Telugu News

తుమ్మల అనుచరుల్లో నైరాశ..?

పార్టీ మార్పు పై తుమ్మల హాట్ కామెంట్

0

అనుకున్నదోక్కటి..అయినదోక్కటి..

== వాజేడు వైపు అందరి చూపు

== అంతా తూచ్ అంటూ అవాక్కైయ్యే ప్రసంగం

== సీఎం కేసీఆర్ పై ప్రశంసల వర్షం

== ఎవరిపై ఆరోపణలు చేయకుండా అభివృద్ది మంత్రాన్ని జపించిన మాజీ మంత్రి

== కార్యకర్తల్లో నైరాశ

== ఇంకా ఎన్నాళ్లు ఈ అవమానాలంటూ చిదరింపు

(ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్)

అనుకున్నదోక్కటి..అయినది మరోక్కటి..బోల్తా కోట్టిందిలే బుల్ బుల్ పిట్ట అని సిని కవి రాసిన పాట తరహాలోనే ఉంది నిన్న కొందరి పరిస్థితి.. అక్కడేదో జరుగుతుంది..? ఆయన నోట ఏ మాట వస్తుంది..? ఎలాంటి సంచలనం ప్రకటన చేయబోతున్నారు..

ఇది కూడా చదవండి: తుమ్మల వ్యూహమేంటీ..?

కలిసుంటారా..? వీడిపోతారా..? అటు గులాబీ శ్రేణుల్లో.. ఇటు తెలుగు రాష్ట్ర ప్రజల్లో ఉత్కంఠగా ఎదురు చూసిన నేపథ్యంలో గుట్టను తవ్వి ఎలుకను పట్టిన  చందంగా అయిపోయింది.. ఎదురీదుతారని భావించిన కొందరి నేతల ఆశలకు నీళ్లు చల్లుతూ ఆ పెద్దాయన నిప్పులు చెరగాల్సిన నేతపై ప్రశంసలు కురిపించడం పట్ల పార్టీ శ్రేణులు నైరాశ చెందినట్లు తెలుస్తోంది.. 350 కిలోమీటర్ల పాటు మూకుమ్మడిగా బయలుదేరిన ఆ నేత.. అంతా తూచ్ అంటూ అందరు అవాక్కైయ్యే ప్రసంగం చేసినట్లు ఆ నేత వర్గీయులు చెప్పుకుంటున్నారు.. ఆ ప్రసంగానికే 300 కిలోమీటర్లు పిలవాలన అన్నట్లుగా పార్టీ శ్రేణుల్లో కొందరు చీదరించుకున్నారంటా..? ఇంకాఏముందని అందులో కొనసాగుతున్నారని మాజీ మంత్రి వర్గీయులు బహిరంగంగానే ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.. ఇంకా ఎన్నాళ్లు మాకు ఈ అవమానాలు.. ఎన్నాళ్లు భరించాలి ఈ వెనకబాటుతనాన్ని అంటూ కొందరు అగ్రనేతలు అసంతృప్తిని వ్యక్తం చేసినట్లు ప్రచారం జరుగుతోంది.. అసలు ఆ కథ ఏంటి..? గులాబీ శ్రేణుల్లో ఎందుకు చీదరింపు.. ఒక సారి పూర్తి వివరాలు చూద్దాం..

టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఉన్నట్లుండి ఓ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.. ములుగు జిల్లా వాజేడు మండలంలో ఓ మిత్రుడు భోజనానికి ఆహ్వానించిన నేపథ్యంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి సుమారు 500 కార్లలో భారీ ర్యాలీతో ఆత్మీయ సమ్మెళనం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఖమ్మం జిల్లా కేంద్రానికి సుమారు 250 కిలోమీటర్ల దూరం ఉన్న ఈ ప్రాంతానికి వందలాధికార్లతో ర్యాలీ నిర్వహించడం, జిల్లా కానీ జిల్లాలో ఆత్మీయ సమ్మెళనం కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడంతో తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం నేలకొంది..

