కాంగ్రెస్ నుంచి పోటీ చేయండి సార్..గెలిపిస్తం
== మళ్ళీ మీరే రావాలి సార్
== తుమ్మలకు హమాలీల అభ్యర్ధన
కూసుమంచి,అక్టోబర్ 7(విజయం న్యూస్)
మళ్లీ మీరే రావాలి సార్.. మీరు బాగా పనులు చేశారు.. మీ వల్ల నియోజకవర్గం మస్తు డెవలఫ్ అయ్యింది అంటూ హామిలీలు మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును అభ్యర్థించారు. ఓ ప్రైవేట్ కార్యక్రమానికి నేలకొండపల్లి మండలంకు వచ్చిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఎఫ్ సీఐ గోదామ్ లో పనిచేసే బుద్దారం గ్రామానికి చెందిన హామాలీలను కలిసి మాట్లాడారు. వారి సమస్యలను మాజీ మంత్రికి తెలియజేశారు.
ఇది కూడా చూడండి: జీళ్ళచెర్వులో దేవి నిమజ్ఙనంలో హత్యయత్నం
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాకు డబుల్ బెడ్లు లేవు, దళిత బంధు రాలేదు, ఏ పథకం రాలేదు సార్.. మీరు ఉన్నప్పుడు మస్తుగా రోడ్లు వేసిండ్రూ, మస్తు బాగుపడ్డయి.. ఇప్పుడు గుంతలున్నయి. మీరు రావాలి సార్ అంటూ వారు తుమ్మల నాగేశ్వరరావుతో అన్నారు. అంతే కాకుండా వారు ఆసక్తికరమైన ఓ మాట అనడంతో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆశ్ఛర్యపోయారు. టిఆరెస్ కు మీరు ఎంతో చేసిండ్రూ, వాళ్లు టిక్కెట్ ఇయ్యకపోతే కాంగ్రెస్ లోకి రాండి సార్ మేం గెలిపించుకుంటాం అంటూ తుమ్మల నాగేశ్వరరావును అభ్యర్థించారు. దీంతో అవాక్కైన తుమ్మల నాగేశ్వరరావు నవ్వుకుంటూ అందరికి నమస్కారం చేస్తూ వెళ్లిపోయారు. ఇది చిన్నపాటి సంబాషణ అయినప్పటికి లక్షలాధి మంది తుమ్మల అభిమానులను అశ్ఛర్యపరిచే విధంగా హామాలీలు అభ్యర్థించారు. ఆయన మరీ హామాలీల అభ్యర్థన అలకించేనా..? చూద్దాం. భవిష్యత్ లో ఏం జరగబోతుందో..?
ఇది కూడా చదవండి: మునుగోడు టీఆర్ఎస్ అభ్యర్థిగా కూసుకుంట్ల