Telugu News

కార్యదక్షుడు తుమ్మల…

పాలేరు నుండి పర్ణశాల వరకు తనదైన ముద్ర..

0

కార్యదక్షుడు తుమ్మల…

== అభివృద్దికి పర్యాయపదం తుమ్మల..

== జిల్లా రాజకీయాల్లో మళ్లీ ఆయన ఆవశ్యకత…

== పాలేరు నుండి పర్ణశాల వరకు తనదైన ముద్ర..

==  మరోసారి పాలేరు నుండే పోటీ…      

== ఖమ్మం రూరల్ కు మారనున్న మకాం…

        ( పి వి నాగిరెడ్డి)

ప్రత్యేక ప్రతినిది, జూన్ 30(విజయంన్యూస్)             

లక్ష్యమే ఆయన ముందు చిన్నబోతుంది.. కనుసైగనే ఆదేశంగా, ఆహార్యమే రాజకీయంగా, మాటే శాసనంగా 40 యేళ్ళ సుదీర్ఘ రాజకీయాలను నడిపినప్పటికి అవినీతి రహితుడు.. ఇన్నేళ్ల చరిత్రలో ఒక్కటంటే ఒక్క అవినీతి మచ్చలేదు.. అదే అయన నిబద్దతకు నిదర్శనం… అందుకే ఆయనంటే అందరు అభిమానిస్తారు.. ఆయనంటే అందరు ప్రేమిస్తారు.. ఆయన వెనక జనం ప్రభంజనంలా కదులుతుంటారు… అందుకే ఆదర్శనీయుడైయ్యారు.. ఆయన ఓటమికి భయపడడు..గెలుపుకు ధీరుడవ్వడు.. ఎప్పుడు ఒక్కటే తీరు.. గాంభీర్యం అతని తత్వం.. అందర్ని అదిరించడం.. అద్భతంగా పనిచేయించుకోవడం ఆయనకు తెలుసు. పని విషయంలో విక్రమార్కుడు.. పనిపూర్తైయ్యేతే ప్రేమికుడు.. అధికారులతో పనిచేయించుకుంటూ వారితో ప్రేమగా మెలిగే నిఖార్సైన నాయకుడు.

allso read- పది ఫలితాల్లో తెలంగాణ శ్రీ చైతన్య విద్యార్థుల ప్రభంజనం.

ఆయనే మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఖమ్మం గుమ్మం పాలేరు నుండి పర్ణశాల వరకు ఉమ్మడి జిల్లా సమగ్రాభివృద్దిలో ఆయన పోషించిన పాత్ర ఎంతో కీలకమైనది… ఇప్పటికీ ఆయన పేరు లేని శిలాఫలకం ఉండదంటే అతిశయోక్తి కాదు.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అత్యంత నిస్వార్ధమైన రాజకీయ నాయకులలో తుమ్మల ఒకరు… రాజకీయాలలో ఎన్నో ఉత్తాన, పతనాలను చూసిన తుమ్మల, ఇప్పుడు కూడా ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొంటున్నా, ఎక్కడా తన వ్యక్తిత్వాన్ని కోల్పోకుండా తనను నమ్మిన వారికోసం ఎంతకాడికైనా వెళ్తారనటంలో సందేహం లేదు..  అయితే తుమ్మలకు కాస్త నోటిదురుసు అని, ఇష్ఠం వచ్చినట్లు తిడుతుంటారని కొందరి ఆరోపణలు మాత్రం ఉన్నా, తుమ్మల నాగేశ్వరరావును దగ్గర నుండి చూసిన వాళ్ళేవ్వరూ ఈ అరోపణలను ఖండించకుండా ఉండలేరు.. తాను వ్యక్తిత్వంలో ఎంతో గొప్పమనిషి అని,  స్నేహానికి, నిజాయితీగా ఉండే వ్యక్తులంటే ఎంతో దగ్గరగా ఉంటారని చెపుతరు… ముఖ్యంగా క్రింది స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు అధికారులు కూడ  ఆయన ఆలోచనలను, అభివృద్ది ప్రణాళికలకు అణుగుణంగానే పని తీరు మార్చుకుంటారని, ఇప్పటికీ ఆయన మంత్రిగా పనిచేసిన కాలంలోని అధికారులతో ఎంతో మంచి సంబందాలు నెరుపుతారని, ఎక్కడ కూడా వారి ఔన్నత్యానికి భంగం కలగ కుండా తుమ్మల వ్యవహరించటంతో ఇప్పటికి తుమ్మల ఫోన్ కొడితే ఎక్కడ, ఏస్థాయిలో ఉన్న అధికారైనా ఆయన అభ్యర్ధనను తప్పక పూర్తయ్యేట్లు చూస్తారని అందరికీ తెలిసిందే…

