Telugu News

ఆ టీచర్ మాకే కావాలంటూ విద్యార్థుల ధర్నా

రోడ్డుపై రాస్తారోకో చేసిన బచ్చోడు ప్రాథమిక పాఠశాల విద్యార్థుల 

0

ఆ టీచర్ మాకే కావాలంటూ విద్యార్థుల ధర్నా

== రోడ్డుపై రాస్తారోకో చేసిన బచ్చోడు ప్రాథమిక పాఠశాల విద్యార్థుల 

== డిప్యూటేషన్ పై మా టీచర్ ను పంపించోద్దని అధికారులకు వినతి 

(రిపోర్టర్ : వీరయ్య)

తిరుమలాయపాలెం, సెప్టెంబర్ 6 (విజయం న్యూస్):

మా టీచర్ మాకే కావాలని రోడ్డుపై బయట నుంచి ధర్నా నిర్వహించారు తిరుమలాయపాలెం మండలం బచ్చోడు గ్రామంలో ప్రాథమిక పాఠశాల యందు144 మందిరి విద్యార్థిని విద్యార్థులు చదువుతున్నారు వారి తరగతులకు సరిపడా టీచర్స్ ఉన్నారు అందులో ఒక టీచరు లాంగ్ మెడికల్ లీవ్ లో ఉన్నారు ప్రస్తుతం ఉన్న టీచర్లలో ఒకరిని డిప్యూటేషన్ మీద వేరే ఊరికి పంపించడం కోసం పై అధికారులు ప్లాను సిద్ధం చేసి ఉన్నారు తక్షణమే డిప్యూటేషన్ మీద పంపించటాన్ని ఉపసంహరించుకోవాలని విద్యార్థిని విద్యార్థులు మరియు తల్లిదండ్రులు ఈరోజు పాఠశాల ముందు రోడ్డుపై బైఠాయించే నిరసన వ్యక్తం చేయడం జరిగింది.

ఇది కూడా చదవండి: చెరువుల్లో చేప పిల్లలను విడుదల చేసిన మంత్రి
ఈ సందర్భంగా స్థానిక గ్రామస్తులు సిపిఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ మండల కార్యదర్శి గొర్రెపాటి రమేష్ మాట్లాడుతూ మండలంలోని అత్యధికంగా విద్యార్థిని విద్యార్థులు ఉన్న పాఠశాల బచ్చోడు మాత్రమేనని అటువంటి పాఠశాలను అభివృద్ధి పదంలో నడిపించాలని డిప్యూటేషన్ పేరుతో ఇక్కడ పనిచేస్తున్నటువంటి టీచర్ను వేరే ప్రాంతానికి పంపించటాన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నామని మా పిల్లల భవిష్యత్తు కోసం పై అధికారులు ప్రజా ప్రతినిధులు స్పందించి ఆలోచన చేయాలని ఇక్కడ చదువుతున్న పిల్లలు మొత్తం ఎస్సీ, ఎస్టీ ,బీసీ లకు సంబంధించిన వారే ఉన్నారని ఇక డబ్బులు పెట్టి ప్రైవేట్ పాఠశాలల్లో చదివించే అంత స్తోమత మా గ్రామ ప్రజలకు లేదని అందుకనే ఎక్కువ మొత్తంలో పిల్లలు ప్రభుత్వ పాఠశాలలోనే చదువుతున్నారని గతంలో కూడా ఒక టీచర్ను పంపిస్తే మరల వారిని మా పాఠశాలకు తీసుకొచ్చుకోవడం జరిగిందని మా గ్రామం మీద పై అధికారులు చిన్నచూపు చూడటం సరైనటువంటిది కాదు అని మేము గ్రామస్తులుగా కోరుతున్నాం.

ఇది కూడా చదవండి : ఆశయమా… ఆత్మరక్షణా..
మా పాఠశాల యందు మౌలిక వసతులు కల్పించి పాఠశాల అభివృద్ధి కోసం ప్రభుత్వం పని చేయాలని గ్రామంలో మా పాఠశాలలో ఎటువంటి సమస్య వచ్చిన గ్రామస్తులుగా మేము అనునిత్యం విద్యార్థుల తల్లిదండ్రులుగా గ్రామస్తులుగా మా పాఠశాలను అభివృద్ధి మార్గం వైపు నడిపించుకోవడం కోసం మా వంతు కృషిని మేము చేస్తూ ప్రోత్సహిస్తూ మా పాఠశాలను ముందుకు తీసుకుపోవటం జరుగుతుందని ఆ క్రమంలోనే ఈ విధంగా టీచర్లను డిప్యూటేషన్ పేరుతోనే పంపించడం సరైనటువంటిది కాదు అని మేము కోరుతున్నాం ఈకార్యక్రమంలో ,విద్యా కమిటీ చైర్మన్ నందిపాటి రామకృష్ణ గ్రామస్తులు లోడిగ వెంకన్న, ఉమారాణి, కలమ్మ ,పల్లె మహేష్, శ్రీకాంత్ ,రంజిత్, సతీష్ తదితరులు పాల్గొన్నారు