Telugu News

గుర్వాయిగూడెం నర్సరికి దిక్కేవ్వరు..?

= ఎండుతున్న మొక్కలు.. మర్సతో నింపుతున్న సంచులు

0

గుర్వాయిగూడెం నర్సరికి దిక్కేవ్వరు..?
== ఎండుతున్న మొక్కలు.. మర్సతో నింపుతున్న సంచులు
== పట్టించుకునేవారే లేరా..?
(కూసుమంచి-విజయంన్యూస్);-
తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన పథకం హరితహారం.. మన పంచాయతీ..మన నర్సరీ పేరుతో స్వయంగా పంచాయతీ ఆధ్వర్యంలో మొక్కలను పెంచడం.. వర్షాకాలంలో మొక్కలను నాటడం.. వాటిని మానుగా మార్చడం ప్రభుత్వ ఉద్దేశ్యం.. మొక్కలను నాటి చెట్లను పెంచి పర్యావరణాన్ని కాపాడాలనేది ప్రభుత్వం లక్ష్యం.. ప్రభుత్వ ఆలోచనకు అనుగుణంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పంచాయతీలో నర్సీలను పంచాయతీలు నడిపిస్తున్నాయి.. సుమారు ప్రతి ఏడాది 1,40,000 మొక్కలను పంచాయతీ నర్సరీలో పెంచడం, వాటిని వర్షాకాలంలో నాటడం, ప్రతి రోజు వాటిని సంరక్షించడం పంచాయతీలకు బాధ్యత. పంచాయతీ సర్పంచ్, కార్యదర్శి, సభ్యులు అందుకు బాధ్యత వహించాలి.

also read;-విద్యాసంస్థలకు సెలవులు

మొక్కలను పెంచడం కోసం ప్రత్యేకంగా సిబ్బందిని ఏర్పాటు చేసుకోవచ్చని ప్రభుత్వం చెప్పింది. దీంతో ప్రతి పంచాయతీలో కూడా అద్భుతంగా నర్సరీలను నడిపిస్తూ మొక్కలను సంరక్షిస్తున్నారు. అయితే కూసుమంచి మండలంలోని గుర్వాయిగూడెం గ్రామంలో మాత్రం నర్సరీలను పట్టించుకునే వారే కరువైయ్యారు. గతంలో ప్రైవేట్ భూమిలో నర్సరీని ఏర్పాటు చేయగా ఆ సమయంలో నర్సరీ అద్భుతంగా నడిచింది. ప్రస్తుతం ఊరిశివారులోని శ్మశాన వాటిక సమీపంలో నర్సరీని ఏర్పాటు చేసి, మొక్కలను పెంచే పనిలో పంచాయతీ పాలకమండలి, కార్యదర్శి నిమగ్నమైయ్యారు. కానీ అక్కడ నర్సరీ అంటే ఇదేనా..? అనే విధంగా అంత ఘోరంగా ఉంది. వాహనంలో తీసుకొచ్చిన మొక్కలను అక్కడ దింపినట్లుగా ఉంది. వందలాధి మొక్కలు ఎండిపోగా, చాలా మొక్కలు వడబడిపోతున్నాయి.. వాటికి నీళ్లు లేవు.. వాటిని పట్టించుకునేనాథుడే కరువైయ్యారు. ఇదిలా ఉంటే ప్యాకెట్లలో మట్టిపోసి, అందులో విత్తనాలను పెట్టి మొక్కలను పెంచాలని ప్రభుత్వం ఆదేశించింది. అయితే కవర్లలో ఎర్రమట్టి, చెరువు మట్టి ఉపయోగించాల్సి ఉంటుంది.

also read;-రేప‌టి నుంచి విద్యాసంస్థ‌లు, షాపులు అన్నీ బంద్‌..! ||

కానీ గుర్వాయిగూడెంలో ప్యాకెట్లో మర్సమట్టిని ఉపయోగిస్తున్నారు. ఆ మట్టిని జల్లెడ పట్టి రాళ్లను వేరు చేసి అందులో పడుతున్నారు. మర్స మట్టిలో మొక్కలు మెలిచే అవకాశమే లేదు. చాలా తక్కువ రిజల్ట్ వస్తుంది. అలాగే గ్రామంలో వేసిన మొక్కలకు సక్రమంగా నీటి వసతి కల్పించడం లేదని గ్రామస్థులు చెబుతున్నారు. దీంతో గుర్వాయిగూడెంలో హరితహారం పథకంలోని ప్రభుత్వ లక్ష్యం నీరుగారిపోతుంది. అలాగే వేలాధి రూపాయలు ఖర్చు చేస్తుండగా ఫలితం లేకుండా పోతుంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఆ నర్సరీలొ సక్రమంగా మొక్కలను కాపాడాలని కోరుతున్నారు.