*ప్రజా…ప్రస్థానం @ 40*
== అభివృద్ది భాగీరధుడు తుమ్మల
== ఉమ్మడి ఖమ్మం జిల్లా చరిత్రలో సువర్ణాధ్యాయం.
== నేడు అభిమానుల అభివృద్ధి సింహావలోకన ర్యాలీ
పి వి నాగిరెడ్డి
(ఖమ్మం-విజయం న్యూస్)
మీ ముఖాలలో చిరునవ్వు చూడాలనేదే నా సంకల్పం.. . మీరున్న స్థితిగతులను, మీ పరిసరాలను, మిమ్మల్ని మీరు ఇప్పుడు ఫోటోలు తీసుకోండి… సరిగ్గా.. సరిగ్గా మూడేళ్ళకు మళ్ళీ ఫోటోలు తీపించి అంచనా వేసుకోండి… మీ జీవితాలలో, మీ మీ ప్రాతం లో ని మార్పును గమనించుకోండి అంటూ తిరుమలాయపాలెం మండలం లోని ఓ కార్యక్రమంలో అప్పటి *మంత్రివర్యులు తుమ్మల* మాట్లాడిన మాటలు ఇప్పుడు కాదు …కాదు ఎప్పుడో కార్యరూపం దాల్చాయి…
Allso read:- ఖమ్మంలో ఐడీ దాడులు
అంతేకాదు ఇప్పుడు ఆ ఫలాలను ప్రజలు అనుభవిస్తున్నారు… అత్యంత కరువు పీడిత ప్రాంతమైన తిరుమలాయపాలెం మండలంలో అప్పటి, ఇప్పటి పరిస్థితులను కళ్ళతో చూసిన వారెవరైనా ఈ సత్యాన్ని ఒప్పుకోవాల్సిందే.. తలాపునే కృష్ణమ్మ ఉన్నా కనీసం మంచినీటికి నోచుకోని తిరుమలాయపాలెం మండలం , కూసుమంచి, ఖమ్మం రూరల్ మండలాలలోని కొన్ని ప్రాంతాలలో నెర్రలు బాసిన నేలలను దప్పిక తీర్చిన ఘనుడు తుమ్మల… ఎకరం 3 నుండి నాలుగు లక్షలు కూడా పలుకని రోజులలో చాలెంజ్ చేసి అభివృద్దిని పరుగులు పెట్టించిన ఘనత ఆయనదే…ఈ రోజు కనీసంగా 40 లక్షల రూపాయలు పలుకుతున్న భూముల ధరలకు రెక్కలు తెప్పించింది ఆయనే… ఓ దార్శనికుడు అభివృద్ది రూపం, ఓ రాజకీయ నాయకుని భవిష్యదర్శిని, ప్రజల ఓట్లు ఎలా ఒడిసి పట్టాలనే దానికంటే, *ప్రజలిచ్చిన అధికారంతో వారి భవిష్యత్తుకు ఎలా తీర్చిదిద్దాలని* తలంపు ఉంటే ఇలాంటి అద్భుతాలే సాక్షాత్కరిస్తాయనటంలో సందేహమే లేదు.
