Telugu News

ఆ పని చేయడమే నా లక్ష్యమని అంటున్న తుమ్మల

40ఏళ్ల రాజకీయంలో ఆ పని చేయాలనేదే నా తపన

0

గోదావరి నీళ్లను పాలేరులో కలపడమే నాలక్ష్యం: తుమ్మల

== సీతారామ ప్రాజెక్ట్ పూర్తి చేసి 10లక్షల ఎకరాలకు సాగునీటిని అందించాలి

==  గోదావరి నీళ్లతో పాలేరు ప్రజల పాదాలు కడగాలి

== 40ఏళ్ల రాజకీయంలో సహాకరించిన అందరికి ధన్యవాదాలు

== విలేకర్ల సమావేశంలో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

(ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్)

గోదావరి నీటిని పాలేరు జలాశయంలో కలిపి, పాలేరు ప్రజల పాదాలను కడగాలనేదే నా లక్ష్యమని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. 40ఏళ్ల రాజకీయంలో కూడా సీతారామ ప్రాజెక్టును పూర్తి చేయాలనే లక్ష్యంగానే పనిచేశానని తెలిపారు. శనివారం ఖమ్మం రూరల్ మండలంలోని శ్రీసిటి లో తన నివాసం వద్ద ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మెళనం కార్యక్రమం అనంతరం మీడియాతో మాట్లాడిన తుమ్మల నాగేశ్వరరావు ఆయన లక్ష్యమేంటో చెప్పారు. నా 40ఏళ్ల రాజకీయంలో ముగ్గురు ముఖ్యమంత్రుల వద్ద పనిచేసే అవకాశం రావడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నానని అన్నారు. వారి హాయంలో భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా, రోడ్డు భవనాల శాఖమంత్రిగా చాలా సంతోష కరమైన పనులు చేశానని అన్నారు.

ఇది కూడా చదవండి: తుమ్మల కోసం కదిళన జనం

ఉమ్మడి ఖమ్మం జిల్లాకు జాతీయ రహదారులను మంజూరు చేశానని, గోదావరి నదిపై ఎత్తిపోతలు పెట్టానని, పాలేరు జలాశయంపై ఎత్తిపోతలను నిర్మాణం చేశానని అన్నారు. అంతే కాకుండా చిన్న,మద్య, బారీ నీటిపారుదలపై ప్రాజెక్టులను నిర్మాణం చేశానని అన్నారు. నేను అడగ్గానే ముఖ్యమంత్రులు తక్షణమే బడ్జెట్ కు సంబంధం లేకుండా మంజూరు చేశారని, వారందరికి రుణపడి ఉంటానని అన్నారు. నా చిరకాల కోరక నేరవేరే సమయం అసన్నమైందన్నారు. నేను గతంలో మంత్రిగా పనిచేసిన అనంతరం దుమ్ముగూడెం ప్రాజెక్టును నిర్మాణం చేయాలని పట్టుబట్టడం జరిగిందన్నారు.  దుమ్ముగూడెం ప్రాజెక్టు ద్వారా పాలేరు జలాశయంలోకి నీటిని తీసుకొచ్చి గోదావరి, క్రిష్ణమ్మ నీటిని పాలేరు జలాశయంలో పునీతం చేయాలనే లక్ష్యం ఉందన్నారు.

ఇది కూడా చదవండి: ఇది ఎలక్షన్ ఇయర్.. ఇక ప్రచారం షూరు

అది జరిగితే 10లక్షల ఎకరాల్లో సాగునీరు అందుతుందని, అద్భుతమైన పంట దిగుబడి వస్తుందన్నారు. ఇప్పటికే సీఎం కేసీఆర్ దయవల్ల సీతారామ ప్రాజెక్టు నిర్మాణ పనులు పురోగతిలో ఉన్నాయని, కచ్చితంగా నిర్మాణం పూర్తైయ్య వరకు వదిలేది లేదన్నారు. అలాగే నేడు పాలేరు నియోజకవర్గం చుట్టు అభివద్ది ఎక్కడ చూసిన అద్భుతంగా పనిచేశారని ప్రజలు చెబుతుంటే సంతోషంగా ఉందన్నారు. భక్తరామదాసు ప్రాజెక్టుతో కరువు ప్రాంతానికి నిలయంగా ఉన్న పాలేరు నియోజకవర్గం నేడు సస్యశ్యామలంగా మారిందన్నారు. ప్రధానంగా ప్రజలందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలందరు సుబీక్షంగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు సాధు రమేష్ రెడ్డి, జొన్నలగడ్డ రవికుమార్, మాజీ సర్పంచ్ బండి జగదీష్, సుధాకర్ రెడ్డి, రమేష్ తదితరులు హాజరైయ్యారు.