Telugu News

కాంగ్రెస్ పార్టీలో చేరిన తుమ్మల

కండువా కప్పి స్వాగతం పలికిన ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే

0

కాంగ్రెస్ లో చేరిన తుమ్మల

== కండువా కప్పి స్వాగతం పలికిన ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే

== 17న తుమ్మల అనుచరులు విజయభేరి సభ వేదిక పై కాంగ్రెస్ లో చేరిక

== తుమ్మల క్యాంఫ్ లో సంబరాలు.. 

(ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్)

మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ పార్టీలో చేరారు.. హైదరాబాద్ లోనితాజ్ కృష్ణ హోటల్ కు చేరుకున్న ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే లను మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మర్యాదపూర్వకంగా కలిశారు.

ఇది కూడా చదవండి:- నేడు హైదరాబాద్ కు సోనియా, రాహుల్ గాంధీ 

కాగా మల్లికార్జున ఖర్గే సమక్షంలో  తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ లో చేరారు. తుమ్మలతో పాటు తుమ్మల ముఖ్య అనుచరుడు సాధు రమేశ్ రెడ్డి, తుమ్మల తనయుడు తుమ్మల యుగంధర్ లు పార్టీలో చేరారు.  ఈ కార్యక్రమానికి పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎన్నికల ప్రచార కమిటీ  కో చైర్మన్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి,  హాజరైయ్యారు.  ఆ తరువాత కొద్ది సేపు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలపై చర్చించారు. అనంతరం తుమ్మల నాగేశ్వరరావు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ఎందుకు పార్టీలో చేరారో వివరించారు.

== 17న క్యాడర్ మొత్తం సభా వేదిక చేరే అవకాశం

తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ పార్టీలో ఈనెల 16న  సోనియాగాంధీ, రాహులు గాంధీ సమక్షంలో చేరుతుండగా, ఆయన క్యాడర్, నాయకత్వం మొత్తం ఈనెల 17న హైదరాబాద్ లోని తుక్కగూడెలో జరిగే విజయభేరి సభ లో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు.

ఇది కూడా చదవండి:- టీడీపీ అభ్యర్థులుగా జనసేన పార్టీ నేతల పోటీ

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీలోని  అగ్రనాయకత్వం, ఎంపీపీ, జడ్పీటీసీలు, ప్రజాప్రతినిధులు, ముఖ్యానాయకులు, టీడీపీ పార్టీలోని మరికొంత మంది సీనియర్ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది. అందుకు గాను ఈనెల 17న భారీగా సుమారు 1000 వాహనాల్లో హైదరాబాద్ కు తరలివెళ్లే అవకాశం ఉన్నట్లు తుమ్మల అనుచరులు చెబుతున్నారు. ఇప్పటి నుంచే అందుకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పార్టీలో చేరుతుండటంతో తుమ్మల వర్గీయులు సంబరాలు చేస్తున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో టపాసులు కాల్చారు.

ఇది కూడా చదవండి:- హరీష్ రావు ఇది సిద్దిపేట కాదు ఖమ్మం: భట్టి విక్రమార్క

కాగా పాత కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రస్తుతం పాలేరు సీటును అశిస్తున్న ఆశావాహులు, వారి అనుచరుల్లో మాత్రం అసంతృప్తి కనిపిస్తున్నట్లు తెలుస్తోంది.. తుమ్మల నాగేశ్వరరావు పార్టీలో చేరితే ఆయన వర్గీయులకే పెద్ద పీట ఉంటుంది. మనకు వెనకబేంచి అవకాశం ఉంటుందేమో, ఇన్నేళ్లు పార్టీని నడిపించిన, కష్టకాలంలో అండగా ఉంటూ వచ్చిన నాయకుల పరిస్థితి ఏంటని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.