ఖమ్మంలో నేడు ముగ్గురు మంత్రులు పర్యటన
== పలు అభివద్ది పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం
(ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్)
రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖమంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిండెంట్, సీఎం కేసీఆర్ తనయుడు కల్వకుంట్ల తారకరామారావు శనివారం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. మంత్రి కేటీఆర్ తో పాటు రాష్ట్ర రోడ్డుఅండ్ భవనాల శాఖమంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, పార్లమెంటరీ పార్టీ నేత నామ నాగేశ్వరరావు, రాజ్యసభ సభ్యులు రవిచంద్ర, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పర్యటించనున్నారు. ఖమ్మం జిల్లాలో రూ.1350 కోట్ల నిధులతో నిర్మాణం చేస్తున్న అభివృద్ది పనులకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపనలు చేయనున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నాలుగు నియోజకవర్గంలో వీరందరు పర్యటించనున్నారు. ఖమ్మం, వైరా, భద్రాచలం, సత్తుపల్లి నియోజకవర్గాల్లో వారు పర్యటించనున్నారు. ఖమ్మం నగరానికి అత్యంత ప్రతిష్టాత్మకమైన పథకాలకు మంత్రులు శంకుస్థాపన చేయనున్నారు.
allso read- నేడు ఖమ్మంకు ‘తారకరామారావు’
== మంత్రులు షెడ్యూల్ ఇలా
** ఉదయం 7.30గంటలకు సీఎం క్యాంఫ్ నుంచి బేగం పేటకు బై రోడ్డున మంత్రి కేటీఆర్, మంత్రి ప్రశాంత్ రెడ్డి వెళ్లనున్నారు
** ఉదయం 7.45 గంటలకు బేగంపేట నుంచి హెలికాప్టర్ ద్వారా బయలుదేరనున్నారు
** ఉదయం 8.30గంటలకు కొణిజర్ల మండలం, గుబ్బగుర్తి లో ఏర్పాటు చేసిన ప్రత్యేక హెలిప్యాడ్ లో ల్యాండ్ కానున్నారు… బై రోడ్డుగా గుబ్బగుర్తి చేరుకుని అక్కడ ఆయిల్ ఫామ్ ప్యాక్టరీ ప్రారంభించనున్నారు.
** ఉదయం 9.00గంటలకు హెలికాప్టర్ లో మమత జనరల్ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్దకు వచ్చి అక్కడ నుంచి బై రోడ్డుగా లకారం ట్యాంక్ బండ్ పై ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ పార్క్ ను ప్రారంభించనున్నారు.
** లకారం ట్యాంక్ బండ్ వద్ద అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు
** లకారంలో ఎన్ టిఆర్ పార్క్, అమృత్ పథకం కింద అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ కి శంకుస్థాపన
** త్రీ టౌన్ పరిధిలోని గోళ్లపాడు ఛానల్ మీద ఏర్పాటు చేసిన పది పార్క్ లు అన్నింటిని కలిపి ప్రారంభోత్సవం
** లకారం చెరువు వద్ద పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన
allso read- పాలేరులో బీఆర్ఎస్ గెలుపు తథ్యం: మంత్రి పువ్వాడ
** ఉదయం 10.45 గంటలకు మున్నేరు రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు ను తీగల బ్రిడ్జికి శంకుస్థాపన
** ఉదయం 11.15గంటలకు విడిఓస్ కాలనీ లో వెజ్ అండ్ నాన్ వేజ్ మార్కెట్ ప్రారంభోత్సవం
** ఉదయం 11.30ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ వద్ద ఖమ్మం ప్రగతి నివేదిన సభ
** ఖమ్మం,కార్పొరేషన్ పరిధిలో చేసిన పట్టణ ప్రగతి డాక్యుమెంటరీ ప్రదర్శన
** మధ్యాహ్నం 12.30గంటలకు భద్రాచలంలో గోదావరి కరకట్టకు 38కోట్లతో నిధులు మంజూరు కూనవరం రోడ్డు లో శంకుస్థాపన
** మధ్యాహ్నం 1.30గంటలకు అంబేద్కర్ సెంటర్ లో సెంట్రల్ లైటింగ్ మీడియా సమావేశం..లంచ్ బ్రేక్
** మధ్యాహ్నం 2.00గంటలకు హెలికాప్టర్ లో సత్తుపల్లికి
** మధ్యాహ్నం 2;30 ని కి సత్తుపల్లిలో బహిరంగ సభ మరియు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన
** మధ్యాహ్నం 3.00గంటలకు సత్తుపల్లిలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అడిటోరియం నిర్మాణానికి శంకుస్థాపన
** మధ్యాహ్నం 3.45 గంటలకు సత్తుపల్లిలో బహిరంగ సభ
** సాయంత్రం 4.45 గంటలకు హెలికాప్టర్ లో బేగంపేటకు బయలు దేరనున్న మంత్రి కేటీఆర్