ఇది కూడా చదవండి: తుమ్మల ప్రజా…ప్రస్థానం @ 40

తుమ్మల నాగేశ్వరరావు ఎందుకు ఈ ఆత్మీయ సమ్మెళనం కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.. పార్టీ వీడుతున్నారా..? పార్టీలోనే ఉంటారా..? అధినేతపై హాట్ కామెట్స్ చేస్తారా..? ఏ పార్టీలోకి వెళ్తారు.. ఆయన వర్గీయులకు ఏం చెప్పబోతున్నారని సవాలక్ష ప్రశ్నలతో అటు ప్రజలు, ఇటు మీడియా ఉత్కంఠగా ఎదురుచూసింది.. రోజంతా టెన్షన..టెన్షన్ తో ప్రజలందరు వాజేడు వైపే చూసిన పరిస్థితి కనిపించింది. అంతే కాకుండా వాజేడులోని ఆత్మీయ సమ్మెళనంపై ఇంటిలిజెన్సీ విభాగం నిఘా పెట్టింది.. అక్కడ ఏం జరుగుతుందోనని ఆసక్తిగా ఎదురుచూసిన పరిస్థితి ఉంది. ఈ కథ కొంచం పక్కన బెడితే మాజీ మంత్రి వర్గీయులు, ఆయన అభిమానులు, పార్టీ శ్రేణులు కూడా కచ్చితంగా తుమ్మల సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారు.. ఏదో ఒక ప్రకటన చేస్తారు..? ఆ ప్రకటన వినాలి అనే ఆలోచనతో పెద్ద సంఖ్యలో వాజేడుకు తరలివెళ్లినట్లు ఆ పార్టీ శ్రేణులు చెబుతున్నారు.. ఈ రోజు నుంచి మాకు సంకేళ్లు తెగిపోయే అవకాశం ఉంది.. ఈ అవమానాల నుంచి బయటపడే అవకాశం ఉందని భావించారు. ఆయన శత్రువులు, మరో నేతలకు వర్గీయులుగా ఉన్న వారు కూడా ఈ దఫాతో మాకు ఇబ్బందులు ఉండవని, ఆయన పోతే మాకు తిరుగేలేదని భావించారు.. వారు కూడా చాలా ఆసక్తిగా ఎదురుచూశారు.. ఆయనే ప్రకటన చేస్తారో..? బయటకు పోయే ప్రకటనైతే పండుగ చేద్దామని భావించారు.. కానీ.. అక్కడ జరిగింది..అందుకు భిన్నం.. ఏంటది..?

== అనుకున్నదోక్కటి..అయినది మరోక్కటి

వాజేడులో జరిగిన ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో ఏదో జరుగుతుందని ఊహించిన పార్టీ శ్రేణులకు, తెలుగు రాష్ట్ర ప్రజలకు మాజీ మంత్రి ఊహించని షాక్ నిచ్చారు..ఎవరినైతే చీదరించుకుంటారని అనుకున్నారో, ఆయన్నే గొప్పగా తన ప్రసంగంలో కొనియాడారు. సీఎం కేసీఆర్ తోనే తెలంగాణ అభివద్ది సాధ్యం, సీఎం కేసీఆర్ లేకుంటే ఒక్క అడుగు కూడా నా ఆశయం ముందుకు పడేది కాదని స్పష్టం చేశారు. ఓడిపోయి ఉన్న నన్ను పిలిచి మంత్రిపదవినిచ్చి, నేను అడిగిందళ్లా ఇచ్చి, నన్ను నా ప్రజల వద్ద తలెత్తుకుని నిలబడేలా చేశారని, రాజకీయాల్లో ఓటమి, గెలుపులు సహాజమేనని అన్నారు.

ఇది కూడ చదవండి : ప్రపంచకప్ నుంచి భారత్ ఔట్

కానీ ఉమ్మడి ఖమ్మం జిల్లా అభివద్ది కావాలంటే కచ్చితంగా కేసీఆర్ లాంటి ముందుచూపు ఉన్న నాయకుడు, విజన్ ఉన్న నాయకుడు కావాలని తుమ్మల నాగేశ్వరరావు పొగడ్తలతో ముంచేత్తారు. నా లక్ష్యం గోదావరి నీళ్లను ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలకు అందించడం, అందుకే సీతారామ ప్రాజెక్టును తీసుకొచ్చాము. ఆయన అడగ్గానే నిధులిచ్చి పనులు ప్రారంభించే వరకు, పూర్తయ్యే వరకు వెంటబడుతున్నారంటూ సీఎం కేసీఆర్ పై ప్రశంసలు కురిపించారు. ప్రాజెక్టు నాలక్ష్యం ఆ ప్రాజెక్టు కోసమే కేసీఆర్ తో కలిసి రాజకీయ సహజీవనం సాగిస్తున్నఅంటూ తుమ్మల నాగేశ్వరరావు హాట్ కామెంట్ చేశారు.

