Telugu News

రామచంద్రయ్య నగర్లో నివాసాలు కోల్పోయిన వారిని  తక్షణమే ఆదుకోవాలి : వాసుదేవరావు

* *జాతీయ బీసీ కమిషన్ చైర్ పర్సన్ భగవాన్ లాల్ సాహినికి వినతిపత్రం .

0

రామచంద్రయ్య నగర్లో నివాసాలు కోల్పోయిన వారిని  తక్షణమే ఆదుకోవాలి : వాసుదేవరావు                             

* *జాతీయ బీసీ కమిషన్ చైర్ పర్సన్ భగవాన్ లాల్ సాహినికి వినతిపత్రం . 

 ఖమ్మం జిల్లా ఇబీజేపీ ఇంచార్జి దేవకీ వాసుదేవరావు 

(ఖమ్మం – విజయం న్యూస్)

ఖమ్మం జిల్లా ఇబీజేపీ ఇంచార్జి దేవకీ వాసుదేవరావు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనలో అధికార పార్టీల నాయకుల దౌర్జన్యంతో రామచంద్రయ్య నగర్ , పాకాబండ్ల బజార్ -2 ప్రాంతంలో నివాసం ఉంటూ ఇళ్లను కోల్పోయి రోడ్డు పాలై , నిరాశ్రయులైన వారికి ఇళ్ళని తిరిగి ఇప్పించడం కోసం వారి నుండి లేఖ తీసుకుని అందులో అందరి సంతకాలు చేర్చి , అలాగే ఆ భూములకు సంభందించిన పూర్తి వివరాలతో ఢిల్లీకి వెళ్లి అక్కడ వారి తరపున జాతీయ బీసీ కమిషన్ చైర్ పర్సన్ భగవాన్ లాల్ సాహిని గారికి వినతిపత్రాన్ని అందజేసి వివరించారు .

అక్కడ ఎప్పటినుండో నివాసం ఉంటున్న పేదల ఇల్లు ప్రభుత్వం కూల్చివేసి రోడ్డున పడేసింది అని , వారికి అక్కడే పట్టాలు ఇప్పించి వాటిని క్రమబద్దెకారణ చేయాల్సిందిగా లేదా వారికీ తెరాస ప్రభుత్వం నుండి డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పట్టాలను ఇప్పించాల్సిందిగా తక్షణమే నివాసాలు కోల్పోయిన వారిని ఆదుకోవాలని కోరారు .

గతంలో పేదలకు జరిగిన అన్యాయాన్ని ఖమ్మం జిల్లా ఇంచార్జి వాసుదేవరావు జాతీయ బీసీ కమిషన్ సభ్యులు శ్రీ తల్లోజు ఆచారి దృష్టికి తీసుకుని వేల్లగా అప్పుడు స్వయంగా శ్రీ తల్లోజు ఆచారి , జాతీయ బీసీ కమిషన్ వైస్ చైర్మన్ లోకేష్ కుమార్ ప్రజాప్రతినిధి మరియు ఖమ్మం జిల్లా బీజేపీ అధ్యక్షుడు గల్లా సత్యన్నారాయణ , బీజేపీ  కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు శ్రీధర్ రెడ్డి మొదలగు వారిని వెంటబెట్టుకుని రామచంద్రయ్య నగర్ సందర్శించి బాధితులను  కలవడం జరిగిందని , జరిగిన సంఘటన తెలుసుకున్న  బాధితులకి అండగా ఉంటామని జాతీయ బీసీ కమిషన్ సభ్యులు శ్రీ తల్లోజు ఆచారి , జాతీయ బీసీ కమిషన్ వైస్ చైర్మన్ లోకేష్ కుమార్ ప్రజాప్రతినిధి మనో ధైర్యాన్ని చెప్పారన్నారు .

తదనంతరం అట్టి విషయాన్ని పై అధికారులకు తెలిసేలా చేయాలని నివాసాలు కోల్పోయిన పేదలందరూ కలిసి సందర్శించడానికి వచ్చిన అధికారులకు న్యాయం చేయాలని నివేదిక సమర్పించడం జరిగింది అన్నారు . అందరి సమక్షంలో కలెక్టర్ ని పిలిచి పట్టాలు ఇవ్వాలని ప్రజాపతి , ఆచారి విజ్ఞప్తి చేయగా 15 రోజుల్లో ప్లాట్లు ఇస్తాము అని కలెక్టర్ హామీ ఇవ్వడం జరిగిందని కానీ  నాలుగు నెలలు అవుతున్న పేదలైన బాధితులకి ఎటువంటి న్యాయం జరగకపోవడంతో ఈ విషయాన్ని ఢిల్లీ వరకు తీసుకు వెళ్లాల్సిన ఆవశ్యకత ఏర్పడిందని పేర్కొన్నారు .అంతరం మీడియాతో మాట్లాడుతూ కెసిఆర్ ప్రభుత్వం పేదల పట్ల చూపుతున్న వివక్షను తప్పుబట్టారు . నాయకులు రాక్షసులై ప్రజలు పీడిస్తున్నారన్నారు .

పేదల తరుపున నిలబడి వారికి న్యాయం చేయడానికి ఎక్కడి వరకైనా వెళతాను అన్నారు . తెరాస ప్రభుత్వం ప్రజల్ని దుర్భుద్ధి తో వేధించడం మానలని అలాగే ఖమ్మం అర్బన్ మండలం రామచంద్రయ్య నగర్లో నివాసాలు కోల్పోయిన వారిని  తక్షణమే ఆదుకోవాలని  డిమాండ్ చేసారు . తదుపరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వారు జీవో నెంబర్ 58 &59. లు , 30.12.2014 లో జీవో జారీ చేశారు . జీవో నెంబర్ 58 ప్రకారం ఆ పేదలందరికీ సహజంగానే రెవెన్యూ శాఖ వారు స్వతంత్రంగానే పరిశీలించి ఒక్కొక్కరికి 125 చదరపు గజాలు ఉచితంగానే మంజూరు చేసి ఇవ్వవలసి ఉన్నది . కానీ ఆ పేదలు దరఖాస్తులు పెట్టుకున్నప్పటికీ రెవెన్యూ అధికారులు దురుద్దేశంతో పట్టాలు ఇవ్వడం లేదని , రామచంద్రయ్య నగర్ సర్వ్ నెంబర్ 26 , 26 , 34 , 34 \ వై ఇ 39 \బి 41 , 42 , 43 , 44 , 92 , 93 , 94 , 95 , ప్రాంతం లో  ఎన్ ఎస్ పి నిరుపయోగ కాల్వ కట్టలు వున్నాయ్ , వాటి పై 2001 -02 సంవత్సరాలలో సొంత నివాసాలు లేని నిరుపేదలు వందలాది మంది దశల వారీగా నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు . వారికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటువంటి నోటీసులు జారీ చేయకుండా దౌర్జన్యంగా , 25 , 26 జూన్ 2021 కాలంలో కరోనా తీవ్రత కొనసాగుతూనే పరిస్థితిలో అప్పటికప్పుడు ఆగమేఘాల మీద హడావిడిగా ఆ పేదల గుడిసెలు కూల్చాల్సిన అత్యవసర అనివార్య పరిస్థితి ఏమిటో ? అధికారులు తెలియకుండానే కక్షపూరిత ధోరణితో పేదల నివాసముంటున్న ఇళ్లను  కూల్చివేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు .

ఇది కేవలం అక్కడి ప్రజలు తెరాస పాలనకు మొగ్గు చూపకపోవడం , బీజేపీ పార్టీ మద్దతు దారులవడం తోనే కక్షగట్టి ఇలాంటి దుశ్చర్యలకు ప్రభుత్వం పాల్పడుతుందని అక్కడి ప్రజలు వాపోతున్నరని , అలాగే దీని వెనుక తెరాస రాష్ట్ర రవాణా శాఖ మంత్రి చక్రం తిప్పుతున్నట్లుగా ప్రజలు చెప్పుకుంటున్నారని ఆరోపించారు . ప్రభుత్వం దురుద్దేశ్యంతోనే మున్సిపల్ అధికారులతో కలిసి అక్కడి ఇళ్లను  కూల్చి వేయడం జరిగిందని అక్కడి స్థానికులు  చెబుతున్నారు , అక్కడే నివాసం ఉంటున్న రజక  సామజిక వర్గం పగిడిపల్లి నాగేశ్వరరావు మాట్లాడుతూ తెరాస దౌర్జన్యాలని ఎండగట్టాడు కూల్చివేతల మీద ఒంటరి పోరాటం చేస్తున్నందుకు అతని ఇంటికి   బిగించిన కరెంటు మీటరుని ఇంట్లో ఎవరు లేని సమయంలో మిట్ట మధ్యాహ్నం తీసుకెళ్లడం జరిగిందని కరెంటు మీటరు లేకుండా పెనాల్టీలతో అతని వద్ద నుండి అధిక  బిల్లులు వసూలు చేయడం కూడా జరుగుతుందన్నారు.

 

also read:- అదివాసులను ముంచేస్తున్న ఎరువుల దుకాణా యజమానులు. ఎరువుల షాపుల యాజమాన్యం కి వరంగా మారిన తరుగు.

also read:-తీన్మార్ మల్లన్నపై ఖమ్మంలో టీఆర్ఎస్ యువజన విభాగం ఫిర్యాదు