Telugu News

కాంగ్రెస్ లో కష్టపడేవారికి పదవులు రావడం ఖాయం

శరత్ గౌడ్, కొండా శ్రీనివాస్ రావును సన్మానించిన కాంగ్రెస్ నాయకులు

0

కాంగ్రెస్ లో కష్టపడేవారికి పదవులు రావడం ఖాయం

== శరత్ గౌడ్, కొండా శ్రీనివాస్ రావును సన్మానించిన కాంగ్రెస్ నాయకులు

(కూసుమంచి-విజయంన్యూస్)

కాంగ్రెస్ పార్టీలో కష్టపడి పనిచేసే ప్రతి ఒక్కరికి పదవులు వస్తాయని, పదవుల కోసం పనిచేసేవారికి పదవులు వాటంతట అవే దూరమవుతాయని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తెలిపారు. కూసుమంచి మండలం కేంద్రానికి చెందిన బెల్లంకొండ శరత్ గౌడ్  రాష్ట్ర సోషల్ మీడియా కన్వీనర్ గా నియమితులైన సందర్భంగా, అలాగే జీళ్లచెరువు గ్రామానికి చెందిన కొండా శ్రీనివాస్ రావు ఎస్సీసెల్ మండల అధ్యక్షుడిగా నియమితులైన సందర్భంగా ఇద్దరికి కూసుమంచి మండల కేంద్రంలోని మిని గాంధీభవన్ లో సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా వారిని మండల నాయకత్వం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.

ఇది కూడా చదవండి: ‘పాలేరు’లో మద్యం దందా..?

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజకీయాల్లో చిన్న పెద్ద తేడా లేదని, సినియర్లు, జూనియర్లు అనే బేదాలు ఉండవన్నారు. ఎవరైతే పార్టీ కోసం కష్టపడతారో, శ్రమిస్తారో వారికి పదవులు వాటంతట అవే నడుచుకుంటూ వస్తాయని అన్నారు. అతి చిన్నవయస్సులోనే రాష్ట్ర, మండల పదవులను పొందిన శరత్ గౌడ్, శ్రీనివాస్ రావులకు అభినందనలు తెలిపారు.

== బాబుజగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు 

కూసుమంచి మండలకేంద్రంలోని సీనియర్ నాయకులు ఎండీ.హాఫీజుద్దీన్ నివాసం(మిని గాంధీభవన్) వద్ద మాజీ కేంద్రమంత్రి బాబుజగజ్జీవన్ రామ్ జయంతి వేడుకలను కాంగ్రెస్ పార్టీ కూసుమంచి మండల కార్యకర్తల ఆధ్వర్యలో ఘనంగా జరుపుకున్నారు. అనంతరం ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళ్లు అర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు  ఎండీ.హాఫీజుద్దీన్, మధిర ఇంచార్జ్ పి.అంజయ్య, మహిళా జిల్లా ఉపాధ్యక్షురాలు బానోతు వినోద, బానోతు బొంగా నాయక్, ఎండీ. ఖలీమ్, మాదవ్ రెడ్డి, వనం మధుసూదన్, ఆలేటి రాంబాబు, సూర్యనారాయణ రెడ్డి, అంజిరెడ్డి, చిన్నం సంగయ్య, ,ఎన్ ఎస్ యూ ఐ మండల కన్వీనర్ బానోతు హరినాథ్, యువజన కాంగ్రెస్ పాలేరు ప్రధాన కార్యదర్శి బెల్లి శ్రీశైలం, బిక్షం నాయక్,   కిరణ్, సైదా నాయక్ తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: కూసుమంచిలో  కాంగ్రెస్ ఆధ్వర్యంలో ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్దం