Telugu News

కేసీఆర్ రుణం తీర్చుకునే సమయమిదే: నామ

నిజానికి - అబద్దానికి మధ్య పోరులో నాదే విజయం

0

కేసీఆర్ రుణం తీర్చుకునే సమయమిదే: నామ

➡️ నిజానికి – అబద్దానికి మధ్య పోరులో నాదే విజయం

➡️ రైతు బిడ్డ గెలుపు బాధ్యత అందరిది

➡️ నా గెలుపుతోనే మళ్లీ జిల్లా కళకళ

➡️ మళ్లీ గెలిస్తే పార్లమెంట్ లో గర్జిస్తా

➡️కాంగ్రెస్ కు కర్రు కాల్చి వాత పెట్టడం ఖాయం

➡️ కరోన లో ఎంతో సేవ చేసి భరోసా ఇచ్చా

➡️ కేసీఆర్ కావాలా? .. కరవు కారక కాంగ్రెస్ కావాలా?

👉 కల్లూరు, సత్తుపల్లి, పెనుబల్లి బూత్, ఆత్మీయ సమావేశాల్లో ఎంపీ అభ్యర్థి నామ నాగేశ్వరరావు, సండ్ర వెంకట వీరయ్య, వద్దిరాజు రవిచంద్ర

(ఖమ్మం /సత్తుపల్లి-విజయం న్యూస్)

ఎంతో అభివృద్ధి చేసిన కేసీఆర్ రుణం తీర్చుకోవాలంటే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థినైన తనను అత్యధిక మెజార్టీతో గెలిపించి మద్దతుగా నిలవాలని ఎంపీ అభ్యర్థి నామ నాగేశ్వరరావు అన్నారు. సత్తుపల్లి, కల్లూరు, పెనుబల్లి, బోనకల్, నాగులవంచ తదితర ప్రాంతాల్లో బుధవారం జరిగిన బూత్, ఆత్మీయ సమావేశాల్లో నామ మాట్లాడారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని,నిశ్చబ్ద విప్లవాన్ని ప్రజలు ఛేదించడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ప్రతి క్షణం ఈ జిల్లా ప్రజల బాగు కోసం పరితపించే రైతు బిడ్డను గెలిపించే బాధ్యతను ప్రతి ఒక్కరూ తీసుకోవాలని పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా మళ్లీ అన్నింటా పచ్చగా కళకళ లాడాలంటే తాను గెలవాలన్నారు.

ఇది కూడా చదవండి:- అయ్యప్ప స్వామి టెంపుల్ లో నామ  పూజలు

నిజానికి – అబద్దానికి మధ్య జరుగుతున్న ఈ పోరాటంలో విజయం తనదేనని అన్నారు. తాను గెలిస్తే కాంగ్రెస్ హామీల అమలుకు కొట్లాడతానని అన్నారు.రెండు సార్లు పార్లమెంట్ సభ్యునిగా ఎంతో అభివృద్ధి చేశానని తెలిపారు. మళ్లీ గెలిపిస్తే ఖమ్మం జిల్లా ప్రజల గొంతుకనై పార్లమెంట్ లో ఖమ్మం గడ్డ కోసం పోరాడతానని చెప్పారు.కరోన సమయంలో ప్రాణాలు లెక్క చేయకుండా ప్రజలకెంతో సేవ చేశానని, కరోన బాధిత కుటుంబాల ఇళ్లకు వెళ్లి, వారిని కలిసి బతుకు భరోసా ఇవ్వడమే కాకుండా 5 జిల్లాల్లో పెద్ద ఎత్తున శానిటైజర్, మాస్కులు పంపిణీ చేయడం జరిగిందన్నారు. పెద్ద ఎత్తున భోజనాలు పెట్టి, పేదలను అదుకున్నామని చెప్పారు.తెలంగాణపై కుట్రలను తిప్పికొట్టాలంటే పార్లమెంట్ లో బీఆర్ఎస్ ఎంపీలుండాలని అన్నారు. ఓటు అనే ఆయుధంతో కాంగ్రెస్, బీజేపీకి తగిన గుణపాఠం చెప్పాలని అన్నారు. ఎవరికి ఓటు వేస్తే ప్రయోజనం ఉంటుందో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలన్నారు. రంగుల సినిమా చూపించి, అధికా రంలోకి వచ్చిన ఈ 5 నెలల్లో కాంగ్రెస్ గురించి పూర్తిగా ప్రజలకు అర్ధమైందన్నారు. అందుకే ఎన్నికల్లో ఆ పార్టీకి కర్రు కాల్చి వాత పెట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. రైతుల పరిస్థితి చూస్తే గుండె తరుక్కుపోతుందని అన్నారు. ఇంత వరకు రైతు బంధు పూర్తిగా పడలేదని అన్నారు. దండగ అన్న వ్యవసాయాన్ని పండుగ జేసిన ఘనత కేసీఆర్ ది అన్నారు.

ఇది కూడా చదవండి చరిత్ర తిరగ రాయబోతున్నాం:నామా

కేసీఆర్ కావాలో ….కరవు తెచ్చిన కాంగ్రెస్ కావాలో తేల్చుకోవాలని పేర్కొన్నారు. ఈ ఎన్నికలు జిల్లా భవిష్యత్ ను, ప్రజల తలరాతను మార్చే ఎన్నికలని అన్నారు. అరచేతిలో వైకుంఠం చూపించి, ప్రజల్ని మోసం చేసిన కాంగ్రెస్ ను ఎక్కడపడితే అక్కడ నిలదీయాలన్నారు. తెలంగాణా , జిల్లా ప్రయోజనాలు నెరవేరాలoటే తాను పార్లమెంట్ లో ఉండాలన్నారు. ఈ కార్యక్రమాల్లో మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, జెట్పీ చైర్మన్ లింగాల కమలరాజ్, ఆయా మండలాల నాయకులు పాల్గొన్నారు.