Telugu News

గురుకుల ప్రవేశాలకు నిలయం – టిఎల్ పేట గ్రామం

0

గురుకుల ప్రవేశాలకు నిలయం – టిఎల్ పేట గ్రామం

ఏన్కూరు ఏప్రిల్ 26:
ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం తూతక లింగన్నపేట గ్రామం గురుకుల విద్యాలయ ప్రవేశాలకు నిలయంగా మారింది. మూడు దశాబ్దాల నుంచి ఈ గ్రామానికి చెందిన వందలాది మంది విద్యార్థులు వివిధ గురుకుల విద్యాలయాల్లో సీట్లు సాధించి ఉన్నత స్థాయికి ఎదిగారు. వివిధ ఉద్యోగాల్లో స్థిరపడ్డ వాళ్ళు ఉన్నారు. ఈ గ్రామానికి చెందిన జుజ్జురి కృష్ణమాచారి గురుకుల విద్యాలయాల్లో 5వ తరగతిలో ప్రవేశాలకు సుమారు మూడు దశాబ్దాల నుంచి శిక్షణ ఇస్తున్నారు.

ఇది కూడా చదవండి:–రాములోరికి మొక్కి..గంగమ్మ ను పూజించి..*

ప్రతి సంవత్సరం 90 శాతం కు పైగా సీట్లు సాధిస్తున్నారు .గత రెండేళ్ల నుంచి నూరు శాతం ఫలితాలు సాధిస్తూ జిల్లాలోనే టీ.ఎల్ పేట గ్రామానికి మంచి పేరు తీసుకొస్తున్నారు. ప్రతిఏటా గురుకుల విద్యాలయాల్లో ప్రవేశ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధిస్తున్న విద్యార్థులకు శిక్షణ ఇస్తున్న
కృష్ణమాచారిని గ్రామస్తులతోపాటు, ప్రజాప్రతినిధులు, అధికారులు అభినందిస్తున్నారు. ఇదే గ్రామంలోని పలు కుటుంబాలలోని పిల్లలు వరుసగా వివిధ గురుకుల విద్యాలయాల్లో సీట్లు సాధిస్తుండటంతో ఆ కుటుంబాల వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు.