ఆ ఇద్దరు కలిశారు..అంతర్యమేంటో..?
== మణుగూరులో తుమ్మల, రేగా మాటముచ్చట
== ములుగు జిల్లా నుంచి వస్తుండగా తుమ్మలను క్యాంఫ్ కార్యాలయానికి ఆహ్వానించిన రేగా
== తుమ్మలతో సన్నిహితంగా మెలుగుతున్న రేగా
== అనుకోకుండా వచ్చారని అంటున్న గులాబీ నేతలు
== ఇటీవలే పొంగులేటితో ఢీ అంటే ఢీ అన్నట్లుగా పోటీపడుతున్న రేగా
మణుగూరు, నవంబర్ 21(విజయంన్యూస్)
సంచలనాలకే మారు పేరు వారిద్దరు..ఆ ఇద్దరి కలియక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది.. నిప్పు, ఉప్పు అన్నట్లుగా ఉండే ఈ ఇద్దరు అకస్మీకంగా కలుసుకుని మాట్లాడటం పట్ల రాజకీయ వర్గాల్లో హాట్ టాఫిక్ గా మారింది. తుమ్మల ఊసే ఎత్తని రేగా కాంతారావు ఉన్నట్లుండి తుమ్మల నాగేశ్వరరావును తన క్యాంఫ్ కార్యాలయానికి ఆహ్వానించడం, సన్మానించడం, ఆప్యాయతగా మాట్లాడటం చూపరులను, ప్రజలను ఆశ్ఛర్యానికి గురిచేసింది. ఆ ఇద్దరు ఎందుకు కలిశారు..అంతర్యమేంటి..? అంటూ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు.
ఇధి కూడా చదవండి: సీఎం కేసీఆర్ పై తమ్మినేని సంచలన వ్యాఖ్యలు
పూర్తి వివరాల్లోకి వెళ్లే మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇటీవలే రోజు మీడియాలో హాట్ హాట్ గా కనిపిస్తున్నారు.. గతకొద్ది రోజుల క్రితం వాజేడు పర్యటనలో భాగంగా వందలాధి కార్లతో, వేలాధి మంది జనంతో వాజేడు వెళ్లిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఒక్క సారి రాజకీయ ట్రెండ్ గా మారిపోయారు.మునుగోడు ఎన్నికల తరువాత జనబలం చూయించుకున్న నాయకుడైయ్యారు.అంతే కాకుండా ఆయన స్వంత నియోజకవర్గం సత్తుపల్లిలో ఇద్దరు ఎంపీలకు అభినందన కార్యక్రమం జరిగితే ఆ కార్యక్రమానికి రాకుండా మీడియాలో నిలిచారు. ఎందుకు రాలేదో మరసటి రోజున ఎంపీ పార్థసారథిరెడ్డిని కలిసి వివరించారు. కనీసం అహ్వానం లేదని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తన నోటినుంచి వచ్చిందో రాలేదో..? కానీ మీడియాలో పెద్ద ఎత్తున్న ప్రచారం కావడం, ట్రోలింగ్ కావడం జరిగింది. అలా ఏదో ఒక పర్యటనతో నిత్యం మీడియాలో ఉంటున్నారు. మరోపక్క సంచలనాలకే మారుపేరుగా మారారు ప్రభుత్వ విఫ్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు. తన నియోజకవర్గంలో నాకు తెలియకుండా ఎవరు పార్టీ నాయకులు తిరగోద్దని జిల్లా అధ్యక్షుడిగా, ప్రభుత్వ విఫ్ గా, సీనియర్ ఎమ్మెల్యేగా ఆదేశాలు జారీ చేసినప్పటికి పట్టించుకొని కొందరు వ్యక్తులు అలాగే నియోజకవర్గంలో పర్యటిస్తుండటంతో బహిరంగానే ఆరోపణలు చేస్తూ వార్తల్లోకి ఎక్కారు. అలాగే ఎమ్మెల్యేల్ని బీజేపీ కొనుగోలు చేసేందుకు ప్రయత్నించిన ఆ నలుగురు ఎమ్మెల్యేల్లో ఒకరు రేగా కాంతారావు. ఆ విషయంలో రేగా సంచలనంగా మారారు. ఇలా సంచలనాలకు మారుపేరైన ఆ ఇద్దరు కలుసుకుని చర్చించడం హాట్ టాఫిక్ గా మారింది.
== రేగా క్యాంఫ్ కార్యాలయంకు వచ్చిన మాజీ మంత్రి
ములుగు జిల్లా పర్యటనకు వెళ్లి తిరిగి వస్తున్న మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును పినపాక ఎమ్మెల్యే, ప్రభుత్వ విఫ్, భద్రాద్రికొత్తగూడెం బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు సోమవారం తన క్యాంఫ్ కార్యాలయానికి రావాలని కోరారు. దీంతో మణుగూరు వచ్చిన తుమ్మల నాగేశ్వరరావు నేరుగా రేగా కాంతారావు క్యాంఫ్ కార్యాలయానికి వెళ్లి రేగాతో కలిసి మాట్లాడారు. ముందుగా క్యాంఫ్ కార్యాలయానికి వచ్చిన తుమ్మల నాగేశ్వరరావును ఎమ్మెల్యే రేగా ఘనంగా సన్మానించారు. అనంతరం కొద్దిసేపు రాజకీయాలపై చర్చించుకున్నారు. ఇది కూడాచదవండి: హెల్త్ డైరెక్టర్ గడల సంచలన వ్యాఖ్యలు
== పొంగులేటిని తప్పించుకునేందుకేనా..?
పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు ఇలాకాలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఎమ్మెల్యేకు సమాచారం ఇవ్వకుండా ప్రతిసారి కార్యక్రమాలు నిర్వహిస్తుండటంతో రేగా కాంతారావు బహిరంగంగానే విమ్మర్శలు చేశారు. అదిష్టానానికి చెప్పారు. అయిన ఫలితం లేకపోయింది. దీంతో నేరుగా పొంగులేటి పై యుద్దం ప్రకటించారు. కాగా పరిస్థితులను భట్టి ఇరువు తగ్గాల్సి వచ్చింది. అయితే రేగా కాంతారావు పొంగులేటి వ్యూహాలకు పదును పట్టాలంటే మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కరెక్ట్ అని భావించిన రేగా కాంతారావు, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో సక్కితగా ఉన్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే ఆయన్ను క్యాంఫ్ కార్యాలయంకు పిలిచినట్లుగా తెలుస్తోంది. అయితే కలియక కు ప్రాథన్యత లేదని, అనుకోకుండా కలవడం జరిగిందని, ఎలాంటి ప్రాథాన్యత లేదన్నారు ఇద్దరు నేతలు.