ప్రభుత్వాలు శాశ్వతం కాదు.. ప్రజలు, అభివృద్దే శాశ్వతం: తుమ్మల
== పాలేరు అభివృద్దే లక్ష్యంగా పనిచేశా
== నియోజకవర్గంలో పెండింగ్ పనులు అలాగే ఉన్నాయి
== వాటిని పరిష్కరించేందుకు ప్రయత్నం చేస్తా
== కూసుమంచి మండలంలో పర్యటించిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
కూసుమంచి, సెప్టెంబర్ 4(విజయంన్యూస్)
ప్రభుత్వాలు శాశ్వతం కాదు, ప్రజలు, అభివృద్దే శాశ్వతం.. అభివృద్ది లేనిదే నాయకుడు కాలేడని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఖమ్మం జిల్లా, కూసుమంచి మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించారు. ముందుగా కూసుమంచి మండల కేంద్రానికి వచ్చిన తుమ్మల నాగేశ్వరరావుకు పార్టీ నాయకులు, తుమ్మల వర్గీయులు పెద్ద ఎత్తున ఘనస్వాగతం పలికారు. కూసుమంచి గ్రామం నుంచి లోక్యతండా వరకు మోటర్ సైకిళ్ల ర్యాలీ నిర్వహించారు. అనంతరం లోక్యతండా గ్రామంలో అదనపు డీసీపీ బాలుజాదవ్ 2వ వర్థంతి వేడుకల సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు ఏర్పాటు చేసిన విగ్రహాన్ని అవిష్కరించారు.
allso read- తమ్మినేని కృష్ణయ్య కుటుంబాన్ని పరామర్శించిన పొంగులేటి
అనంతరం కోక్యతండా గ్రామంలోని టీఆర్ఎస్ పార్టీ నాయకుడు పాండ్యా నివాసానికి వెళ్లి కార్యకర్తలతో మాట్లాడారు.. కార్యకర్తలు నియోజకవర్గంలోని పార్టీ పరిస్థితులు, గ్రామాల్లో పార్టీ పరిస్థితులు, కొందరు నాయకులు చేస్తున్న అవలంబిస్తున్న విధానాలను తుమ్మల ద్రుష్టికి తీసుకొచ్చారు. అందరికి అండగా ఉంటానని హామినిచ్చారు. అనంతరం జక్కేపల్లి గ్రామంలోని ఎస్పీ రెడ్డి నివాసానికి వెళ్లి అక్కడ ఎస్పీ రెడ్డి చిత్రపటానికి పూలమాలలువేసి నివాళ్లు అర్పించారు. వారి కుటుంబానికి ప్రగాడ సానుభూతి వ్యక్తం చేస్తూ అండగా ఉంటామని భరోసాను కల్పించారు. అనంతరం మాజీ సీడీసీ చైర్మన్ జూకూరి గోపాల్ రావు నివాసానికి వెళ్లి అక్కడ ముఖ్యనాయకులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంత్రిగా ఉన్నప్పుడు మంజూరు చేసిన అభివృద్ది పనులు ఇంకా కొన్ని అలాగే పెండింగ్ ఉన్నాయని, వాటిని పరిష్కరించేందుకు ప్రయత్నం చేస్తున్నాని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. గంగబండతండా, లోక్యతండా, కోక్యతండా వచ్చే ఎస్ఆర్ఎస్ పీ కాలువ నేను మంత్రిగా ఉన్నప్పుడు ఓ రైతు కోర్టుకు వెళ్లడం వల్ల సుమారు 6వేల ఎకరాలకు సాగునీరు అందకుండా పోతుందని, ఆ సమస్యను పరిష్కరించే లోపే ముందుస్తు ఎన్నికలు రావడం వల్ల ఆ సమస్య ఇప్పటి వరకు పూర్తి కాలేదని ఆరోపించారు. ఆ సమస్యను పరిష్కరించాలని సమీప రైతులందరు నాకు ఇప్పుడే వినతిపత్రాన్ని ఇచ్చారని, వారి సమస్య పరిష్కారం కోసం ఎస్ఆర్ఎస్ పీ ఎస్ఈ కి పోన్ చేసి ఆదేశించడం జరిగిందన్నారు.