 

ఇక రానున్న శాసన సభ ఎన్నికలలో ఖమ్మం జిల్లా రాజకీయం మరోసారి తుమ్మల చుట్టు తిరుగుతుందనటంలో ఏమాత్రం సందేహం లేదు..    వాస్తవంగా తుమ్మల గత ఎన్నికలలో పరాజయం పొందారు.. 33సంవత్సరాలు తెలుగుదేశం పార్టీలో తిరుగులేని నాయకుడిగా జిల్లాలో, అటు రాష్ట్రంలో ఓ వెలుగు వెలిగారు ఆయన.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అనేక ఫోర్టుఫోలియో పదవులు అలంకరించిన తుమ్మల, ఎక్కడా ఆయన నిర్వహించిన పదవులకు గాని, ఆయన వ్యక్తిత్వానికి గాని మచ్చతెచ్చుకోలేదు… ఆంతే కాదు జిల్లా చరిత్రలో ఆయన పేరు సువర్ణాక్షరాలతో లిఖించదగినది… పాలేరు నుండి మొదలు పెట్టి, జిల్లా సరిహద్దు చత్తీస్ ఘడ్ వరకూ ఆయన పేరులేని అభివృద్ధి ఫలకం ఉండదంటే నమ్మశక్యం కాని అంశమే…అలా జిల్లా సమగ్రాభివృద్దిలో తుమ్మల తనదైన ముద్ర వేశారు… రాష్ట్ర రాజకీయాలలో వచ్చిన అనూహ్య మార్పులు, తెలంగాణ ఆకాంక్షతో ఆంధ్రప్రదేశ్ రెండుగా చీలి  రాష్ట్రం ఆవిర్భవించటంతో అనుకోని పరిస్థితులలో తుమ్మల కారెక్కారు…తన చిరకాల మిత్రుడు, రాజకీయంగా సహచరుడు కేసిఆర్ అధినేతగ ఉన్న టిఆరెస్ పార్టీలో చేరిన తుమ్మలకు కేసిఆర్ సాదర స్వాగతం చెప్పారు … అంతేకాదు ఎమ్మెల్సీగా పదవి ఇచ్చి మంత్రి పదవి ని కూడా తుమ్మలకు కట్టబెట్టారు కేసిఆర్…

allso read_-రామన్నగూడెం గ్రామస్థులకు ఏమైనా జరిగితే ఊరుకోం: తాటి

ఇక టిఆరెస్ లో మంత్రిగా ఆయన మరోసారి ఖమ్మం జిల్లా అభివృద్దిపై దృష్ఠి సారించారు… ఆంధ్రపాలకుల పెత్తనంలో ఉజ్వల అభివృద్దిలో కాస్త వెనుకబడిన తెలంగాణ కు ఏమి కవాల్నో, ఎలా అభివృద్ది చేసుకోవాల్నో కూడా తెలిసిన తన అనుభవంతో ప్రత్యేక ప్రణాళికలు రూపొందించుకున్నారు తుమ్మల… రాష్ట్రమంతా పర్యటిస్తూ, ప్రత్యేకంగా ఖమ్మం జిల్లాపై మరోమారు తీక్షణ దృష్ఠి సారించారు… ఇంతలో పాలేరు నియోజకవర్గ ఎమ్మెల్యే రాంరెడ్డి మృతితో ఆ సెగ్మెంట్ ఖాళీ ఏర్పడటం, అప్పటిదాకా ఎమ్మెల్సీగా మంత్రి పదవి నిర్వహిస్తున్న తుమ్మల కు పాలేరు ఉప ఎన్నికలలో పోటీకి అవకాశం కల్పించింది టిఆరెస్ అధిష్ఠానం… పాలేరులో గెలిచిన తుమ్మల ఇక వెనుతిరిగి చూడలేదు తుమ్మల వేలకోట్ల నిధులు ను ఇటు పాలేరుకు, అటు జిల్లాకు అధినేత కెసిఆర్ ను ఒప్పించి నిధుల వరద పారించారు..జిల్లా కు స్వరాష్ట్ర సాధనతో వచ్చిన అవకాశంతో మౌళిక సదుపాయాల కల్పనలో ముందున్నారు… జిల్లా నలుమూలలా జాతీయ రహదారులను చుట్టు ముట్టించారు … ఫామాయిల్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేసి ఉధ్యాన  రైతులకు ఊరట కల్పించారు… ప్రత్యేకంగా పాలేరు  దశ దిశనే మార్చేశారు తుమ్మల…

