కలిసిన ‘తుమ్మల, రాయల’..ఏం జరిగిందంటే..?
== జెండా, ఏజెండా ఒక్కటే అంటూ వ్యాఖ్య
== ఖమ్మం నగరంలో ఆసక్తికర సన్నివేశం..
(ఖమ్మంరూరల్-విజయంన్యూస్)
ఖమ్మం జిల్లాలో రాజకీయం హీటెక్కింది.. పలువురు ఆగ్రనాయకులు పార్టీలు మారుతున్న నేపథ్యంలో రాజకీయం ఒక్కసారిగా హీటెక్కింది.. రాష్ట్ర వ్యాప్తంగా ఒక తరహాలో రాజకీయం ఉంటే, ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా అందుకు భిన్నంగా రాజకీయాలు నడుస్తున్నాయి.. బీఆర్ఎస్ పార్టీలో కీలక నేతలు సైతం కాంగ్రెస్ వైపు వెళ్తున్న సందర్భంలో ఎలాంటి సంఘటన జరిగిన అసక్తిగానే కనిపిస్తుంది. దీంతో పాఠకులు, ప్రజలు ఎంతో అసక్తిగా చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది.. అలాంటి అసక్తికర సంఘటన గురువారం ఖమ్మం నగరంలో చోటు చేసుకుంది. ఏంటది..? ఏం జరిగింది..?
== కలిసిన ఆ ఇద్దరు నేతలు
ఒకాయన రాజకీయ చాణిక్యుడు.. అపర రాజకీయ మేథావి.. నాలుగు దశాబ్ధాలుగా రాజకీయాన్ని ఏకచత్రాధిపత్యం చేసిన నాయకుడు.. ఆయన నేటికి జిల్లాలో బలమైన నాయకుడే.. జనబలం కల్గిన ఆ నాయకుడు మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.. ప్రస్తుతం పాలేరు నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు అసక్తి కనబరుస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ టిక్కెట్ నిరాకరించడంతో కాంగ్రెస్ పార్టిలో చేరాలని కార్యకర్తలు, అనుచరులు తీవ్ర ఒత్తిడి తీసుకోస్తున్నారు.
ఇది కూడా చదవండి: ఖమ్మం బీఆర్ఎస్ టార్గెట్ ‘ఆ ఇద్దరే’నా..?
ఇదిలా ఉంటే మరోకాయన రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి.. కమ్యూనిస్టు మార్కిస్ట్ పార్టీ కుటుంబంలో జన్మించిన ఆ నాయకుడు శ్రమజీవి. చిన్నప్పటి నుంచి కష్టపడి పైకి వచ్చిన నాయకుడు.. పాలేరు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి చెందిన ఆ నాయకుడు.. గత 10ఏళ్లుగా పార్టీని నమ్ముకుని పాలేరు నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. కార్యకర్తలకు భరోసానిస్తున్నారు.. ప్రస్తుతం పాలేరు టిక్కెట్ కోసం ప్రయత్నిస్తున్నారు.. అయితే గురువారం ఖమ్మం నగరంలోని ఎస్ పార్క్ లో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన ఆ ఇద్దరు నాయకులు ఒకరినోకరు ఎదురుపడ్డారు. దీంతో ఇద్దరు అప్యాయతగా పలకరించుకున్నారు.. రాజకీయాల గురించి మాట్లాడారు.. జెండా..ఏజెండా మనది ఒక్కటే సార్ అని రాయల నాగేశ్వరరావు, గెలుపు కూడా మనదేనని తుమ్మల నాగేశ్వరరావు చెప్పడంతో ఒక్కసారిగా కలియక హీట్ హెక్కింది. కొద్ది సేపు రాజకీయాల గురించి మాట్లాడుకున్న ఆ ఇద్దరు నేతలు ఆ తరువాత వెళ్లిపోయారు. ఈ సంఘనట చూసేవారికి చూడముచ్చటైంది.. అయితే ఇద్దరి కలయిక తో పాలేరు నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు ఆనందంలో మునిగిపోయారు.
ఇది కూడా చదవండి: తుమ్మల చేరికు అప్పుడే..?