allso read- బీజేపీని తెలంగాణలో అడుగుపెట్టనివ్వం: తమ్మినేని
అలాగే ఇరిగేషన్ మంత్రితో కూడా మాట్లాడతానని అన్నారు. నియోజకవర్గంలో ఇంకా పెండింగ్ పనులు ఉన్నాయని, వాటిని పరిష్కరించేందుకు నాకు పరిచయాలు ఉన్న మంత్రులతో, అధికారులతో మాట్లాడుతున్నానని అన్నారు. పాలేరు నియోజకవర్గం అభివృద్దే లక్ష్యంగా పనిచేశానని, ఏడారిగా ఉన్న పాలేరు నియోజకవర్గం అభివద్ది నియోజకవర్గంగా మారిందన్నారు. నియోజకవర్గంలో నీళ్లు లేక పంటలు బీటలు వారేవని, మంత్రి అయిన తరువాత భక్తరామదాసు ప్రాజెక్టును నిర్మాణం చేసి ప్రతి గ్రామానికి సాగునీటిని అందించామని తెలిపారు. ఇప్పుడు ప్రతి చెరువు నిండుకుండను తలపిస్తున్నాయని, నీళ్లు పుష్కలంగా ఉన్నాయని, రోడ్లు ఎలా వేశానో ప్రజలందరికి తెలుసని అన్నారు. ప్రభుత్వాలు శాశ్వతం కాదని, ప్రభుత్వంలో నాకు మంత్రిగా అవకాశం వచ్చినప్పుడు ఆ అవకాశాన్ని సద్వీనియోగం చేసుకుని ప్రజలకు సేవ చేశానని అన్నారు. ప్రభుత్వాలు శాశ్వతం కాదని, ప్రజలు.. అభివృద్ది శాశ్వతమని అన్నారు. ఆ అభివృద్దితోనే ప్రజల జీవితాల్లో మార్పులు వస్తాయని అన్నారు. జాతీయ రహదారి నిర్మాణం కోసం ఎంతో కష్టపడ్డానని, జాతీయ రహదారి రాకముందు భూముల ధరలు 10 లక్షలు ఉండేవని, ఇప్పుడు రూ.2కోట్ల వరకు ఎకరం భూమి ధర పలుకుతుందన్నారు. రైతులు జాక్ పాట్ కొట్టడం మనమంతా చూస్తున్నామని తెలిపారు.
allso read- లోక్యతండాలో బాలుజాదవ్ విగ్రహావిష్కరణ
అందుకే నాయకత్వం అంటే ప్రజల్లో తిరగడం కాదని, ప్రజల జీవితాల్లో మార్పులు వచ్చే పనులు చేయాలని, ఆ లక్ష్యంతోనే శాశ్వత పరిష్కారం చూపించాల్సిన అవసరం ఎంతైన ఉందన్నారు. ప్రజలందరు సంతోషంగా ఉండటం, నియోజకవర్గం అభివృద్ది కావడమే నా లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో బాలు జాదవ్ కుమారులు రాణా ప్రతాఫ్, ఆశోక్, నేలకొండపల్లి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వడ్తియా సెట్రామ్ నాయక్, మాజీ జడ్పీటీసీ రాంచంద్రునాయక్, మాజీ రైతు సమితి మండల అధ్యక్షుడు జొన్నలగడ్డ రవికుమార్, మాజీ ఆత్మకమిటీ చైర్మన్ మద్ది మల్లారెడ్డి, మాజీ సీడీసీ చైర్మన్ జూకూరి గోపాల్ రావు, మాజీ ఏఎంసీ చైర్మన్ రమేష్, జిల్లా నాయకులు సాధు రమేష్ రెడ్డి, ఎంపీటీసీ మాదాసు ఉపేందర్, బండి జగదీష్, వడ్తియా రమేష్ నాయక్, వడ్తియా రాజునాయక్, బారీ వీరభద్రం, అర్వపల్లి జనార్థన్, కూరపాటి వేణు, దామోదర్ రెడ్డి, ఆశోక్ తదితరులు హాజరైయ్యారు.