 

తలాపునే పాలేరు జలాశయం ఉన్నా, దేశంలోనే అత్యంత కరువు పీడిత ప్రాంతంగా గుర్తింపు పొందిన తిరుమలాయపాలెం మండలానికి కష్ణమ్మను పారించారు తుమ్మల.. నా తెలంగాణ కోటి ఎకరాల మాగాణ నినాదంతో కేసిఆర్ పిలుపు మేరకు ప్రతి నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు కొత్త అయకట్టు ను రూపొందించటంలో ముందు వరసలో నిలబడ్డారు తుమ్మల. భక్తరామదాసు ఎత్తిపోతల పధకంతో సుమరు 300కోట్లు వెచ్చించి పాలేరు బ్యాక్ వాటర్ ను వినియోగించి నిర్మించిన భక్తరామదాసు పధకంతో నియోజకవర్గం స్వరూపమే మారిపోయింది… నడి వానాకాలంలో కూడా మంచినీటి కోసం ఇబ్బందులు పడ్డ తిరుమలాయపాలెం ప్రజలకు భక్తరామదాసు ప్రాజెక్టు ఊపిరిలూదింది.. ఒక్క తిరుమలయపాలేం మండలమే కాకుండా నియోజక వర్గంలోని ఖమ్మం రూరల్, కూసుమంచి మండలాలలో కూడా ఎన్నడూ నిండని చెరువులు నడి వేసవిలో మత్తడి దూకాయి…మొత్తంగా ఒక్క భక్త రామదాసు పధకంతోనే 70వేల ఎకరాలకు నీరందుతుంది… అలా  కేవలం ఒక్క సంవత్సరంలోనే నియోజకవర్గ భౌగోళిక స్వరూపమే మారిపోయింది…అంతేకాదు ఎప్పుడో నైజాం కాలం నాటి పాలేరు పాతకాలువ చిక్కి శల్యమై దీన స్థితిలో ఉండగా, కనీసం 10 కి మీ కూడా నీటిని తీస్కెళ్ళలేని దుస్థితిని గమనించిన తుమ్మల, 70 కోట్ల ప్రణాళికలతో కేవలం 9 నెలలలో ఆధునీకరించి కొత్త కాలువగా సొబగులద్దారు … పాలేరు నుండి నేలకొండపల్లి వరకు ఎన్నొ ఇబ్బందులు పడ్డ చెరకు, వరి రైతుల కష్ఠాలను తీర్చారు తుమ్మల… మొత్తం 23 కిలోమీటర్ల పరిధిలో ని 25వేల ఎకరాలకు నీటి వసతిని  స్థిరీకరించి చివరి ఎకరాకు నీరందించారు తుమ్మల…

