Telugu News

ఎఫ్ఆర్వో  శ్రీనివాస్ రావు కుటుంబాన్ని పరామర్శించిన తుమ్మల

కుటుంబానికి అండగా ఉంటామని హామి

0

ఎఫ్ఆర్వో  శ్రీనివాస్ రావు కుటుంబాన్ని పరామర్శించిన తుమ్మల

== కుటుంబానికి అండగా ఉంటామని హామి

(ఖమ్మం-విజయంన్యూస్)

ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాస్ రావు హత్య రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఆయన కుటుంబానికి ప్రభుత్వం పరిహారం అందించడమే కాకుండా ఉద్యోగ అవకాశం ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆదివారం ఖమ్మం జిల్లా పర్యటనలో ఉన్న మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు  రఘునాధపాలెం మండలం ఈర్లపూడి గ్రామంలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ చలమల శ్రీనివాసరావు ఇంటికి వెళ్లి ఆయన కుటుంబాన్ని పరామర్శించారు. ముందుగా శ్రీనివాస్ రావు చిత్రపటానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించిన మాజీమంత్రి వర్యులు తుమ్మల నాగేశ్వరరావు, కుటుంబ సభ్యులతో మాట్లాడారు. వారికి దైర్యం చెప్పారు. వారి కుటుంబానికి అండగా ఉంటామని హామినిచ్చారు.  ఈ కార్యక్రమంలో జిల్లా టిఆర్ఎస్ నాయకులు గుత్త వెంకటేశ్వరావు, తాతా రఘురాం, తుపాకుల ఎల్లగొండ స్వామి, సుడా డైరెక్టర్ ఖాదర్ బాబు, పంతులు నాయక్,గుర్రం జగన్, సురేష్ నాయకులు పాల్గొని శ్రీనివాస రావు  చిత్రపటానికి నివాళులర్పించారు

ఇది కూడా చదవండి: 187 పరుగులకే ఆలౌట్ అయిన టీమీండియా