తుమ్మల అసక్తికర వ్యాఖ్యలు..ఏమన్నారంటే..?
యధాయధా ముఖ్యమంత్రి...తధా మంత్రులు:తుమ్మల ముఖ్యమంత్రి...తధా మంత్రులు:తుమ్మల
యధా ముఖ్యమంత్రి…తధా మంత్రులు:తుమ్మల
== ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో ఆసక్తి వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి
(ఖమ్మంప్రతినిధి-విజయం న్యూస్)
యధా ముఖ్యమంత్రి..తధా మంత్రులు అని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఖమ్మం నగరంలో స్థానిక బ్లోమింగ్ మైండ్స్ స్కూల్ అండ్ కాలేజీ యాజమాన్యం ఆధ్వర్యంలో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొని ప్రసంగించిన మాజీ మంత్రి, ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు,
ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ ప్రభుత్వం విద్యా వ్యతిరేక విధానాలను అవలంబిస్తుంది…
ఇది కూడా చదవండి:- బీఆర్ఎస్ పార్టీకి జలగం గుడ్ బై.
నిధులు నియామకాల బేస్ మీద ఏర్పడిన తెలంగాణలో పేపర్ల లీకులతో నిరుద్యోగుల ఆత్మ స్థైర్యం దెబ్బతిని ఆత్మహత్యల పాలవుతున్నారు….
ఇలాంటి దుర్మార్గపు చర్యల వల్ల ప్రభుత్వం ప్రతిష్ఠ దిగజారుతోందని ఎంత చెప్పినా పట్టించుకునే పరిస్థితి లేకనే నేను ఆ పార్టీ నుండి బయటకు రావాల్సి వచ్చిందని చెప్పారు…
యధా ముఖ్యమంత్రి తదా మంత్రులు అన్నట్లు ఖమ్మంలో కూడా ఒక నాయకుడు అరాచక పరిపాలన సాగిస్తున్నాడని అయన అరాచకాలకు అడ్డుకట్ట వేయడం కోసమే సోనియా గాంధీ గారు,రాహుల్ గాంధీ గారు నన్ను ఇక్కడ పోటీకి పెట్టారని దయచేసి రాబోయే ఎన్నికల్లో హస్తం గుర్తుపై ఓటు వేసి నన్ను గెలిపించ వలసిందిగా అధ్యాపకులను కోరారు.
ఇది కూడా చదవండి:- ఖమ్మం మార్కెట్ లో తుమ్మల ప్రచారం
ఈ కార్య్రమంలో సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు మహ్మద్ జావేద్,మాజి మార్కెట్ కమిటీ చైర్మన్ మానుకోండ రాధాకిషోర్,కాలేజీ కరస్పాండెంట్ అశోక్ రెడ్డి,వీరారెడ్డి, మైనారిటీ నాయకుడు చోటా బాబు,శెట్టి రంగారావు తదితర ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు…..