Telugu News

నాచారంలో వైభవంగా తిరునక్షత్ర వేడుకలు

0

నాచారంలో వైభవంగా తిరునక్షత్ర వేడుకలు

== భారీగా తరలివచ్చిన భక్తులు

ఏన్కూరు మే 18 (విజయం న్యూస్ )

ఏన్కూరు మండలం నాచారం శ్రీ శ్రీ శ్రీ అద్భుత వెంకటేశ్వర స్వామి ఆలయంలో 21వ,తిరునక్షత్ర వేడుకను గురువారం అత్యంత వైభవంగా నిర్వహించారు. స్వామి వారికి మేలుకొలుపు,సుప్రభాత సేవతో ప్రారంభించారు. ఆరాధన శాత్తుమర్తే, మంగళ శాసనం వాసుదేవ పుణ్యా వచనం, విశ్వక్సేనా రాధన పూజ, రక్షాబంధనం,

ఇది కూడా చదవండి:- ఏన్కూరులో రోడ్డు ప్రమాదం…ఇద్దరి మృతి

కలిశాభిషేకం,మూలమంత్రం, అశ్విని తిరునక్షత్ర పూజ,పాలు పెరుగు నెయ్యి తేనె పంచదార పంచామృత అభిషేకాలు, సుగంధ ద్రవ్యాలతో,పండ్ల రసాలతో ప్రత్యేక అభిషేకం కార్యక్రమాన్ని వేదపండితులు ఘనంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాలు డప్పు వాయిద్యాలతో వేదపండితుల మంత్రోచ్ఛరణాలు,భాజా భజంత్రీలు నడుమ మూలమంత్ర హోమం కార్యక్రమాన్ని నిర్వహించారు. విష్ణు సహస్రనామములు, జపయోగం ఆరగింపు తీర్థప్రసాద గోష్టి తదితర పూజా కార్యక్రమం నిర్వహించారు.

ఇది కూడా చదవండి:- జర్నలిస్టుల ఇళ్ల స్థలాల పంపిణీకి పచ్చజెండా

అదేవిధంగా మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు శ్రీనివాసచార్యులు, ఆలయ నిర్వహణ అధికారి శేషయ్య, ఆలయ కమిటీ చైర్మన్ దళపతి వెంకటేశ్వరరాజు ఆలయాభివృద్ధి ప్రదాత మొగిలి శ్రీనివాసరెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు, సిబ్బంది అధిక సంఖ్యలో పాల్గొన్నారు.