Telugu News

మున్నేరు అదుపులోనే ఉంది: మంత్రి

ఒక్కరు మినహా ఎలాంటి ప్రాణనష్టం లేదు

0

మున్నేరు అదుపులోనే ఉంది: మంత్రి

== ఒక్కరు మినహా ఎలాంటి ప్రాణనష్టం లేదు

== అందర్ని అదుకుంటాం

== సక్సెస్ పుల్ చేసినందుకు అందరికి అభినందనలు

== విలేకర్ల సమావేశంలో రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్ కుమార్

(ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్)

ఖమ్మం మున్నేరు అదుపులోనే ఉందని, చాలా తగ్గుముఖం పట్టిందని, ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా వెళ్లిపోయిందని, రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. టీటీడీసీ భవనంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆయన మాటల్లోనే చూద్దాం.. ఎవ్వరు ఊహించనంతగా చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా అత్యంత వేగంగా 5లక్షల క్యూసెక్కుల నీరు చూశామన్నరు.దాన్ని సమర్థవంతంగా ఎదుర్కున్న అధికారులు, సిబ్బందికి అభినందనలు తెలిపారు. మున్నేరు వరదల వల్ల జిల్లా వ్యాప్తంగా ఎక్కడ ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని, పాలేరు నియోజకవర్గంలో తన స్వయంకృతాపరాదం వల్లే సతీష్ అని యువకుడు మృత్యువాత పడ్డారని, NDRF బృందం ద్వారా పద్మావతి నగర్, వేంకటేశ్వర నగర్, మంచికంటి నగర్, మేధా ఇంజనీరింగ్ కళాశాల నుండి ఇప్పటి వరకు 78 మంది ని రక్షించగలిగామన్నారు.

ఇది కూడా చదవండి: శాంతించిన మున్నేరు..పరిశీలించిన మంత్రి

మున్నేరు పరివాహక ప్రాంతంలోని లోతట్టు ప్రాంతాలైన బొక్కలగడ్డ, కాల్వఒడ్డు, వేంకటేశ్వర నగర్, మోతి నగర్, రామన్నపేట, దంసలాపురంలో 665 ఇళ్ల ను ఖాళీ చేయించి 2095 మంది బాధితులను నయా బజార్ పాఠశాల, రామన్న పేట పాఠశాల, కందగట్ల ఫంక్షన్ హాల్, దంసలాపురంలో ప్రభుత్వం ఎర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు తరలించామని పేర్కొన్నారు.వీటితో పాటు వైరా, కూసుమంచి నేలకొండపల్లి, ఖమ్మం రూరల్ మండలంలోని 471 ఇళ్లను ఖాళీ చేయించి మొత్తం 485 మందిని పునరావాస కేంద్రాలకు తరలించడం జరిగిందన్నారు. అడిగిన వెంటనే NDRF బృందాన్ని పంపిన ముఖ్యమంత్రి కేసీఅర్ గారికి కృతజ్ఞతలు తెలిపారు. అర్ధరాత్రి అయినప్పటికీ ఎలాంటి ఆందోళన లేకుండా అర్థరాత్రి వరకు నిర్విరామంగా రెస్క్యూ నిర్వహించి ఆఖరి వ్యక్తి వరకు ప్రాణాలకు తెగించి రక్షించారని వారికి అభినందనలు తెలిపారు. అధికార యంత్రాంగం అద్భుతంగా పని చేసిందని, వారందరికీ ప్రత్యేక అభినందనలు తెలిపారు. వరద ముంపు ప్రాంతాల్లో తక్షణమే శానిటేషన్ ను ప్రారంభిస్తామని, విషజ్వరాలు ప్రభలకుండ ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపడుతుందని చెప్పారు.

ఇది కూడా చదవండి: ఖమ్మం నగరంలో పారిశుధ్య పనులు వేగవంతం చేయండి: మంత్రి