Telugu News

పాలేరు నియోజకవర్గంలో ‘తుమ్మల’ పుట్టిన రోజు వేడుకలు.

-- కేక్ కట్ చేసి, సంబరాలు చేసిన నాయకులు, కార్యకర్తలు.

0

పాలేరు నియోజకవర్గంలో ‘తుమ్మల’ పుట్టిన రోజు వేడుకలు.

— కేక్ కట్ చేసి, సంబరాలు చేసిన నాయకులు, కార్యకర్తలు.

(కూసుమంచి -విజయంన్యూస్):-

పాలేరు నియోజకవర్గంలో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పుట్టిన రోజున వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. కూసుమంచి, నేలకొండపల్లి, తిరుమలాయపాలెం మండలాలతో పాటు ఖమ్మం రూరల్ మండలంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, తుమ్మల అభిమానులు ఘనంగా జరుపుకున్నారు. కూసుమంచి మండలంలోని కూసుమంచి మండల కేంద్రంలో, నేలకొండపల్లి మండల కేంద్రంలో, కొత్తకొత్తూరులో, తిరుమలాయపాలెం మండల కేంద్రంలో, సుబ్లేడ్ లో, ఖమ్మం రూరల్ మండలం ఆరేంపుల గ్రామంలో తుమ్మల నాగేశ్వరరావు జన్మదిన వేడుకలు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు మాజీ మార్కెట్ కమిటీ చెర్మాన్ మద్ది మల్లారెడ్డి, రామసహాయం నరేష్ రెడ్డి, జొన్నలగడ్డరవికుమార్, సాదు రమేష్ రెడ్డి, నెల్లూరి భద్రయ్య, కొత్త సీతారాములు, రమేష్, బండి జగదీష్, తేజవాత్, పంతులు నాయక్, కొప్పుల చంద్రశేఖర్, తోట వీరభద్రం, భారీ వీరభద్రం, ఎంపీటీసీ మాదాసు ఉపేందర్, సుధాకర్ రెడ్డి, బజ్జూరి వెంకట్ రెడ్డి, గుండా దామోదర్ రెడ్డి, కేశవరెడ్డి, కొండా మహిపాల్, విష్ణు, వీరబాబు తదితరులు పాల్గొన్నారు.

also read :-సొంత ఖర్చులతో కాలువ తీయించుకున్న అన్నారుగూడెం రైతులు.