Telugu News

జన సంద్రంగా మారిన తీర్దాల

సౌకర్యాలు నిల్

0

జన సంద్రంగా మారిన తీర్దాల
★సౌకర్యాలు నిల్
★భారీగా నిలిసిన వాహనాలు
★ఇబ్బందుల్లో భక్తులు

*శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని తీర్దాల జనసంద్రంగా మారింది..సంఘమేశ్వరస్వామి దేవస్థానం శివన్నామస్మరణలతో మార్మోగింది.. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా తెల్లవారుజాము నుంచే ఖమ్మం, మహాబుభాద్ జిల్లాల నుంచి భక్తులు తీర్దాల భాట పట్టారు. తీర్దాల వైపు వెళ్లే రోడ్లన్నీ జనంతో రద్దీగా మారాయి. శివరాత్రి సంధర్భంగా మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి, గాయత్రి రవి తదితరులు సంఘమేశ్వరస్వామి దేవాలయంలో పూజలు చేశారు.

also read:-మార్చి 7న తెలంగాణ బ‌డ్జెట్‌.

సౌకర్యాలు నిల్
ఖమ్మం జిల్లా, రూరల్ మండలం తీర్దాల సంఘమేశ్వరస్వామి ఆలయ కమిటీ , ఎండో మెంట్ అధికారులు టికెట్ అమ్మకాలు, దుకాణాల ఏర్పాటుపై పెట్టిన శ్రద్ధ కనీస సౌకర్యాల మీద పెట్టక పోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దేవాలయం చుట్టూ ఉన్న ఖాళీ స్థలంలో దుకాణాలు ఏర్పాటు చేయడంతో భక్తులు నిలబడటానికి కూడా చోటు లేకుండా పోయింది. పక్కనే ఉన్న పొలాల్లోకి పోదామంటే రైతులు రానివ్వలేదు దీంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. టెంట్లు ఏర్పాటు చేయక పోవడంతో భక్తులు ఎండ తీవ్రతకు చెట్ల కింద చేదూతీరాల్చిన పరిస్థితి నెలకొంది. స్నానాలు ఆచరించేందుకు బాత్ రూమ్ లు, మరుగుదొడ్లు లేక మహిళా భక్తులు ఇబ్బందులు పడకుండ్డారు. పార్కింగ్ స్థలం ఏర్పాటు చేయకపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.

also read;-బాల రత్న” జాతీయ పురస్కారం 2022కు ఎంపికైన తనిష్క

ట్రాఫిక్ జామ్
శివరాత్రి సందర్భంగా తీర్దాలకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో రావడంతో ట్రాఫిక్ జామ్ అయింది. రోడ్డు ఇరుకుగా ఉండడంతో వాహనాలు కిలో మీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. గంటల తరబడి ట్రాఫిక్ స్థంభించినప్పటికీ అధికార యంత్రాంగం కనీస చర్యలు తీసుకోకపోవడంపై వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని పలువురు కోరుతున్నారు.