Telugu News

===దళిత సిఎంతోనే తెలంగాణకు విముక్తి

== =అప్పుడే నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు

0

===దళిత సిఎంతోనే తెలంగాణకు విముక్తి
== =అప్పుడే నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు
== =టిఎస్‌పిఎస్‌సి ముందు షర్మిల మెరుపధర్నా
== =అరెస్ట్‌ చేసి పోలీస్‌ స్టేషన్‌కు తరలింపు
====(హైదరాబాద్‌-విజయంన్యూస్):-
దళితుడిని సిఎం చేస్తేనే తెలంగాణ నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయని, కెసిఆర్‌ పీడ విరుగడ అవుతుందని వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల ఘాటు వ్యాఖ్యలు చేసారు. ఉద్యోగాలు రాకపోవడంతో యువత ఆత్మహత్యలు చేసుకుంటున్నా సీఎం కేసీఆర్‌లో చలనం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయాలని డిమాండ్‌ చేస్తూ టీఎస్‌పీఎస్సీ ఆఫీసు ఎదుట ధర్నాకు దిగిన వైఎస్‌ షర్మిలను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు.

also read :-==నేటినుంచే మేడారం జనజాతర

అరెస్టు అనంతరం ఆమె పోలీసు స్టేషన్‌లో ధర్నాను కొనసాగించారు. ఉద్యోగాలు రాకపోవడంతో యువత ఆత్మహత్యలు చేసుకుంటున్నా సీఎం కేసీఆర్‌లో చలనం లేదని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగాలు ఇవ్వని ఈ సీఎం మనకొద్దన్నారు. తక్షణం కేసీఆర్‌ సీఎం పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి వెంటనే నోటిఫికేషన్లను విడుదల చేయాలని కోరుతూ మంగళవారం మధ్యాహ్నం ఆమె.. టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌ జనార్దన్‌ రెడ్డిని కలిసి వినతి పత్రం ఇచ్చారు. అనంతరం టీఎస్‌పీఎస్సీ ఆఫీసు ఎదుటనే ఆమె ధర్నాకు దిగారు. నిరుద్యోగులకు సంఫీుభావంగా సాయంత్రం వరకు టీఎస్‌పీఎస్సీ కార్యాలయం ముందు నిరసన దీక్ష చేస్తానని చెప్పారు.

also read :-***గిరిజనుల ఆరాధ్య దైవం శ్రీశ్రీశ్రీ సద్గురు సంత్ సేవాలాల్ మహారాజ్ – మంత్రి పువ్వాడ.

అయితే పోలీసులు అరెస్ట్‌ చేశారు. తెలంగాణలో నిరుద్యోగులకు వెంటనే నోటిఫికేషన్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ టీఎస్‌పీఎస్సీ కార్యాలయం ముందు మెరుపు దీక్షకు దిగారు. దీంతో పోలీసులు వైఎస్సార్టీపీ నేతలు, కార్యకర్తలను అదుపులోకి తీసుకుంటున్నారు. అలాగే షర్మిలను కూడా అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. తెలంగాణ ఏర్పడి ఏడేళ్లు దాటుతున్నా.. ఇంతవరకు ఉద్యోగ నోటిఫికేషన్‌ ఇవ్వలేదని షర్మిల ఆరోపించారు. వెంటనే నోటిఫికేషన్‌ ఇవ్వాలని ఆమె డిమాండ్‌ చేశారు. ఉద్యోగాలు ఇవ్వని ఈ సీఎం మనకొద్దన్నారు.

తక్షణం కేసీఆర్‌ సీఎం పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం నియమించిన బిస్వాల్‌ కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారమే.. రాష్ట్రంలో లక్షా 90 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, వాటిని వెంటనే భర్తీ చేయాలని షర్మిల డిమాండ్‌ చేశారు. నిరుద్యోగ భృతి పథకాన్ని కూడా వెంటనే అమలులోకి తేవాలని అన్నారు. ఉద్యోగాలు ఇవ్వడం చేతకాని సీఎం బండకట్టుకొని దేనిలోనైనా దూకితే నిరుద్యోగుల నెత్తిన పాలు పోసినట్లేనని అన్నారు.

దళితుడిని సీఎం చేస్తే నిరుద్యోగులకు న్యాయం జరుగుతుందని చెప్పారు. దేశవ్యాప్తంగా నిరుద్యోగ సమస్య కనిపించే మన సీఎం కేసీఆర్‌కు తెలంగాణలోని నిరుద్యోగం కనిపించడం లేదా అని ఆమె నిలదీశారు. కొత్త జిల్లాల వారీగా ఉద్యోగాలను భర్తీ చేయాలని షర్మిల డిమాండ్‌ చేశారు. టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌ ను అడిగితే ఉద్యోగాల భర్తీపై తమకు ఎలాంటి ఆదేశాలు లేవని చెప్తున్నారంటేనే నిరుద్యోగ సమస్యపై కేసీఆర్‌ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఏంటో తెలుస్తోందని అన్నారు.