగు నీటి రాకతో వలసలు ఆగిపోయాయి .. ఇతర రాష్ట్రాల నుండి ఇక్కడికి ఉపాధి కోసం వలసలు వస్తున్నారు. విద్య, వైద్యం, కరంటు, వ్యవసాయం, ఉపాధి రంగాలలో గణనీయమైన ప్రగతి సాధించాం. సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ నంబర్ వన్. కేసీఆర్ నాయకత్వం మూలంగానే ఈ విజయాలు సాధ్యమయ్యాయి.
గ్రామాల్లో జరుగుతున్న అభివృద్దిని గమనించండి.. రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని మరోసారి ఆశీర్వదించాలి. మీ ఆశీర్వాదంతో మళ్ళీ మనం గెలవాలి.. హ్యాట్రిక్ కొట్టాలి. అభివృద్ధిని కొనసాగించాలని సవినయంగా కోరుకుంటున్నా..