Telugu News

ఢిల్లీలో తిరంగా మార్చ్ నిరసన.. హాజరైన ఖమ్మం ఎంపీలు

జాతీయ జెండా చేత పట్టుకొని, ర్యాలీలో నినాదాలతో హోరెత్తించిన నామ నాగేశ్వరరావు, పార్టీ ఎంపీలు 

0
ఢిల్లీలో తిరంగా మార్చ్ నిరసన 
🔶 కదం తొక్కిన బీఆర్ఎస్ ఎంపీలు
🔶జాతీయ జెండా చేత పట్టుకొని, ర్యాలీలో నినాదాలతో హోరెత్తించిన నామ నాగేశ్వరరావు, పార్టీ ఎంపీలు 
🔶అదానీ అంశంపై జేపీసీ వేయకుండానే పార్లమెంట్ సమావేశాలను ముగించారు
🔶బీఆర్ఎస్ ఎంపీలు చేసిన ఆందోళనను యావత్ దేశ ప్రజలు గుర్తించారు… కేంద్ర ప్రభుత్వానికి గుణపాఠం ఖాయం 
🔶అదానీ ప్రయోజనాల కోసమే కేంద్ర ప్రభుత్వం పని చేసింది                            ఇది కూడా చదవండి:   అన్నింటా తెలంగాణ పట్ల కేంద్రం వివక్షే: నామా
🔶 బీఆర్ఎస్ లోక్ సభా పక్ష నాయకులు నామ నాగేశ్వరరావు 
న్యూఢిల్లీ, ఏప్రిల్ 06(విజయం న్యూస్):
పార్లమెంట్ నిరవధిక వాయిదా అనంతరం న్యూఢిల్లీలో గురువారం బీఆర్ఎస్ ,విపక్ష, ప్రతిపక్ష పార్టీల ఎంపీలు పెద్ద ఎత్తున కదం తొక్కి  నిర్వహించిన తిరంగా  మార్చ్ కు అనూహ్య  స్పందన లభించింది. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల చివరి రోజు కావడంతో బీఆర్ఎస్ ఎంపీలు పార్టీ లోక్ సభా పక్షనాయకులు నామ నాగేశ్వరరావు నేతృత్వంలో  జాతీయ జెండాలు చేత పట్టుకుని విజయ్ చౌక్ వరకు నిర్వహించిన తిరంగా మార్చ్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరిని నిరసిస్తూ అదానీ అంశంపై జేపీసీ వేయాలని డిమాండ్ చేస్తూ ప్లకార్డులతో హోరెత్తించారు.
ఈ సందర్భంగా నామ నాగేశ్వర రావు మాట్లాడుతూ అదానీ ప్రయోజనాల కోసమే కేంద్ర ప్రభుత్వం పని చేస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుందని మండిపడ్డారు. ఇన్ని రోజులూ వాయిదాలతోనే సమావేశాలను సరిపెట్టారని , ఎంతో ప్రాధాన్యం ఉన్న ఆదానీ అంశాన్ని చర్చించకుండా బీఆర్ ఎస్ ఎంపీల గొంతు నొక్కారని  అన్నారు. తప్పు చేసింది కనుకనే అదానీ అంశంపై జేపీసీ వేయకుండా కేంద్ర ప్రభుత్వం పారి పోయిందన్నారు. వాస్తవాలను ప్రజల ముందు ఉంచాలనే ఉద్దేశంతోనే పార్లమెంట్ ను స్తంభింప జేశామని పేర్కొన్నారు. ఎంతో ప్రాధాన్యం ఉన్న బడ్జెట్ పై చర్చించకుండానేఆమోదించారని అన్నారు.పార్లమెంట్ సాక్షిగా బీఆర్ఎస్  ఎంపీలు చేసిన ఆందోళనను, తాపత్ర్యాన్ని యావత్ దేశ ప్రజలు గుర్తించా రని,  రానున్నకాలంలో కేంద్ర ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పాలని ప్రజలంతా ఎదురు చూస్తున్నారని నామ నాగేశ్వర రావు అన్నారు. ఈకార్యక్ర మంలో బీఆర్ఎస్ ఎంపీలంతా పాల్గొన్నారు.