Allso read:- ఇల్లందు వైస్ చైర్మన్ ఇంటిపై రాళ్ళ దాడి
ఇది ఒక్క పాలేరు నియోజకవర్గం లోనే కాదు … ఉమ్మడి ఖమ్మం జిల్లా ను సస్యశ్యామలం చేయటంలోనే కాదు, అభివృద్ది అంటే ఇలానే ఉండాలనే సూత్రాన్ని పరిచయం చేసి, అమలు పరిచిన ఘనత తుమ్మలదే… పాలేరు నుండి పర్ణశాల అనే క్యాప్షన్ కు అనుగుణంగా ఉమ్మడి జిల్లా సమగ్రాభివృద్దిలో ఆయన ఓ మేరు నగధీరుడు… చెట్టును, పుట్టను, ఇటుక రాయిని అడిగినా, జిల్లాలోని ఏ అభివృద్ది ఫలకాన్ని తడిమినా తుమ్మల పేరు లేని అభివృద్ది లేదంటే నిజంగా నమ్మశక్యం కాదు…
అలాంటి తుమ్మల ఇప్పుడు రాజకీయాలలో 40వసంతాలు పూర్తి చేసుకున్నారు… ప్రజా జీవితంలో 40 సంవత్సరాలు అంటే ఆశామాషి కాదు… అలాంటిది 40 ఏళ్ళలో ఆయన 20 సంవత్సరాలు పదవులను అలంకరించి, తాను చేపట్టిన ఏ పని కూడా ప్రజల బాగోగులకు, సంక్షేమానికి, వారి భవిష్యత్ నిర్మాణానికే బాటలు వేసిన ఘనత ఆయనిది… అంతేకాదు తన రాజకీయ జీవితంలో ఎక్కడా అవినీతి నీడను కూడా తాకని వ్యక్తిత్వం తుమ్మలదే…
కమ్మ్యూనిస్టుల కంచుకోటలను, కాంగ్రెస్ రాజకీయ తోటలను కదిలించి, ఎదిరించి ఉద్దండుల సామ్రాజ్యంలోనూ అభివృద్ది ఏకో నామంగా గెలిచి, నిలిచిన ఘనమైన చరిత్ర తుమ్మల ది… చివరకు నక్సల్స్ అభయారణ్యంలో కూడా మీరు కోరుకున్న సిద్దాంతమే తన అభిమతమంటూ ప్రజల మౌళిక సదుపాయాల కల్పనలో ముందున్నారు తుమ్మల… కీకారణ్యంలోనూ ధైర్యంగా పర్యటించి ప్రజలకు, వారి భవిష్యత్ కు భరోసానిచ్చి అభివృద్దిలో ఖమ్మం మేటి అనిపించారాయన…
Allso read:- మంత్రి గంగుల కమలాకర్ కు షాక్
చెప్పుకుంటూ పోతే చాంతాడంత కీర్తిలో ఆయన ఘనత కు బీజం పడింది ఎన్టీఅర్ తెలుగుదేశం పార్టీలోనే… అప్పటికే ఆంధ్రుల ఆరాధ్యదైవంగా, ఇలవేల్పు గా , సినీ జగత్తులో ఓ మేరు పర్వతంలా ఉన్న స్వర్గీయ నందమూరి తారకరామారావు ఏర్పాటు చేసిన తెలుగు దేశం పార్టీలో క్రియాశీలక రాజకీయాలలోకి అడుగిడిన తుమ్మల నాగేశ్వరరావు సరిగ్గా ఇప్పటికి 40 వసంతాలు పూర్తి చేసుకున్నారు… ఓటమితోనే ప్రారంభమైన ఆయన జీవితం కేవలం రాజకీయాలకే పరిమితమైంది… ఆయన ఈ నలభై యేళ్ళ కాలంలో అనేక గెలుపు, ఓటములను చూసినా *ప్రజలను మాత్రం ఎప్పుడూ ఓడిపోనీయలేదు…* గెలుపు ఓటమి అనేది ఎప్పుడూ కేవలం ఎన్నికల వరకూ మాత్రమే కాని, ఓ ప్రజాప్రతినిధి సుదూర దృష్టి లేకపోతే ఆ ప్రభావం భావి తరాలపై పడి, ఆ తరువాతి తరం (నెక్ట్స్ జనరేషన్) నిర్వీర్యమైతండటారు తుమ్మల…