== కార్యకర్తల్లో నైరాశ

తుమ్మల నాగేశ్వరరావు కు పార్టీ మారే ఉద్దేశ్యం లేకపోవచ్చు..ఆయన కేవలం భోజనానికే వెళ్లాలని అనుకోవచ్చు.. కానీ బయట జరిగిన ప్రచారానికి, ఆయన ప్రసంగానికి అసలు సంబంధం లేదు. దీంతో కార్యకర్తలు, ఆయన అభిమానులు, తుమ్మల వర్గీయులు కొంత నైరాశ పడినట్లు తెలుస్తోంది. అధికారపార్టీలో ఉండి కూడా అవమానాలు ఎదుర్కోవడం, అక్రమ కేసుల పాలు కావడం, జైళ్లకు వెళ్లడం, హత్యలకు దారి తీయడం, బెదిరింపులకు గురికావడం, అడుగడుగున అవమానాలకు గురికావడంతో పార్టీ కార్యకర్తలు తుమ్మల నాగేశ్వరరావు పార్టీ మారితే బాగుంటుందని అందరు అనుకున్నారు. కానీ తుమ్మల ప్రసంగంతో వారి ఆశలు అడవాశలైయ్యాయి.. దీంతో తుమ్మల వర్గీయుల్లో కొందరు నిరాశచెందినట్లు తెలుస్తోంది. ఇంకేన్నాళ్లు ఈ అవమానాలు, ఇంకేన్నాళ్లు ఈ చీదరింపులు అన్నట్లుగా మదనపడుతున్నట్లు కనిపిస్తోంది.. ఇదే విషయాన్ని కొందరు చర్చించుకున్నట్లు సమాచారం. ఆయన ఎవరికి అర్థం కావడం లేదని ఆసహానం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

== కాంగ్రెస్ పార్టీలో చేరిక ఇక లేనట్లే..?

మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉందని రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో వాజేడులో జరిగిన ఆత్మీయ సమ్మెళనం కార్యక్రమంలో తన ప్రసంగం చూసిన తరువాత ఒకింత క్లారిటీ వచ్చినట్లే కనిపిస్తోంది.. ఆయన పార్టీ మారే ఉద్దేశ్యమే లేదని చెప్పకనే చెప్పాడు.. ముఖ్యంగా ఏ పార్టీలో అయితే చేరతారని అనుకున్నారో..?

ఇది కూడ చదవండి: గవర్నర్ హక్కులను హరిస్తున్న కేసీఆర్: గోనే ప్రకాష్

ఆ కాంగ్రెస్ పార్టీపై విమ్మర్శ చేశారు. దుమ్ముగూడెం ప్రాజెక్టును ఆగమాగం చేశారని, లేకుంటే ఆ ప్రాజెక్టుతో ఖమ్మం జిల్లా మరింతగా సస్యశ్యామలం అయ్యేదని అన్నారు. విజన్ ఉన్న నాయకుడు తెలంగాణకు సీఎం కావడమే మనందరి అదృష్టమని, ఆయనతోనే సీతారామ ప్రాజెక్టు పూర్తి కావడం, ఖమ్మం జిల్లా సస్యశ్యామలం కావడం ఖాయమని చెప్పారు. దీంతో తుమ్మల నాగేశ్వరరావు ఇప్పట్లో పార్టీ మారే ఆలోచనలో లేనట్లే కనిపిస్తోంది. అంతే కాదు కాంగ్రెస్ పార్టీలోకి అసలే వెళ్లే అవకాశాలు లేవనే చెప్పాలి.. తన ప్రసంగం చూసిన తరువాత ఈ సారి ఎన్నికల వరకు సీఎం కేసీఆర్ తోనే పయనించాలని భావిస్తున్నట్లుగా ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. చూడాలి మరీ తుమ్మల నాగేశ్వరరావు ఆలోచనలు ఏటువైపు దారి తీస్తాయో..? ఆయనతో నడుస్తున్న పార్టీ శ్రేణులు భవిష్యత్ లో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో..?