Telugu News

ఏసీబికి చెక్కిన సబ్ ఇంజనీర్ .2వేలు లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికి

రూ.2వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన సబ్ ఇంజనీర్

0

బిగ్ బ్రేకింగ్ న్యూస్…

రూ.2వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన సబ్ ఇంజనీర్

— అరెస్టు చేసిన ఏసీబీ అధికారులు

(తిరుమలాయపాలెం -విజయంన్యూస్)

ఇంటికి విద్యుత్ సౌకర్యం కల్పించాలని, అందుకు కొత్తమీటర్ ను మంజూరు చేయాలని ఓ వ్యక్తి దరఖాస్తు చేసుకోగా, పైసలిస్తేనే పనిపూర్తవుద్దని తెల్చిచెప్పాడు ఓ అధికారి.. రూ.2 వేలు లంచం ఇస్తేనే పని పూర్తి చేస్తామని చెప్పాడు.  విద్యుత్ సౌకర్యం కోసం  మీటర్ కోసం అంత ఎందుకు ఇవ్వాలని అడిగితే చేసేది లేదని చెప్పడంతో ఆ బాధితుడు ఏసీబీని అశ్రయించాడు.  మీటర్ కల్పించేందుకు లంచం డిమాండ్ చేసిన విద్యుత్ శాఖాధికారి అవినీతి నిరోదక శాఖాధికారులకు అడ్డంగా బుక్కైయ్యాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు విద్యుత్ శాఖలో పనిచేస్తున్న అధికారి లంచం తీసుకుంటుండగా అడ్డంగా పట్టుకని కటకటాల వెనక్కి నెట్టారు. ఈ సంఘటన శనివారం తిరుమలాయపాలెంలో చోటు చేసుకుంది.  ఖమ్మం జిల్లా,  తిరుమలాయపాలెం మండలంలో బచ్చోడు గ్రామానికి చెందిన రామకృష్ణ స్వంత ఇంటికి విద్యుత్ సౌకర్యం కోసం  బచ్చొడు సెక్షన్ పరిదిలో టీఎస్ ఎన్పీడిసీఎల్ కార్యాలయంలో సబ్ ఇంజినీర్ గా విధులు నిర్వహిస్తున్న గోవర్ధన్ ను కలిసి వినతి చేశాడు. కొత్త మీటర్తో పాటు కొత్త కనెక్షన్ కావాలని కోరాడు. దీంతో అలవాటు పడ్డ ప్రాణం అగదన్నట్లు  వెంటనే రూ.2వేలు ఇస్తే మీటర్ ఇస్తానని తెల్చిచెప్పాడు. దీంతో ఆ బాధితుడు వెంటనే ఏసీబీ అధికారులను ఆశ్రయించడగా, రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు,  బాధుతుడి నుంచి  రూ.2వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులకు పట్టుకున్నారు. అనంతరం ఆయన్ను అరెస్టు చేశారు. ఈ కార్యక్రమంలో ఎసిబి డీఎస్పీ రమణ మూర్తి,ఇన్సెపెక్టర్ లు శ్రీనివాస్,రవి,సిబ్బంది పాల్గొన్నారు.

ALSO READ:- పోలీస్ సార్ సల్లగుండాలే.. వృద్దురాలు కితాబు.. ఎందుకో..?

 

*‘ఎప్పటికప్పుడు లెటెస్ట్ న్యూస్ కావాలనుకుంటున్నారా..? దేశంలో, రాష్ర్టంలో జరిగే తాజా బ్రేకింగ్ న్యూస్ కావాలనుకుంటున్నారా..? అయితే మా విజయం పేపర్ ను సబ్ స్కైబ్ చేసుకొండి.. మీ స్ర్కీన్ పై ఉన్న గంట గుర్తును నొక్కండి.. ఆ తరువాత ఎలో అని నొక్కండి.. మినిట్ టూ మినిట్ బ్రెకింగ్ న్యూస్ మీ ముంగిట’*🔔*