Telugu News

ఖమ్మంలో పెద్దలను కలిసిన తుమ్మల

కన్యకాపరమేశ్వరి ఆలయంలో పూజలు

0

ఖమ్మంలో పెద్దలను కలిసిన తుమ్మల

== కన్యకాపరమేశ్వరి ఆలయంలో పూజలు

(ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్)

మాజీ మంత్రిఖమ్మం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు తుమ్మల నాగేశ్వరరావు మంగళవారం ఖమ్మం నగరంలో పర్యటించి పలువురు ప్రముఖులను కలిసి మాట్లాడారు. ప్రముఖ విద్యా సంస్థల (నిర్మల్ హృదయ్ స్కూల్) అధిపతి వంగా సాంబశివ రెడ్డిని తన నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు.ఈ  సంద్భంగా సాంబశివరెడ్డి మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో నా సంపూర్ణ సహాయ సహకారాలు వుంటాయని చెప్పారు ఆ తరువాత తుమ్మల నాగేశ్వరరావుకి సంబందించిన నామినేషన్ ఫీజు 10,116 రూపాయలు సాంబశివరెడ్డి సతీమణి చేతులు మీదుగా అందించి ఆశీర్వదించారు.

ఇది కూడా చదవండి:-బీఆర్ఎస్ కు బాలసాని రాజీనామా..

అలాగే ఖమ్మం నగరంలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వ్యంలో కన్యకా పరమేశ్వరీ దేవాలయంలో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న దేవిశరన్నవరాత్రులు ఉత్సవాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించీన మాజీ మంత్రి వర్యులు తుమ్మల నాగేశ్వరరావు ఆర్యవైశ్య సంఘ ప్రముఖులు హాజరైయ్యారు. రాబోయే ఎన్నికల్లో విజయం సాధించాలని ఆశీర్వదించాలని కోరారు. అనంతరం ప్రముఖ వైద్యులు, సామాజిక సేవకులు డాక్టర్ కూరపాటిని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కలిసి మాట్లాడారు. వారి వైద్యసేవల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి తుమ్మలను ఘనంగా సన్మానించారు. 

ఇది కూడా చదవండి:- తుమ్మల అక్కడ నుంచే పోటీ