Telugu News

తుమ్మలను అభినందించిన సీఎం కేసీఆర్

ఎందుకోసమంటే..?

0

తుమ్మలను అభినందించిన సీఎం కేసీఆర్

== కరకట్ట వల్లనే భద్రాద్రి మిగిలిందని చెప్పిన సీఎం

ధన్యవాదాలు తెలిపిన మాజీ మంత్రి

పెండ్ర అంజయ్య, ఖమ్మంప్రతినిధి, జులై 17(విజయంన్యూస్)

అభివృద్ధికి నిలువుటద్దం మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.. ఆయన ఎక్కడున్న.. అక్కడే అభివృద్ధి ఉంటుందనేది నిజం.. అక్షరాల అదే మాటను స్వయంగా సీఎం కేసీఆర్ తన నోటితో ప్రకటించడం ఆ మాటలకు బలం చేకూర్చింది. గోదావరి వరద ఉధృతి వల్ల జరిగిన నష్టాలను, పరిస్థితులను స్వయంగా చూసేందుకు భద్రాచలంలో పర్యటించిన సీఎం కేసీఆర్, గోదావరమ్మకు పూజలు చేశారు. అనంతరం జరిగిన సమావేశంలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ ఈ రోజు భద్రాచలం ముంపుకు గురికాకుండా కాపాడటం జరిగిందంటే అది ఒక కరకట్ట పుణ్యమేనని, ఆ కరకట్ట నిర్మాణం చేసిన తుమ్మల నాగేశ్వరరావును అభినందిస్తున్నానని సీఎం కేసీఆర్ ప్రకటించారు. కరకట్ట లేకుండా ఉంటే ఈ రోజు భద్రాచలం పూర్తిగా ముంపునకు గురైయ్యేదని, భద్రాచలం చుట్టు కరకట్ట అవసరమనే సంగతిని తుమ్మల నాగేశ్వరరావు నిర్మాణం చేసిన కరకట్ట పుణ్యమేనని అన్నారు. అందుకే రూ.1000 కోట్లు మంజూరు చేస్తున్నానని, ప్రజలందరు అదుకోవడంతో పాటు కరకట్ట మరింతగా పెంచే అవకాశం ఉంటే ఆ పనులు పూర్తి చేయాలని సూచించారు. దీంతో ఒక్కసారిగా సమావేశంలో చప్పట్లతో మారుమోగింది. కాగా మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సీఎం కేసీఆర్ పర్యటన అనంతరం మీడియాతో మాట్లాడుతూ నాపై నమ్మకముంచి కరకట్ట గురించి మాట్లాడి అభినందించిన సీఎం కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు. ఇదిలా ఉంటే సీఎం కేసీఆర్ కు, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు కొంత చెడిందనే ప్రచారానికి సీఎం కేసీఆర్ పుల్ స్టాఫ్ పెట్టినట్లే కనిపించింది.

allso read- భద్రాచలంలో సీఎం కేసీఆర్ పర్యటన*