allso read- కాంగ్రెస్ గూటికి రామూర్తినాయక్ దంపతులు

ఇక నియోజకవర్గాన్ని జాతీయరహదారులు చుట్టు ముట్టేట్లు ప్రణాళికలు రూపొందించి సఫలీకృతుడయ్యారు తుమ్మల … కోదాడ -కురవి, సూర్యాపేట-ఖమ్మం , నాగ్పూర్ – విజయవాడ గ్రీన్ఫీల్డ్ హైవే లాంటి ప్రతిపాదనలతో నియోజకవర్గం అటు రియల్ వ్యాపారానికి, ఇటు పారిశ్రామికంగా అభివృద్ది చెందేందుకు దోహదపడ్డాయి… అంతర్ జిల్లా రవాణ వ్యవస్థ పటిష్ఠం చేయటమే కాకుండా, రోడ్ కం చెక్ డ్యాం ల నిర్మాణంతో పాలేరు మున్నేరు , ఆకేరు పరీవాహక ప్రాంతంలో నీటి ఎద్దడి లేకుండా చేశారు… మొత్తం 5 చోట్ల ఏటి మీద ఆయన నిర్మించిన చెక్ డ్యాం కమ్ రోడ్ కనెక్టివిటీ ద్వారా ఖమ్మం జిల్లా రైతులకే కాకుండా వరంగల్, నల్గోండ, జిల్లాల వారికి కూడా ఎంతో ప్రయోజనం చేకూర్చారు తుమ్మల…అంతర్గత రహదారుల విషయంలోనూ ఆయన ఎక్కడా రాజీ పడలేదు… డొంక రోడ్లను సైతం విశాలమైన రహదారులుగా విస్తరించి కోట్లరూపాయలను ఖర్చు పెట్టారు తుమ్మల…అయినా ఎక్కడో ప్రజలలొ నిర్లిప్తత, ఆయన అనునాయుల వెన్నుపోట్లతో తుమ్మల కు పరాజయం తప్పలేదు పాలేరులో.. తుమ్మల ఓటమి ఇటు జిల్లాలోనే కాకుండా, అటు రాష్ట్రంలో కూడా సంచలనం కల్గించింది… ఇదే విషయమై తెరాస అధినేత కూడా తుమ్మల ఓటమికి కారణలను విశ్లేషించారు. ఆయన ఓటమికి కారణం సొంత పార్టీ నాయకుల పొరపొచ్చాలేనని పాలేరులో, జిల్లా వ్యాప్తంగా కారుకు ఎదురుగాలి వీచిందని చెప్పుకొచ్చారు…ఇక అప్పటి నుండి తుమ్మల నియోజకవర్గానికి, జిల్లా రాజకీయాలకు కాస్త దూరంగానే, తన వ్యవసాయక్షేత్రానికే పరిమితమై ఉన్నారు.. అయితే పాలేరులో ప్రజలు కోరిక, ఆయన అనుచరుల అభ్యర్ధన మేరకు మళ్ళీ యాక్టివ్ గా పలు కార్యక్రమాలలో ప్రజలతో కలియ తిరుగుతున్నారు. అంతేకాదు పాలేరు నియోజకవర్గ రూరల్ మండలానికి కూడా మకాం మారుస్తున్నట్లు తెలుస్తోంది… తప్పకుండా మళ్లీ పాలేరులో పోటీ చేస్తానని, నిలిచిపోయిన అభివృద్ధి, చేయాల్సిన పనులను కూడా ఈ సారి పూర్తి చేస్తానని మాట ఇస్తున్నారు తుమ్మల… గత మూడున్నరేళ్ళ ఘటనల తరువాత మళ్ళీ అటు జిల్లాలో, ఇటు పాలేరు ప్రజలు కూడా జిల్లా లో తుమ్మల ఆవశ్యకతను చెప్పకనే చెప్తున్నయని  రాజకీయ నాయకులాభిప్రాయం… ఇప్పుడు ఎవరినోట విన్నా మళ్ళీ తుమ్మల మాటే వినపడ్తుండగా, మొన్న కేటిఆర్ ఖమ్మం పర్యటనలో కూడా అనుభవజ్ఞులను, సీనియర్లను వదులుకొనే ప్రసక్తే లేదనే సంకేతాలు ఇప్పుడు జిల్లావ్యాప్తంగా చర్చకు దారితీశాయి… నిబద్దత, అనుభవంతో కూడిన రాజకీయాలు ఇప్పుడు ఉమ్మడి జిల్లాలొ అవసరమనే అధినేత సూచనలు, దానికణుగుణమైన వర్కింగ్ ప్రెసిడెంట్ అంతర్గత సమావేశం, సిట్టింగులందరికీ సీట్లు గ్యారంటీ లేదనే లీకుల ప్రస్తావన తో మరోసారి తుమ్మల వైపు జిల్లా రాజకీయాలు కేంద్రీకృతమౌతున్నాయనేది కాదనలేని సత్యం…  అయితే గతంలో లాగా నాయకుల మధ్య అంతరాలు లేకుండా, సీట్లు కేఠాయించిన గెలుపు గుర్రాలందరినీ ఒకేతాటిపై నడిపించటం కూడా తుమ్మల ముందున్న కర్తవ్యం…అధినేతల అంచనాలు, తుమ్మల అనుభవపూర్వక ఎత్తులు, అభ్యర్ధులు స్వయంకృషితో కారు పదికి పది సీట్లు ఉమ్మడి ఖమ్మంలొ గెలవాలనే లక్ష్యం, ఆకాంక్ష సఫలమవ్వాలని, తుమ్మల మళ్లీ జిల్లాలో చక్రం తిప్పాలని ఆయన అభిమానుల కోరిక…