ఎన్టీఅర్ బాటలో పయనిస్తూ రాజకీయంగా అందరినీ కలుపుకుపోతూ జిల్లా సమగ్రాభివృద్దికి ఎనలేని కృషి చేశారాయన… *జిల్లాలో ఏ శిలాఫలకాన్ని తడిమినా తుమ్మల పేరు లేకుండా ఉండదంటారాయన..* నిజమే రాజకీయాలను పక్కకు పెట్టి, అభివృద్ది మంత్రాన్ని జపిస్తూ ఖమ్మం జిల్లా ను అభివృద్ది గుమ్మంగా మలిచిన ఆయన ఓటమికి కారణమైన *ప్రజలు ఇప్పటికి ఓడుతున్నారంటే ఆశ్చర్యంలేదు…* ఆధునిక ఉమ్మడి ఖమ్మం జిల్లా శిల్పిగా, ఉన్నత శిఖరాలను ప్రజలు అధిరోహించేలా చేసిన *తుమ్మల కు జక్కన్న పరాభవం* మాత్రం తప్పలేదు… మీకేం కావాలో నాకు తెలుసు, మీ జీవితాలలో వెలుగులు నే నింపుతా, మీ భవిష్యత్ మీరు మలుచుకోండి అంటూ ప్రజల కష్ఠ సుఖాలలో వారి ఎదుగుదలలో వెన్నుముఖై నిలిచిన తుమ్మల కు ఇప్పుడు ఆయన అభిమానుల *ఆత్మీయ తోరణాలు* కడుతున్నారు… ఏజన్సీలో ఆయన వెలిగించిన వెలుగులు ధివిటీతో సింహావలోకనం చేస్కుంటున్నారు…
Allso read:- నల్గొండ జిల్లాలో టీఆర్ఎస్ క్లీన్ స్వీఫ్
పేదోడికి కూడు, గూడు , గుడ్డ కల్పించాలనే ఆశయంతో ఏర్పాటైన పార్టీలో ఆయన రాజకీయ జీవితాన్ని మెదలుపెట్టి, ప్రాంతీయ అసమానతలు, విద్యా, వైద్యం, ఉద్యోగాలకై కత్తిగట్టిన తెలంగాణ వాద రధసారధి, స్వరాష్ట్ర సాధకుడు, సహచరుడు కేసిఆర్ నాయకత్వంలోని టిఆరెస్ పార్టీలో కొనసాగుతున్న తుమ్మలకు ఇప్పుడు జిల్లా ప్రజలు అభివృద్ది అవలోకన నీరాజనాలు పలుకుతున్నారు…
*రెండున్నరేళ్ళలో ఎన్నో యేళ్ళ నాటి దారిద్ర్యాన్ని తుడిచేసి, అభివృద్ది ముఖ చిత్రాన్ని చూపించిన తుమ్మల* అధినేతల మాటెన్నడూ జవదాటలేదు… కేసిఆర్ నా తెలంగాణా కోటి ఎకరాల మాగాణా నినాదం ను చాలెంజ్ గా తీసుకుని, ప్రతి నియోజకవర్గానికి లక్ష ఎకరాల సాగునీరందించాలనే తృష్ణ ను భక్త రామదాసు ప్రాజెక్టుకు రూపకల్పన చేశారాయన… కేవలం 11 నెలల్లో నెర్రలు బారిన బీడు భూములలో నీళ్ళు పారించి యావత్తు తెలంగాణకు అభివృద్ది నమూనా (బ్లూప్రింట్) ను చూపించారాయన… అంతేకాదు ప్రాంతాల మధ్య, జిల్లాల మధ్య, మండలాల మధ్య చివరికి గ్రామాల మధ్య రవాణా బాగుంటేనే అక్కడ సమగ్రాభివృద్ది జరుగుతుందని, నీటి వసతి ఉంటేనే రైతు కళ్ళలో ఆనందం నిండుతుందని విశ్వాసంతో పాలేరును తీర్చిదిద్ధిన ఘనత ముమ్మాటికీ ఆయనదే…. కక్ష లు, కార్పణ్యాలకు దూరంగా, కేసులు వాదనలను ఆమడ దూరాన్ని జరిపిన తుమ్మల అభివృద్ధి భావందవుడుగా పేరు లిఖించుకున్నారు…
మళ్లీ మన రోజులే ముందున్నాయంటూ ఆయన అభిమానులు, అభివృద్ధి కాముకులు ఏర్పాటు చేసిన 40 వసంతాలు ఆత్మీయ అభివృద్ధి సింహావలోకనం కు తరలుతున్న ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలు, నేతల ఆలోచనంతా ఇప్పుడు ఆయన ఏం మాట్లాడతారోననే చర్చలే జరుగుతున్నాయి… ఈ సమ్మేళనం భవిష్యత్ రాజకీయాలలో ఏలాంటి మలుపు తీసుకుంటుందో ననే ఆసక్తి కూడా కలగలిపి *ఏ జర్నీ టువార్డ్స్ ఫ్యూచర్* గా విజయవంతం అవుతుందని, ఖమ్మం జిల్లా నుండి మరో ముఖ్య మైన పదవులను అలంకరించాలని ఆశిద్దాం….