Telugu News

తెలంగాణా పై కేంద్రానికి వివక్షతేందుకు..?: నామ

కేంద్రం తీరుపై నామ మండిపాటు

0
తెలంగాణా పై కేంద్రానికి వివక్షతేందుకు..?
?కేంద్రం తీరుపై నామ మండిపాటు
?కావాలనే తెలంగాణా పై వివక్ష
?రైల్వే తీరు పట్ల నామ ధ్వజం
?ప్రొటోకాల్ తప్పనిసరిగా  పాటించాలి
?దిశ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ సమావేశంలో ఎంపీ నామ
ఖమ్మం, భద్రాద్రికొత్తగూడెం, నవంబర్ 26(విజయంన్యూస్) :
ఉమ్మడి ఖమ్మం జిల్లా పట్ల రైల్వే  నిర్లక్ష్య వైఖరిపై టీఆర్ఎస్ లోక్ సభా పక్ష నేత, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు తీవ్ర స్థాయిలో మండి పడ్డారు. శనివారం జరిగిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దిశ కమిటీ సమావేశానికి ఎంపీలు నామ ,కవిత  అధ్యక్షత వహించి మాట్లాడారు.ఈ సందర్భంగా నామ మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాపైనే కాకుండా యావత్ తెలంగాణా రాష్ట్రం పట్ల  తీవ్ర వివక్షత ప్రదర్శిస్తున్నారని ద్వజమెత్తారు. భద్రాచలం – కొవ్వూరు రైల్వే మార్గం కోసం ఎంపీ గా తాను చేయని పోరాటం లేదు..15వ లోక్ సభలో ప్రధాన మంత్రికి, కేంద్ర మంత్రులకు ఏకంగా 125 కి పైగా లేఖలు రాశాను..
ఇది కూడా చదవండి: మానవ నిత్య జీవితంలో సైన్స్​ పాత్ర ఎంతో ఉంది..మంత్రి పువ్వాడ
ఇది ఒక చరిత్ర అని నామ అన్నారు. కేవలం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన 70 శాతం సింగరేణి నిధులతో భద్రాచలం – సత్తుపల్లి రైల్వే మార్గం పూర్తి చేశారని అన్నారు. సత్తుపల్లి నుంచి కొవ్వూరు  వరకు మార్గాన్ని చేపట్టకుండా వదిలేశారని , ఇది తెలంగాణా పట్ల వివక్షత కాక మరేమిటని నామ రైల్వే అధికారులను ప్రశ్నించారు. కేంద్రం ఒక్క పైసా ఇవ్వకుండా రైల్వే ప్రాజెక్టులను అడ్డుకుంటుందని, అందులో బాగంగానే కొవ్వూరు వరకు రైల్వే మార్గాన్ని వదిలేశారని పేర్కొన్నారు. తెలంగాణా పట్ల కేంద్ర వైఖరిని నిరసిస్తూ త్వరలో జరిగే పార్లమెంట్ సమావేశాల్లో ప్రస్తావిస్తానన్నారు.కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ఇతర అంశాలు గురించి చర్చిస్తామని అన్నారు. అందరూ మద్దతు తెలపాలన్నారు. రైల్వే కార్యక్రమాలకు ప్రొటోకాల్ కూడా పాటించడం లేదని నామ ఆగ్రహం వ్యక్తం చేశారు. పియంజిఎస్వై వంటి పధకాలకు సంబంధించి కూడా ప్రొటోకాల్  పాటించడం లేదని, పదే పదే చెబుతున్నా అధికారుల తీరులో మార్పు రావడం లేదని నామ అన్నారు. ప్రజా ప్రతినిధులు, అధికారులంతా ప్రజలకు జవాబుదారితనంగా ఉండాలని అన్నారు. ప్రజలకు ఏ సమస్య వచ్చినా బాధ్యతతో పరిష్కరించాలన్నారు. క్షేత్ర స్థాయిలో తలెత్తే సమస్యలను సత్వర పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. మరో ముఖ్యమైన విషయం ప్రోటోకాల్ అన్నారు. అందరూ తప్పనిసరిగా ప్రోటోకాల్ పాటించాలని సూచించారు.8 ఏళ్లలో తెలంగాణ అనూహ్యంగా అభివృద్ధిని సాధించి, అవార్డుల పంట పండిస్తుందన్నారు.
 ఇది కూడా చదవండి: ఆరోగ్య తెలంగాణే లక్ష్యం:మంత్రి పువ్వాడ.
గ్రామ, పట్టణ స్థాయిలో జరుగుతున్న అభివృద్ధి వల్ల వాటి రూపు రేఖలు మరిపోయాయని అన్నారు. ఇందుకు నిదర్శనం తెలంగాణ కు వచ్చిన అవార్డులేనన్నారు. ఈ సందర్భంగా ప్రజా ప్రతినిధులు లేవనెత్తిన పలు అంశాలపై ఎంపీ నామ సంబంధిత అధికారుల చేత సవివరణ ఇప్పించారు.ప్రజా ప్రతినిధులు లేవనెత్తిన సమస్యలను సాధ్యమైనంత త్వరగా పరిస్కారమయ్యేలా చర్యలు తీసుకోవాలని నామ సంబంధిత అధికారులను ఆదేశించారు.వచ్చే సమావేశం నాటికి సమస్యలు పరిష్కారం చేసేలా చూడాలని నామ అన్నారు. సింగరేణి ప్రధాన కేంద్రంలో జరిగే ముఖ్యమైన దిశ సమావేశానికి ఎందుకు సీనియర్ అధికారులు రావడం లేదని ప్రశ్నించారు. సీనియర్ అధికారులైన డైరెక్టర్లు, జీఎం ఎందుకు సమావేశానికి రావడం లేదన్నారు. ఈ విషయాన్ని చైర్మన్ దృష్టికి తీసికెళ్లాలని, వచ్చే సమావేశానికి పరిస్థితిలో మార్పు రావాలన్నారు. సీఎస్ఆర్  ఫండ్స్ ఎందుకు ఉమ్మడి ఖమ్మం  జిల్లాకు ఇవ్వడం లేదన్నారు. ఇది సరైన పద్ధతి కాదని నామ పేర్కొన్నారు. సీఎస్ఆర్  ఫండింగ్ విషయంలో సరైన సమాచారం ఉండడం లేదని నామ అన్నారు.  ఈ సందర్భంగా నామ అన్ని శాఖల వారీగా సమీక్షించారు.మహబూబాబాద్ ఎంపీ కవిత, రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్యే లు వనమా వెంకటేశ్వరరావు, మెచ్చా నాగేశ్వరరావు, రేగా కాంతారావు, హరిప్రియ, ఎమ్మెల్సీ తాత మధు, జిల్లా పరిషత్ చైర్మన్ కోరం కనకయ్య, మున్సిపల్ చైర్మన్ సీతామహాలక్ష్మీ, కలెక్టర్ అనుదీప్, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.