Telugu News

తుమ్మల అక్కడ నుంచే పోటీ

ఖమ్మంలో గెలుపు తథ్యమని భావిస్తున్న అధిష్టానం

0

 “ఖమ్మం” నుంచి తుమ్మల పోటీ..?

== రాహుల్ గాంధీ తో చర్చల్లో అంగీకారం

== ఖమ్మంలో గెలుపు తథ్యమని భావిస్తున్న అధిష్టానం

== 16న లేదా 27న రెండవ జాబితా విడుదల

 

మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఖమ్మం నియోజకవర్గ టిక్కట్ తుమ్మలకు దాదాపుగా ఖాయమైంది. పాలేరు టిక్కెట్ కోసం ప్రయత్నం చేసినప్పటికీ రాహుల్ గాంధీ సూచన, సామాజిక సమీకరణాల నేపథ్యంలో ఖమ్మం టిక్కెట్ తుమ్మల నాగేశ్వరరావు కేటాయించారు. ఖమ్మం నియోజకవర్గ రాజకీయ పరిణామాలపై రాజకీయ విశ్లేషణాత్మక కథనం..

(ఖమ్మం ప్రతినిధి -విజయంన్యూస్)

ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ చాలా లాజిక్ ను ప్రదర్శిస్తుందనే చెప్పాలి. కర్నాటక లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ఏలాంటి వ్యూహాత్మకంగా ముందుకు సాగిందో..అదే స్టాటజీని తెలంగాణలో అమలు చేసే అవకాశం కన్పిస్తోంది. అందుకే ప్రత్యర్థి సామర్థ్యం, సామాజిక వర్గాన్ని అంచనా వేసి టిక్కెట్ లు కేటయించే అవకాశం ఉంది.

ఇది కూడా చదవండి:-:మధిర కు భట్టి విక్రమార్క పోటీ

అందులో భాగంగానే తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలో కూడా అదే స్టాటజీని ఫాలో అవుతుంది. అందులో భాగంగానే ఉమ్మడి ఖమ్మం జిల్లా పాలేరులో రెడ్డి, ఖమ్మం లో కమ్మ, కొత్తగూడెం లో బీసీ అభ్యర్థులు సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ లకే టిక్కెట్లు ఇచ్చింది. అందులో భాగంగానే ఖమ్మం నియోజకవర్గం అభ్యర్థిగా కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారిని పెట్టాలని భావిస్తోంది.

== తుమ్మలకే టిక్కెట్..?

ఖమ్మం యోజకవర్గంలో మొత్తం 10 మంది ఆశావాహులు దరఖాస్తు చేసుకోగా, అసలు దరఖాస్తు చేసుకోకుండా ఉన్నఫలంగా తెరపైకి వచ్చిన నేత  తుమ్మల నాగేశ్వరరావు. ఆయన పార్టీలో చేరడంతో రాజకీయ సమీకరణాలు మారిపోయాయి..

ఇది కూడా చదవండి:- పిట్టలదొర మాటలు మానండి: భట్టి విక్రమార్క

బీఆర్ఎస్ పార్టీ నుంచి పాలేరు టిక్కెట్ ఆశించి భంగపడిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, తన బల నిరూపణ చేసి కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారు. జిల్లాకు చేరిన మొదటి రోజున జరిగిన మీడియా సమావేశంలో  కచ్చితంగా పాలేరు నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు. అయితే రాజకీయ పరిణామల ఫలితంగా  కాంగ్రెస్ పార్టీ  రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జ్ మాణిక్యారావు ఠాక్రే, పీసీసీ అధ్యక్షుడి రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎన్నికల ప్రచార కమిటీకో చైర్మన్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తో సహా జిల్లా ముఖ్యనాయకులందరు తుమ్మలను కలిసి కాంగ్రెస్ పార్టీలోకి రావాలని కోరారు. దీంతో ఆయన తన డిమాండ్ ను కాంగ్రెస్ పార్టీ ముందు పెట్టారు. పాలేరు నియోజకవర్గ టిక్కెట్ తనకే కేటాయించాలని, తన కుమారుడికి ఎమ్మెల్సీ టిక్కెట్ ఇవ్వాలని, అలాగే మరికొన్ని డిమాండ్ చేశారు. అందులో పాలేరు  టిక్కెట్ గురించి తుమ్మలకు క్లారిటీ ఇచ్చారు.

ఇది కూడా చదవండి:- సీఎం కేసీఆర్ కు విక్రమార్కుడే టార్గెటా..?

తుమ్మల నాగేశ్వరరావు ఎక్కడ పోటీ చేస్తానన్న టిక్కెట్ ఇస్తామని అధిష్టానం అంగీకరించి హామినిచ్చారు. ఆ డిమాండ్ అంగీకారమేరకే తుమ్మల నాగేశ్వరావు కాంగ్రెస్ లో చేరారు. అయితే తుమ్మల ఖమ్మంలో అయితే ఈజీగా గెలుస్తారని పార్టీ భావించింది ఇదే విషయాన్ని తుమ్మలకు కాంగ్రెస్ పెద్దలు చెప్పారు.

== రాహుల్ తో భేటి అనంతరం..?

ఖమ్మం జిల్లాలో టిక్కెట్ల విషయం స్పందించిన ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ముఖ్యనాయకులను ఢిల్లీ కి పిలిచి మాట్లాడారు. ఈ మేరకు తుమ్మల నాగేశ్వరరావు రాహుల్ గాంధీ ని కలిసి మాట్లాడగా తుమ్మల అభిప్రాయాన్ని అడిగారు. ఖమ్మం జిల్లా లో ఎక్కడ సీటు ఇచ్చిన పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని, మీరు ఎక్కడ పోటీ చేయమంటే అక్కడ పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని ఆయన రాహుల్ గాంధీకి వివరించారు. దీంతో అన్ని రకాలుగా ఆలోచించినా రాహుల్ గాంధీ ఖమ్మంలో పోటీ చేయాలని ఆదేశించడంతో తుమ్మల నాగేశ్వరరావు అంగీకరించారు.
== రేపు రెండవ విడత
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా మొదటి విడత పేర్లను ఆదివారం ఏఐసీసీ విడుదల చేసింది. రెండవ లిస్ట్ ను తయారు చేసింది. ఈ లిస్ట్ లో ఖమ్మం జిల్లాలో మరో ఐదు స్థానాలను ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. అందులోనే ఖమ్మం, పాలేరు నియోజకవర్గాల అభ్యర్థుల పేర్లను కూడా విడుదల చేయనున్నారు. ఈనెల 16 నా లేదా 17న రెండవ జాబితాను విడుదల చేయనున్నారు.