Telugu News

కరోనా పరిస్థితిని సమీక్షించిన కేబినెట్

** మూడు గంటల పాటు సుదీర్ఘ చర్చలు

0

కరోనా పరిస్థితిని సమీక్షించిన కేబినెట్
** మూడు గంటల పాటు సుదీర్ఘ చర్చలు
** పలు కఠినమైన నిర్ణయాలు తీసుకునే యోచన
** సబ్ కమిటీ ఏర్పాటు..?
** అతికొద్ది గంటల్లోనే సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్
(హైదరాబాద్-విజయంన్యూస్)
ప్రపంచాన్నే గడగడలాడిస్తున్న కోవిడ్ విజ్రుంభనపై తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం సుదీర్ఘంగా చర్చిస్తోంది.. సోమవారం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ప్రగతి భవన్ లో జరిగిన కేబినెట్ సమావేశంలో తొలుత రాష్ట్రంలో కరోనా పరిస్థితి పై చర్చ జరిగింది . ఈ సందర్భంగా వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు, రాష్ట్రంలో కరోనా పరిస్థితి పై గణాంకాలతో సహా వివరించారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితి అదుపులో ఉన్నదని, ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కునేందుకు అన్ని విధాలుగా రాష్ట్ర వైద్యారోగ్యశాఖ సంసిద్ధంగా ఉన్నదని తెలిపారు.

రాష్ట్రంలో ఇప్పటికే 5 కోట్ల వాక్సినేషన్ డోసులు ఇవ్వడం జరిగిందని, అర్హులైన అందరికీ అతి త్వరగా వాక్సినేషన్ ఇవ్వడం జరుగుతుందని మంత్రి హరీష్ రావు తెలిపారు. కరోనాను కట్టడి చేసేందుకు ప్రజలు గుంపులు గుంపులుగా గుమిగూడకుండా పూర్తి స్వీయ నియంత్రణ పాటించడం ద్వారా కరోనాను కట్టడి చేయవచ్చని మంత్రి హరీష్ రావు తెలిపారు.

also read;-వరుస దొంగతనాలతో హడలెత్తిపోతున్న ప్రజలు……

మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖల అధికారుల సహాయం తీసుకొని వారితో సమన్వయం చేసుకుంటూ వాక్సినేషన్ కార్యక్రమాన్ని త్వరగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి వైద్యారోగ్యశాఖ మంత్రిని , అధికారులను ఆదేశించారు. ఇందుకోసం అన్నిజిల్లాల మంత్రులు కలెక్టర్లు సమీక్షా సమావేశాలు నిర్వహించుకోవాలని సిఎం ఆదేశించారు.

ధాన్యం కొనుగోలు పూర్తయ్యేంత వరకు కొనుగోలు కేంద్రాలను కొనసాగించండి : అధికారులకు కేబినెట్ ఆదేశం

also read :-ఇష్టా రాజ్యం… అంతా మా ఇష్టం…!

వానాకాలం ధాన్యం కొనుగోలు జరుగుతున్న పరిస్థితులపై కేబినెట్ చర్చించింది. ఇప్పటికే ధాన్యం కొనుగోలు పూర్తి కావచ్చిందని, అకాల వర్షాల వల్ల కొన్ని జిల్లాల్లో ధాన్యం ఇంకా కూడా కొనుగోలు కేంద్రాలకు వస్తున్నదని, దీనిని దృష్ణిలో పెట్టుకుని ధాన్యం కొనుగోలు పూర్తయ్యేంత వరకు కొనుగోలు కేంద్రాలను కొనసాగించాలని, ధాన్యాన్ని పూర్తిగా కొనుగోలు చేయాలని అధికారులను కేబినెట్ ఆదేశించింది.

రేపు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన

అకాల వర్షాల వల్ల పంట నష్టం జరిగిన ఉమ్మడి వరంగల్ జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటించాలని కేబినెట్ నిర్ణయించింది. ఈ మేరకు రేపు (మంగళవారం) సిఎం కెసిఆర్ ఉమ్మడి వరంగల్ జిల్లా పర్యటన చేపట్టనున్నారు. వ్యవసాయ శాఖ మంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సహా ఇతర ఉన్నతాధికారులు సిఎం కెసిఆర్ తో పాటు పర్యటనలో పాల్గొననున్నారు.